ముంబైలో రామ్ చరణ్ ఇంట్లో రహస్యంగా ఉన్న మంచు లక్ష్మి... ఆ వాట్సప్ గ్రూప్ లో ఇద్దరూ!
నేను రామ్ చరణ్ ఇంట్లో ఉండేదాన్ని. ఆ విషయం ఎవరికీ చెప్పొద్దని రామ్ చరణ్ కి చెప్పాను అంటూ కీలక విషయాలు వెల్లడించింది మంచు లక్ష్మి. ఆమె షాకింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు రామ్ చరణ్ ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆమె ఎందుకు ఉండాల్సి వచ్చిందో చూద్దాం...

విలక్షణ నటుడు మోహన్ బాబు డాటర్ వరుస ఇంటర్వ్యూలతో హోరెత్తిస్తున్నారు. ఇటీవల తన తండ్రి మీద పరోక్షంగా ఆమె ఆరోపణలు చేసింది. సౌత్ ఇండియాలో హీరోల కూతుళ్లు, సిస్టర్స్ కి ఆఫర్స్ ఇవ్వరని ఆమె అన్నారు. మా నాన్నకు నేను నటి కావడం ఇష్టం లేదని. పితృస్వామ్య సమాజంలో నేను కూడా బాధితురాలిని అని మంచు లక్ష్మి చెప్పడం సంచలనం రేపింది.
కెరీర్ కోసం ప్రస్తుతం మంచు లక్ష్మి మకాం ముంబై కి మార్చింది. తన ఫ్రెండ్స్ రకుల్ ప్రీత్, రానా ముంబై రావాలని కోరారని, ప్రోత్సహించారని ఆమె వెల్లడించారు. తాజాగా మరో ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ముంబై వెళ్లిన మంచు లక్ష్మి ఖరీదైన అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని ఉంటుంది. ఇల్లు తీసుకోక ముందు మంచు లక్ష్మి రామ్ చరణ్ ఇంట్లో ఉన్నదట. ఈ విషయాన్ని ఆమె రహస్యంగా ఉంచారట. నేను నీ ఇంట్లో ఉంటున్నానన్న విషయం ఎవరికీ చెప్పొద్దని రామ్ చరణ్ తో మంచు లక్ష్మి చెప్పారట. నేనెందుకు చెబుతానని రామ్ చరణ్ అన్నాడట.
Manchu Lakshmi
రామ్ చరణ్ ఇంట్లో ఉంటున్న విషయాన్ని దాచడానికి ఓ కారణం ఉందట. ఆ విషయం తెలిస్తే ఎవరు తనకు ముంబైలో పని చేసి పెట్టరట. మీరు రామ్ చరణ్ ఇంట్లో ఉంటున్నారు. మీకు మా అవసరం ఏమిటి అంటారట. అందుకే ఆ విషయాన్ని రహస్యంగా ఉంచిందట. నీకు నచ్చినన్ని రోజులు నా ఇంట్లో ఉండమని రామ్ చరణ్ అన్నాడట. తానూ ఎన్ని రోజులు ఉన్నానో కూడా రామ్ చరణ్ కి తెలియదని ఆమె అన్నారు.
ఆమె ఇంకా మాట్లాడుతూ.. తాము 142 మంది ఆర్టిస్ట్స్ తో ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారట. అందులో రానా, రామ్ చరణ్ తో పాటు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారట. ఆ గ్రూప్ లో తమ చిత్రాల టీజర్స్, ట్రైలర్స్ పోస్ట్ చేస్తారట. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరూ వాటిని తమ పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేస్తారట. ఆ గ్రూప్ అందుకే క్రియేట్ చేశామని ఆమె అన్నారు.
Manchu Lakshmi
మరి ముంబై లో ఉంటున్న మంచు లక్ష్మి కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ఆమె అగ్ని నక్షత్రం టైటిల్ తో ఓ చిత్రం చేశారు. ఆ మూవీ స్టేటస్ ఏమిటో తెలియదు. అగ్ని నక్షత్రం చిత్రాన్ని విడుదల చేసే ఆలోచన ఆమెకు లేనట్లు ఉంది. ఆ చిత్ర ప్రమోషన్స్ పట్టించుకోవడం లేదు. కూతురితో పాటు ముంబైలో ఉంటుంది.