MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నిజంగా రన్బీర్ భార్యగా ఫీల్ అవమన్నాడు... ఆ సీన్ తర్వాత గట్టిగా అరిచి ఏడ్చాను!

నిజంగా రన్బీర్ భార్యగా ఫీల్ అవమన్నాడు... ఆ సీన్ తర్వాత గట్టిగా అరిచి ఏడ్చాను!

యానిమల్ మూవీతో గత ఏడాది బ్లాక్ బస్టర్ కొట్టింది రష్మిక మందాన. అయితే ఈ మూవీలో ఓ సన్నివేశం తర్వాత గట్టిగా ఏడ్చేసిందట. సెట్స్ లో ఎదురైన అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.  

1 Min read
Author : Sambi Reddy
Published : Jan 19 2024, 06:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
\

\

\

2023 సెన్సేషనల్ చిత్రాల్లో యానిమల్ ఒకటి. మిక్స్డ్ టాక్  తెచ్చుకుని కూడా భారీ వసూళ్లు రాబట్టింది. యానిమల్ వరల్డ్ వైడ్ రూ. 800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రన్బీర్ కపూర్-రష్మిక మందాన జంటగా నటించిన ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకుడు. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

శృంగారం, హింస, పురుషాధిక్యతను ప్రోత్సహించే కంటెంట్ మోతాదుకు మించి ఉందంటూ యానిమల్ మూవీపై విపరీతమైన వ్యతిరేకత వ్యక్తం అయింది. కొందరు చిత్ర ప్రముఖులు, సామాజిక వాదులు, ప్రజా ప్రతినిధులు యానిమల్ చిత్రంపై మండిపడ్డారు. ఈ  ఆరోపణలను దర్శకుడు కొట్టిపారేశారు. 

35

రష్మిక మందాన గతంలో ఎన్నడూ లేనంతగా బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. రన్బీర్ తో ముద్దు సన్నివేశాలు లెక్కకు మించి ఉన్నాయి. కాగా ఓ సన్నివేశం అనంతరం ఆమె గట్టిగా అరిచి ఏడ్చేసిందట. ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక ఈ విషయం వెల్లడించాడు. 

45

హీరో రన్బీర్ కపూర్ వేరొక మహిళతో శృంగారం చేసినట్లు భార్య రష్మిక మందానతో చెబుతాడు. అప్పుడు ఆమె రియాక్షన్..  ఆవేశం, ఆక్రోశంతో కూడుకొని ఉంటుంది. ఈ సన్నివేశంలో నిజంగా భార్యలా ఫీలై చేయాలని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చెప్పాడట. సదరు  సీన్ లో రన్బీర్ పై గట్టిగా అరుస్తూ రష్మిక చెంపపై కొడుతుంది. 

 

55
Rashmika Mandanna and Ranbir Kapoor

Rashmika Mandanna and Ranbir Kapoor

సుదీర్ఘంగా ఈ సీన్ సాగుతుంది. ఈ సీన్ మొత్తం ఒక్క టేక్ లో పూర్తి చేశారట. అసలు తనకు ఏమీ గుర్తు లేదట. యాక్షన్-కట్ మాత్రమే గుర్తుందట. సీన్ అయ్యాక కూడా ఏడుస్తూ గట్టిగా అరిచేసిందట. దాంతో రన్బీర్ దగ్గరకు వచ్చి.. నువ్వు బాగానే ఉన్నావా అంటూ సముదాయించాడట. పాత్రలో అంతగా లీనమయ్యానని రష్మిక మందాన చెప్పుకొచ్చింది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సందీప్ రెడ్డి వంగా

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR House: జూనియర్ ఎన్టీఆర్ ఇంద్రభవనం గురించి తెలుసా.. 25 కోట్లతో డ్రీమ్ హౌస్ నిర్మించుకున్న యంగ్ టైగర్
Recommended image2
Kurchi Thatha: తీవ్ర విషాదం, సోషల్ మీడియా సంచలనం కుర్చీ తాత మృతి.. కన్నీరు మున్నీరవుతున్న వైజాగ్ సత్య
Recommended image3
Madhuri Dixit: గర్భవతి, పైగా జ్వరం.. అయినా 13 గంటలు డ్యాన్స్ చేసిన హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved