- Home
- Entertainment
- నా భాషపైనే ట్రోల్స్ చేశారు.. నేను తెలంగాణ బిడ్డనే.. అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
నా భాషపైనే ట్రోల్స్ చేశారు.. నేను తెలంగాణ బిడ్డనే.. అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
అనసూయ తరచూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతుంటుంది. తన డ్రెస్, తన ఏజ్, కామెంట్స్ పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తుంటారు.తాజాగా దీనికి సంబంధించి అనసూయ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.

Anasuya Bharadwaj
అనసూయ అంటే అందం, అనసూయ అంటే వివాదం అన్నట్టుగా మారిపోయింది చాలా రోజులుగా. కానీ `రంగస్థలం`, `రంగమార్తాండ` వంటి చిత్రాలతో నటిగా ఆమె ఏంటో చూపించింది. అద్భుతమైన నటనతో అదరగొట్టింది. సినిమా అవకాశాలు ఊపందుకోవడంతో టీవీ షోస్‌ని కూడా పక్కన పెట్టింది. ట్రోల్స్, కామెంట్స్ నుంచి దూరంగా ఉండేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పిన విషయం తెలిసిందే.
తాను చాలా సందర్భాల్లో భాషకి సంబంధించిన ట్రోల్స్ ఎదుర్కొందట. నిజం చెప్పాలంటే తనపై ట్రోల్స్ భాష నుంచే మొదలయ్యాయని చెప్పింది అనసూయ. ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తనపై ట్రోల్స్ కి సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు తాను మాట్లాడే భాషలపై ట్రోల్స్ వచ్చాయని చెప్పింది. నెటిజన్ల కామెంట్లకి తాను ఇంగ్లీష్‌లో స్పందిస్తుంటే, ఫస్ట్ నువ్వు తెలుగులో మాట్లాడు అని, తెలుగు చెప్పు అంటూ ట్రోల్ చేశారని, నిజం చెప్పాలంటే అక్కడి నుంచే తనపై ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయని వెల్లడించింది.
అయితే తాను తెలంగాణ బిడ్డనే అని, ఇంట్లో తెలంగాణ భాషలోనే మాట్లాడుకుంటామని తెలిపింది అనసూయ. కాకపోతే స్టడీస్, పెరిగిన విధానం నేపథ్యంలో తనకు ఇంగ్లీష్ ఎక్కువగా వస్తుందని, ఇంట్లో ఇంగ్లీష్, హిందీ మాట్లాడుకుంటామని వెల్లడించింది. కానీ కమ్యూనికేషన్‌కి భాష ముఖ్యం కాదు, ఎమోషన్స్ ముఖ్యమని వెల్లడించింది హాట్ యాంకర్ అనసూయ. ఇటీవల కాలంలో తనపై వచ్చిన ట్రోల్స్ కి సంబంధించి కొందరిపై కేసు పెట్టి శిక్ష పడేలా చేశానని, తాను ఏదైనా చేయగలననే సందేశాన్ని ట్రోలర్స్ కి ఇచ్చానని వెల్లడించింది. ఇకపై వాటి జోలికి వెళ్లదలుచుకోలేదని, తానేంటో చూపించాను అది చాలు అని తెలిపింది అనసూయ.
మరోవైపు `రంగమార్తాండ` చిత్రంలో కోడలు గీతా రంగారావు పాత్రలో అనసూయ నటించిన విషయం తెలిసిందే. ఈ పాత్ర చాలా విషయాల్లో తన రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉంటుందన్నారు. సినిమాలో అత్తా మామలను తిడుతూ, డామినేట్ చేసే పాత్రలో కనిపిస్తుంది అనసూయ. అయితే రియల్ లైఫ్‌లోనూ అలాంటి సంఘటనలు జరిగాయా? అనే ప్రశ్నకి అనసూయ స్పందిస్తూ, తాను మరీ అంత రాష్ కాదని, కూల్‌గా చెబుతానని వెల్లడించింది. అయితే అత్తా మామల విషయంలో చనువుతో ఉంటానని, ఆ చనువుతోనే కొన్ని గట్టిగా చెబుతానని వెల్లడించింది. ఈ సినిమా చూశాక తాను అత్తామామలకు ఫోన్ చేసి సారీ చెప్పినట్టు వెల్లడించింది.
తెలుగు చిత్ర పరిశ్రమ గురించి చెబుతూ ఒకప్పుడు టాలీవుడ్ అంటే చిన్న చూపు చూసేవారని, సౌత్ ఇండస్ట్రీ అంటే చులకన భావం ఉండేదని, కానీ ఇప్పుడు అది మారిందన్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ పటంలో నిలిచిందని, అందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలన్నారు. ప్రస్తుతం తన చేతిలో చాలా ప్రాజెక్ట్ లు ఉన్నాయని అవన్ని షూటింగ్‌లు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పింది. అందులో భాగంగా తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నానని, రెండూ ప్రభుదేవతోనే చేస్తున్నట్టు చెప్పింది అనసూయ.