MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సినిమా చూసి వారితో ప్రేమలో పడకపోతే నా పేరు మార్చుకుంటా.. మృణాల్‌ ఠాకూర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌..

సినిమా చూసి వారితో ప్రేమలో పడకపోతే నా పేరు మార్చుకుంటా.. మృణాల్‌ ఠాకూర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌..

మృణాల్‌ ఠాకూర్‌ తాజాగా ఓ బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. `హాయ్‌ నాన్న` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆమె సినిమా గురించి చెబుతూ తన పేరు మార్చుకుంటా అని చెప్పడం హాట్‌టాపిక్‌ అవుతుంది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 30 2023, 07:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

`సీతారామం` బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ తాజాగా హాట్‌ టాపిక్‌ అవుతుంది. తాజాగా ఆమె చేసిన కామెంట్‌ ఇండస్ట్రీనిలో రచ్చ చేస్తుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఒక సినిమా కోసం తన పేరు మార్చుకుంటానని తను చేసిన కామెంటే అందుకు కారణం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మృణాల్‌ ఠాకూర్‌ ప్రస్తుతం హీరో నానితో కలిసి `హాయ్‌ నాన్న` చిత్రంలో  నటిస్తుంది. ఇందుల్‌ శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఆయన డెబ్యూ డైరెక్టర్‌. ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. తాజాగా వైజాగ్‌లో ప్రీ రిలీజ్‌ఈవెంట్‌ని నిర్వహించారు. 
 

37

అందులో భాగంగా రెడ్‌ శారీలో మెరిసింది మృణాల్‌. ఆమె అందాలు అదరహో అనేలా ఉన్నాయి. చీరలో ఆద్యంతం కట్టిపడేస్తుంది. తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. `హాయ్‌ నాన్న` ఈవెంట్‌కి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అయితే ఆమె చేసిన కామెంట్స్ మరింత ఆకట్టుకుంటున్నాయి. సినిమా పై ప్రశంసలు కురిపించింది. 
 

47

మృణాల్‌ ఇందులో ఆమె మాట్లాడుతూ, శౌర్యువ్‌ తనకు కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్‌ అయ్యానని, అయితే నానితో స్క్రీన షేర్‌ చేసుకోబోతున్నానని తెలిసి మరింత ఎగ్జైట్‌ అయ్యాను. నానితో పనిచేయడం వండర్‌ఫుల్‌ ఎక్స్ పీరియెన్స్. కియారా(బాలనటి)తో పనిచేయడం అద్భుతంగా అనిపించింది. ఈ సినిమాతో నాకు మంచి ఫ్రెండ్‌ దొరికింది. 

57

నన్ను ఆదరిస్తున్న తెలుగు ఆడియెన్స్ కి ధన్యవాదాలు. `సీతారామం`లో సీతగా ఎంతో ఆదరించారు. ప్రేమించారు. ఒక తెలుగు అమ్మాయిగా గుర్తించారు. ఈ ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది. అలాగే `దర్శన` అనే పాటతో మ్యూజిక్‌ డైరెక్టర్‌ హేషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌తో ప్రేమలో పడిపోయా. దర్శన పాట లాగే ఇందులోని పాట మారుమోగుతుంది. 

67

ఇక సినిమాలో కూతురు తండ్రి మధ్య బాండింగ్‌ అద్భుతంగాఉంటుంది. సినిమా చేసేటప్పుడు నాకు మా నాన్న గుర్తొచ్చారు. నాని, పాప మధ్య బాండింగ్‌ బాగుంటుంది. సినిమా చూశాక వారితో మీరు ప్రేమలో పడతారు. ఒకవేళ పడకపోతే నా పేరు మార్చుకుంటా` అని హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. 

77

ఇందులో తాను యష్నా పాత్రలో కనిపిస్తుందని తెలిపింది మృణాల్‌. డిసెంబర్‌ 7న ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదల కానుంది. ఇందులో శృతి హాసన్‌ గెస్ట్ రోల్‌ కనిపిస్తుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Recommended image1
MGR: భాగ్యరాజ్‌ హీరో కావడం వెనుక మైండ్‌ బ్లాంక్‌ అయ్యే స్టోరీ.. విజయకాంత్‌ని పక్కన పెట్టిన ఎంజీఆర్‌
Recommended image2
Sanya Malhotra: బ్లాక్ డ్రెస్‌లో అదరగొట్టిన సాన్య.. క్రేజీ ఫోజులతో సోషల్ మీడియాలో దుమారం
Recommended image3
Rajesh Sharma: ఆసుపత్రి పాలైన ప్రముఖ నటుడు, రేవంత్ రెడ్డికి కంప్లైంట్.. అసలేం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved