- Home
- Entertainment
- షాకింగ్ న్యూస్ కెజియఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెలుగువాడే, ఆయన తండ్రి ఎవరో తెలుసా..?
షాకింగ్ న్యూస్ కెజియఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెలుగువాడే, ఆయన తండ్రి ఎవరో తెలుసా..?
ప్రశాంత్ నీల్.. రాజమౌళి తరువాత సౌత్ సినిమా సత్తాని మన దేశంతో పాటు ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు. వెయ్యికోట్ల కలెక్షన్ మార్క్ ను చేరుకున్న భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కించిన ఈ యండ్ డైరెక్టర్ తెలుగువాడే అని తెలుసా..?

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ప్రశాంత్ నీల్ సరికొత్త సంచలనంగా మారాడు. యష్ హీరోగా ఆయన తెరకెక్కించిన కెజీఎఫ్ సినిమాలు ఇండియాన్ బాక్సాఫీస్ దుమ్ము దులిపాయి. ఇక కేజీఎఫ్ 2 అయితే ఇప్పటికే 1000 కోట్ల కలెక్షన్ మార్క్ ను టచ్ చే సింది. బాలీవుడ్ లో ఏకంగా 321 కోట్లను కొల్లగొట్టి, హిందీ వాళ్లు సౌత్ కు చేసిన అవమానాలకు రివేంజ్ గట్టిగా తీర్చుకుంది. ఇక అంతగా ప్రమోషన్స్ కూడా లేకుండానే కన్నడ చిత్రసీమను తన సినిమాల ద్వారా ప్రశాంత్ నీల్ ఒక రేంజ్ కు తీసుకెళ్లాడు.
ఇక ఇన్నాళ్లు ఎవరు పట్టించుకోలేదు కానీ..ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే... ప్రశాంత్ నీల్ అచ్చంగా మన తెలుగువాడే. అసలు సిసలైన రాయలసీమ కుర్రాడే ప్రశాంత్. ఆయనది అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం. ఇంకో షాకింగ్ విషయం ఏంటీ అంటే.. నీలకంఠాపురం అనగానే మనకు మాజీ మంత్రి రఘువీరారెడ్డి గుర్తుకొస్తారు. ప్రశాంత్ నీల్ ఎవరో కాదు... రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్ రెడ్డి కుమారుడు.
అయితే సుభాష్ రెడ్డి కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. కొన్నేళ్ల క్రితమే ప్రశాంత్ నీల్ తండ్రి చనిపోయారు. ఆయనను నీలకంఠాపురంలోనే అంత్యక్రియలు చేసి.. మెమోరియల్ కూడా కట్టారు. అప్పుడప్పుడు నీల్ తన హోమ్ విలేజ్ కు ఫ్యామిలీతో పాటు వచ్చి వెళ్తుంటాడట.ఇక కేజీఎఫ్ 2 రిలీజ్ రోజు కూడా ప్రశాంత్ నీల్ ఈ గ్రామానికి వచ్చిన తన తండ్రి సమాధిదగ్గర ఆశీర్వాదాలు తీసుకుని వెళ్లాడట.
ప్రశాంత్ నీల్ అసలు పేరు ప్రశాంత్ నీలకంఠాపురం. ప్రశాంత్ స్టడీస్ అంతా బెంగళూర్ లోనే జరిగింది. సిటీలో హాయ్ ల్యాండ్ ప్రాంతంలో వారు స్థిరనివాసం ఏర్పరుచుకున్నట్టు సమాచారం. అయితే అక్కడ ఎక్కువగా సినిమా షూటింగ్స్ జరుగుతుండటంతో.. ప్రశాంత్ నీల్ కు వాటిపై ఇంట్రెస్ట్ పెరిగింది. దీంతో ఆయన షూటింగ్స్ ను బాగా గమనించేవారట.
ఎంబీఏ పూర్తి అయిన వెంటనే ఫిల్మ్ స్కూల్ లో చేరి, అన్ని విభాగాలపై ప్రశాంత్ అవగాహన పెంచుకున్నాడు. 2014లో కన్నడ ఇండస్ట్రీ నుంచి తొలి సినిమా ఉగ్రమ్ ను ఆయన తెరకెక్కించాడు. ఏ మాత్రం అంచనాలు లేని ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు ఎంత ప్రభంజనం సృష్టించాయో తెలిసిందే.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమా తరువాత టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాన్ ఇండిమా మూవీని రూపొందించబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఆయన నెక్ట్స్ మూవీస్ అన్నీ టాలీవుడ్ హీరోలతోనే ఫిక్స్ అయినట్టు సమాచారం.