MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • క్షమాపణ చెప్పినా కొట్టారు, తిరిగి ఒకే ఒక్క దెబ్బ..ఆ కమెడియన్ జీవితంలో ఇంత జరిగిందా, హైపర్ ఆది కామెంట్స్

క్షమాపణ చెప్పినా కొట్టారు, తిరిగి ఒకే ఒక్క దెబ్బ..ఆ కమెడియన్ జీవితంలో ఇంత జరిగిందా, హైపర్ ఆది కామెంట్స్

హైపర్ ఆది మైక్ అందుకుంటే ప్రాసల ప్రవాహం ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. హైపర్ ఆది వేసే పంచ్ లు, చెప్పే మాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంటాయి. అందుకే బుల్లితెరపై హైపర్ ఆది ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 20 2024, 11:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

హైపర్ ఆది మైక్ అందుకుంటే ప్రాసల ప్రవాహం ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. హైపర్ ఆది వేసే పంచ్ లు, చెప్పే మాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంటాయి. అందుకే బుల్లితెరపై హైపర్ ఆది ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. హైపర్ ఆది ఎలాంటి సంచలన విషయాల గురించి అయినా జనాల్ని ఆకట్టుకునేలా మాట్లాడతారు. ఇటీవల రాకింగ్ రాకేష్ నటించిన కేసీఆర్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హైపర్ ఆది హాజరయ్యారు. 

 

25

హైపర్ ఆది మాట్లాడుతూ జబర్దస్త్ కమెడియన్లు పడ్డ కష్టాల గురించి చెబుతూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జబర్దస్త్ ని, అందులో చేసే కమెడియన్లని చిన్న చూపు చూసే వారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. 2013లో జబర్దస్త్ షో ద్వారా ఒక వ్యక్తి నవ్వించడానికి వచ్చాడు. అతడు నవ్వించే క్రమంలో చిన్న తప్పు చేశాడు. దీనితో కొందరు వ్యక్తులు అతడిని ఫిలిం ఛాంబర్ కి పిలిపించారు. తప్పు జరిగింది క్షమించండి అని అడిగినా వదల్లేదు.. కొట్టారు. ఆ రోజు అతడిని ఎన్ని దెబ్బలు కొట్టారో తెలియదు. ఆ వ్యక్తి మాత్రం కొన్నేళ్ళు ఎదురు చూసి ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు.. అదే బలగం చిత్రం. ఆ వ్యక్తి కమెడియన్ వేణు. 


Also Read: రాంచరణ్ నటించే మూవీ సెట్ కి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చిన క్రేజీ హీరో.. మెగా ఫ్యామిలీ వ్యక్తి కాదు, కానీ

35

జబర్దస్త్ కమెడియన్ అని చిన్న చూపు చూసిన వారు ఇప్పుడు బలగం వేణు అని పిలుస్తున్నారు. కొట్టించుకున్న చోటే సన్మానం చేయించుకున్నాడు. జబర్దస్త్ నుంచి ఆయన ప్రయాణం మొదలయింది. జబర్దస్త్ లో కామెడీ చూసినవారంతా ఇప్పుడు మంచి పొజిషన్స్ లో ఉన్నారు. సుడిగాలి సుధీర్ హీరోగా, యాంకర్ గా రాణిస్తున్నాడు. చాలా మంది సినిమాల్లో కామెడీ రోల్స్ చేస్తున్నారు. సొంత ఇల్లు తీసుకుని కుటుంబాలని బాగా చూసుకుంటున్నారు. ఇదంతా జబర్దస్త్ వల్లే అంటూ హైపర్ ఆది తెలిపారు. 

 

45

జబర్దస్త్ లో డబుల్ మీనింగ్ ఎక్కువండి అని కామెంట్స్ చేసే వారికి ఒక్కటే చెబుతున్నా.. మీరెవరూ చూడకుండానే యానిమల్ చిత్రం 700 కోట్లు కలెక్ట్ చేసిందా అని హైపర్ ఆది ప్రశ్నించారు. 

 

55

ఇంత చెప్పిన తర్వాత కూడా జబర్దస్త్ గురించి ఇలాగే మాట్లాడతాం అనుకుంటే మాట్లాడుకోండి. 30 ఏళ్ళు వచ్చాక అక్కడక్కడా తెల్ల వెంట్రుకలు వస్తాయి. వాటిలో రెండు ఊడిపోయాయి అనుకుంటాం అంటూ హైపర్ ఆది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా హైపర్ ఆది కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
రాఘవేంద్ర రావు నుంచి కోదండరామిరెడ్డి వరకు.. మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ట్విస్ట్
Recommended image2
Food from Prabhas: ఆ కొత్త హీరోయిన్‌కి ప్రభాస్ ఇంటి నుంచి స్పెషల్ ఫుడ్, చూస్తేనే నోరూరిపోతుంది
Recommended image3
Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved