- Home
- Entertainment
- Ilaiyaraaja explains his pride ఇళయరాజా పాటకి పరవశించే ఏనుగుల గుంపు: అందుకే ఆయనకంత గర్వం
Ilaiyaraaja explains his pride ఇళయరాజా పాటకి పరవశించే ఏనుగుల గుంపు: అందుకే ఆయనకంత గర్వం
ఇళయరాజా ఒక సంగీత శిఖరం. ఆయనకు పొగరు, గర్వం ఎక్కువ అని చాలామంది అంటారు. దాని గురించి ఇలా వివరిస్తూ.. ‘ప్రపంచంలో ఏ సంగీత దర్శకుడూ చేయని ఒక అద్భుతాన్ని నేను చేశాను, అందుకే నాకు గర్వం ఉండి తీరాల్సిందే’ అన్నారు.

కళకు అతీతమైన ఇళయరాజా సంగీతం
సంగీత దిగ్గజం ఇళయరాజా సంగీతాన్ని ఇష్టపడని వారు ఉండరు. తన సంగీత మాయాజాలం గురించి ఇళయరాజా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఒక పాట ఒక వ్యక్తిలో ఏం చేస్తుందని యాంకర్ అడిగిన ప్రశ్నకు, "ఏం చేయాలో అదే చేస్తుంద"ని నవ్వుతూ సమాధానమిచ్చారు. పాట కళాత్మక వ్యక్తీకరణా లేక అంతకు మించినదా అన్న ప్రశ్నకు, "దానికి ఒక అతీత శక్తి ఉందని మీరే భావిస్తున్నారు. అదే నిజం. నేను హార్మోనియం ముందు ఏదో వాయిస్తుంటాను, అది మిమ్మల్ని చేరుతుంది."
శిశువుకు ప్రాణం పోసిన సంగీతం
ఉదాహరణకు ఒక గర్భిణి కడుపులోని శిశువు ఇబ్బందికర పరిస్థతిలో ఉన్నప్పుడు నా తిరువాసగం సంగీతం ప్రాణం పోసింది. శిశువులో చలనం లేదని తెలిసి వైద్యులు ఆపరేషన్ చేయబోతుండగా, ఆ తల్లి తిరువాసగం వినాలని కోరారు. దాన్ని ప్లే చేయగానే శిశువుకు ప్రాణం వచ్చింది. త్రిసూర్‌లో నిద్రపట్టని ఒక ఏనుగుకు నేను స్వరపరిచిన మలయాళ తాలా పాటను మావటి పాడగానే ఏనుగు నిద్రపోయింది. ఇదెలా సాధ్యం?
ఏనుగులే ఇష్టపడి విన్న పాట
ఒక టూరింగ్ థియేటర్‌లో నేను స్వరపరిచిన ఒక పాట వినిపించినప్పుడల్లా దాన్ని వినడానికి అడవి నుండి ఏనుగుల గుంపు వచ్చేది. పొలాలకు, పంటలకు నష్టం కలిగించకుండా థియేటర్ ముందు వచ్చి ఆ పాట వచ్చే వరకు వేచి ఉండి, విని తిరిగి అడవికి వెళ్ళేవి. వైదేహి కాతిరుందాళ్ సినిమాలోని రాసాతి పాట వినడానికే ఆ ఏనుగులు వచ్చేవి.
ఇళయరాజా ఓపెన్ టాక్
ప్రపంచంలో ఏ గొప్ప సంగీత దర్శకుడి జీవితంలోనైనా ఇలా జరిగిందా? నాకు జరిగింది అంటే అది సంగీతానికి ఉన్న అతీత శక్తి వల్లే. నేను చెప్తే గర్వం అంటారు. ప్రపంచంలో ఎవరూ చేయలేనిది, చేయలేని దాన్ని నేను చేస్తున్నా. అప్పుడు నాకు పొగరు ఉండదా? అంత మంచి పని చేస్తేనే గర్వం వస్తుంది. ఏమీ చేయకుండా గర్వం అంటే ఎలా ఉంటుంది. విషయం ఉన్నవాడికి గర్వం ఉండదా?" అని ఇళయరాజా అన్నారు. ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి.