- Home
- Entertainment
- Hyper Aadi:ఎమ్మెల్యే అభ్యర్థిగా హైపర్ ఆది ?.. పవన్ కళ్యాణ్ ని పర్సనల్ గా కలిసిన జబర్దస్త్ కమెడియన్
Hyper Aadi:ఎమ్మెల్యే అభ్యర్థిగా హైపర్ ఆది ?.. పవన్ కళ్యాణ్ ని పర్సనల్ గా కలిసిన జబర్దస్త్ కమెడియన్
ముందు నుంచి హైపర్ ఆదికి పవన్ కళ్యాణ్ పై అభిమానం ఉంది. పలు వేదికలపై హైపర్ ఆది ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచేలా పవన్ కళ్యాణ్ గురించి, జనసేన పార్టీ గురించి మాట్లాడడం చూస్తూనే ఉన్నాం.

జబర్దస్త్ తో పాపులర్ అయిన హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ లు పలు షోలలో పాల్గొంటున్నారు. చాలా ప్రోగ్రామ్స్ లో వాళ్ళకి ప్రాధాన్యత దక్కుతోంది. అదిరిపోయే కామెడీ సెటైర్లతో ఆది చేసే హంగామా అంతా ఇంతా కాదు. హైపర్ ఆదికి ప్రస్తుతం సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హైపర్ ఆది పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ముందు నుంచి హైపర్ ఆదికి పవన్ కళ్యాణ్ పై అభిమానం ఉంది. పలు వేదికలపై హైపర్ ఆది ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచేలా పవన్ కళ్యాణ్ గురించి, జనసేన పార్టీ గురించి మాట్లాడడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హైపర్ ఆది పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ గా కలిశాను.
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రం కోసం నేను కూడా చిన్న వర్క్ చేస్తున్నా. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ గా కలిశా. అబ్బో.. ఏం మనిషి అండి ఆయన.. డబ్బు అనేదానిపై ఆయనకు ఆసక్తి లేదు. డబ్బు ఎవరినైనా మార్చేస్తుంది. కానీ ఆయన మారడు. అలాంటి వ్యక్తి ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచిస్తాడు.
సినిమాల ద్వారా వచ్చే తన సొంత డబ్బుని పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకు పంచుతున్నారు. అలాంటి వ్యక్తి కోసం పనిచేయడానికి నేను కూడా రెడీ. నాగబాబు గారు ఎన్నికల ప్రచారానికి పిలిచి ఏదైనా పని అప్పజెప్పితే తప్పకుండా చేస్తా అని ఆది అన్నాడు.
వచ్చే ఎన్నికల్లో జనసేన తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారా అని యాంకర్ ప్రశ్నించగా అబ్బే అలాంటిది ఏమి లేదు అని హైపర్ ఆది తెలిపాడు. ఒక వేళ పవన్ కళ్యాణ్ గారే స్వయంగా పిలిచి టికెట్ ఇస్తే అని ప్రశ్నించగా.. వాళ్ళు ఎన్నో చూసి ఈ స్థాయికి వచ్చారు. మాకు కూడా ఎంతో అనుభవం కావాలి.. ఇప్పుడే కాదు అని ఆది తెలిపాడు.
ఈ ఇంటర్వ్యూలో ఆటో రాంప్రసాద్ కూడా పాల్గొన్నాడు. రాంప్రసాద్ మాట్లాడుతూ.. ఒకవేళ ఆదికి అలాంటి అవకాశం వస్తే వదులుకోవద్దని చెబుతా. ఎందుకంటే మనం చెప్పేది ప్రజలకు అర్థం అయితే తప్పకుండా మార్పు వస్తుంది. హైపర్ ఆది ఆ విధంగా ప్రజలకు కమ్యూనికేట్ చేయగలడు అని తెలిపాడు.