MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • హీరోయిన్లతో నా పర్సనల్‌ కంఫర్ట్ చూసుకోను.. వాళ్లు అది చూడటం లేదు.. మెగాస్టార్‌ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..

హీరోయిన్లతో నా పర్సనల్‌ కంఫర్ట్ చూసుకోను.. వాళ్లు అది చూడటం లేదు.. మెగాస్టార్‌ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..

చిరంజీవి ఎంతో మంది హీరోయిన్లతో పనిచేశారు. కానీ ఆయనకు బాగా కంఫర్ట్ గా అనిపించిన హీరోయిన్‌ ఎవరు అని అడిగితే దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చారు.   

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jun 15 2024, 10:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగాస్టార్‌ చిరంజీవి ఎంతో మంది హీరోయిన్లతో పనిచేశారు. ఆయన డాన్సుల్లోనూ, రొమాన్స్ లోనూ అదరగొట్టారు. లవ్‌ స్టోరీలతోనూ దుమ్ములేపాడు. చిరు ఎక్కువగా యాక్షన్‌, కమర్షియల్‌ మూవీస్‌ చేసినా, వాటిలో ప్రేమ కథలకు ప్రయారిటీ ఇచ్చేశారు. యూత్‌ని ఆకట్టుకునే అంశాలు కచ్చితంగా ఉండేలా చూసుకున్నారు. అందుకే అప్పట్లో యూత్‌ని బాగా ప్రభావితం చేసిన హీరోల్లో చిరంజీవి ఒకరు. ఆ జనరేషన్‌ని బాగా శాషించిన హీరో చిరు అని చెప్పొచ్చు. కేవలం ఆడియెన్స్ ని మాత్రమే కాదు, బాక్సాఫీసుని కూడా ఆయన ఓ ఊపు ఊపేశారు. ఎన్నో కమర్షియల్‌ సినిమాలతో విజయాలు అందుకుని మెగాస్టార్‌ అయ్యాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చిరంజీవి చాలా మంది హీరోయిన్లతో పనిచేశారు. అందులో శ్రీదేవి నుంచి విజయశాంతి, రాధ, సుహాసిని, సుమలత, రమ్యకృష్ణ, రోజా, సౌందర్య, మీన, టబు వంటివారితోపాటు నిన్నటితరం, కాజల్‌, త్రిష, తమన్నా, నయనతార వంటి నేటి తరం హీరోయిన్లతోనూ పనిచేశారు. ఆయనతో సినిమా అంటే హీరోయిన్లకి చుక్కలే. ఎందుకంటే ఆయనతో పోటీగా డాన్స్ చేయడం హీరోయిన్లకి కష్టంగానే ఉంటుంది. 
 

36
photo-etv

photo-etv

అయితే హీరోయిన్లతో డాన్స్ లకు సంబంధించిన చిరంజీవి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సంచలన కామెంట్లు చేశారు. కె రాఘవేంద్రరావు నిర్వహించిన `సౌందర్యలహరి` ప్రోగ్రామ్‌లో చిరంజీవి పాల్గొన్నారు. తమన్నా, అశ్వనీదత్‌ వంటి వారితో కలిసి చిరు పాల్గొన్నారు. ఇందులో రాఘవేంద్రరావు, చిరంజీవి ల కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలపై డిస్కషన్‌ జరిగింది. హీరోయిన్లతో డాన్స్ కి సంబంధించిన ప్రస్తావన వచ్చింది. 
 

46

ఈ క్రమంలో చిరంజీవికి ఓ ప్రశ్న ఎదురయ్యింది. మీతో కలిసి నటించిన హీరోయిన్లలో మీకు బాగా కంఫర్ట్ అనిపించిన హీరోయిన్‌ ఎవరు అని యాంకర్‌ ప్రశ్నించారు. దీనికి చిరంజీవి ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. తాను ఎప్పుడూ తన పర్సనల్‌ కంఫర్ట్స్ చూసుకోనని తెలిపారు. `నేను ఎప్పుడూ నా పర్సనల్‌ కంఫర్ట్ చూసుకోను. ఆ సినిమాకి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇద్దరం కలిసి ఎలా చేస్తే మంచి ఔట్‌పుట్‌ వస్తుంది అనే దానిపైనే నా ఫోకస్‌ ఉంటుంది తప్ప, నా పర్సనల్‌గా నేను ఎప్పుడూ ఆలోచించను, ఆ థాట్‌ నాకు ఉండదు` అని తెలిపారు చిరంజీవి. 
 

56

ఆ ప్రకారంగా తనకు బాగా అనిపించిన హీరోయిన్‌ రాధ అని వెల్లడించారు చిరు. ఆమె డాన్స్ చేసే సమయంలో బాగా ఎంజాయ్‌ చేస్తుందని, ఎక్స్ ప్రెషన్స్, మూమెంట్స్ చాలా ఈజ్‌తో ఇస్తుందని, ఆ స్టెప్పులు ఎంజాయ్‌ చేస్తూ చేయడం వల్ల ఆ భావం ఆడియెన్స్ కి రీచ్‌ అవుతుందని, ఆ ప్రకారంగా రాధ బెస్ట్ అని చెప్పారు చిరు. మిగిలిన హీరోయిన్లు ఏదో పోటీ పడి డాన్స్ చేస్తున్నట్టు ఉంటుందిగానీ, ఆ ఫీల్‌ని పొందుతున్నట్టుగానీ, ఎంజాయ్‌ చేస్తున్నట్టుగా అనిపించదని వెల్లడించారు చిరు. ఇప్పుడు చాలా మంది హీరోలు కూడా చేస్తున్న మిస్టేక్‌ అదే అని వెల్లడించారు. ఈ ఓల్డ్ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్‌గా మారడం విశేషం. 
 

66

చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌. ఆమెతోపాటు మీనాక్షి చౌదరి, సురభి, ఈషా చావ్లా చిరుకి సోదరి పాత్రల్లో మెరవబోతున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాదిసంక్రాంతికి విడుదల కానుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
త్రిష
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved