MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • పవన్‌ కళ్యాణ్‌ పేరు చెప్పి బెదిరింపులకు దిగుతున్న హైపర్‌ ఆది.. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ వార్నింగ్‌

పవన్‌ కళ్యాణ్‌ పేరు చెప్పి బెదిరింపులకు దిగుతున్న హైపర్‌ ఆది.. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ వార్నింగ్‌

హైపర్‌ ఆది మొన్నటి ఏపీ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్‌కి మద్దతు తెలిపారు. ప్రచారం చేశాడు. ఇప్పుడు పవన్‌ పేరు చెప్పి బెదిరింపులకు దిగుతున్నాడు హైపర్‌ ఆది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 22 2024, 02:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హైపర్‌ ఆది.. పవన్‌ కళ్యాణ్‌కి పెద్ద అభిమాని. జనసేన పార్టీలో చేరి ఆయన ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే టికెట్‌ కూడా ఆశించారు. కానీ సర్దుబాటులో ఆయనకు రాలేదు. కానీ పవన్‌కి అభిమానిగానే, ఆయనకు సపోర్ట్ గానే నిలుస్తున్నారు హైపర్‌ ఆది. అంతేకాదు పవన్‌ స్పీచ్‌లకు కూడా ఆది సపోర్ట్ గా ఉంటాడని తెలుస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించింది. చంద్రబాబు సీఎం అయ్యారు. పవన్‌ కల్యాణ్‌ పార్టీ 21 సీట్లకు 21 గెలుచుకుంది. పిఠాపురం నుంచి ఆయన ఘన విజయం సాధించారు. పదేళ్ల పోరాటం తర్వాత పవన్‌ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు, ఫాలోవర్స్ అంతా ఇప్పుడు `పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా` అంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. దాన్ని ట్రెండ్‌ చేస్తున్నారు. 
 

36

ఈ మొత్తం ఎన్నికల్లో పవన్‌ విజయం సాధించడం హైలైట్‌ పాయింట్‌గా నిలిచింది. పైగా ఆయన చుట్టూనే రాజకీయం తిరగడంతో పవన్‌ ప్రతి స్టెప్‌ ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఇప్పుడు దాన్ని హైపర్‌ ఆది కూడా వాడుకుంటున్నారు. తాను ఎవరి తాలూకనో తెలుసు కదా, అంటూ బెదిరింపులకు దిగుతున్నాడు ఆది. 
 

46

తాజాగా `ఢీ` షో లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో డాన్స్ మాస్టర్‌ పండు అంట్‌ టీమ్‌ ఆదితో కలిసి ఓ స్కిట్‌ ప్రదర్శించారు. పండు టీమ్ అంతా కింద కూర్చున్నారు. అప్పుడే వచ్చిన హైపర్‌ ఆది, ఏంట్రా బంతిభోజనాలకు కూర్చున్నట్టు కూర్చున్నారు అని అనగా, ఏంటన్నా, ఛాలెంజ్‌ మర్చిపోయావా? వాళ్లు ఇప్పుడు వచ్చి కూర్చోవాలి, లాస్ట్ రౌండ్‌ మనమే గెలిచాం అంటాడు పండు.
 

56

దీంతో `ఆడవాళ్లు గుళ్లో కూర్చోవాలి కానీ ఒళ్లో కూర్చోవడం ఏంట్రా సిగ్గులేదా మీకు అంటూ ఫైర్‌ అయ్యాడు. దెబ్బకి బెదిరిపోయారు. మరో మాస్టర్‌ని పట్టుకుని నువ్వు ఎలా కూర్చున్నావో తెలుసా? ఏదో ఫ్యామిలీ ప్లానింగ్‌ అయిపోయాక.. ఆరెంజ్‌ జ్యూస్‌, ఐదు వందల రూపాయల కోసం కూర్చున్నట్టు కూర్చున్నావ్‌ అనడంతో ఆయనకు మతిపోయింది. 
 

66

ఇంతలోనే అందుకున్నాడు పండు మాస్టర్‌ నువ్వు ఎంత చెప్పినా ఈ రోజు తగ్గేదెలే అన్నాడు. అడ్డొస్తే తొక్కి పడేస్తా అంటూ హైపర్‌ ఆదిని బెదిరించాడు పండు మాస్టర్‌. దీంతో ఆది విజృంభించాడు. `రేయ్‌ మనం ఎవరి తాలూకో తెలుసా? నీకు పిఠాపురం గుర్తుందా అంటూ వార్నింగ్‌ ఇస్తూ వెళ్లిపోయాడు హైపర్‌ ఆది. దీంతో ఇది హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి షోలోనూ పవన్‌ కళ్యాణ్‌ పేరు చెప్పి, పిఠాపురం పేరు చెప్పి బెదిరింపులకు దిగడం గమనార్హం. ఈ లేటెస్ట్ ప్రోమో వైరల్‌ అవుతుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image2
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image3
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved