- Home
- Entertainment
- దీపికా పిల్లిపై హైపర్ ఆది పచ్చిగా డబుల్ మీనింగ్ కామెంట్స్.. చిలిపిగా 'ఛీ ఛీ' అంటూ యంగ్ యాంకర్ రియాక్షన్
దీపికా పిల్లిపై హైపర్ ఆది పచ్చిగా డబుల్ మీనింగ్ కామెంట్స్.. చిలిపిగా 'ఛీ ఛీ' అంటూ యంగ్ యాంకర్ రియాక్షన్
ప్రస్తుతం దీపికా పిల్లి 'ఢీ ప్రీమియర్ లీగ్' షోకి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ప్రేక్షకులని అలరించేందుకు ఢీ షో ఎప్పటికప్పుడు కొత్త హంగులతో ముస్తాబవుతూ వస్తోంది.

కుర్ర యాంకర్ దీపికా పిల్లి ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ అవుతోంది. టాలీవుడ్ లో ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి హాట్ యాంకర్స్ ఉన్నారు. చలాకీగా మాట్లాడుతూ అందంగా కనిపించే యాంకర్స్ త్వరగా పాపులర్ అవుతారు. అదే తరహాలో దీపికా పిల్లి ప్రస్తుతం యువతని ఆకర్షిస్తోంది. చిరునవ్వు, నాజూకైన ఒంపుసొంపులతో దీపికా పిల్లి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారుతోంది. దీపికా పిల్లి ఎక్కడ కనిపించినా చాలా హుషారుగా చలాకీగా ఉంటుంది.
అనసూయ బుల్లితెరపై దూరం కావడంతో దీపికా పిల్లి లాంటి యాంకర్స్ అద్భుతమైన ఆ ఆఫర్స్ అందుకుంటున్నారు. ప్రస్తుతం దీపికా పిల్లి 'ఢీ ప్రీమియర్ లీగ్' షోకి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ప్రేక్షకులని అలరించేందుకు ఢీ షో ఎప్పటికప్పుడు కొత్త హంగులతో ముస్తాబవుతూ వస్తోంది. ప్రస్తుతం ఢీ ప్రీమియర్ లీగ్ అంటూ ఐపీఎల్ తరహాలో తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా టీమ్స్ డివైడ్ చేసి డ్యాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు.
వాల్తేరు వారియర్స్, నెల్లూరు నెరజాణలు, హైదరాబాద్ ఉస్తాద్స్ , కోనసీమ పందెం కోళ్లు ఇలా వివిధ ప్రాంతాల జట్టులుగా డ్యాన్సర్లు ఢీ షోలో పోటీ పడుతున్నారు. ఈ షోలో దీపికా పిల్లి గ్లామర్ కి హైపర్ ఆది అల్లరి తోడవుతోంది. దీపికా పిల్లి, ప్రదీప్ తో పాటు హైపర్ ఆది కూడా కో యాంకర్ గా చేస్తున్నారు. హైపర్ ఆది.. దీపికా పిల్లితో చేసే రొమాంటిక్ కామెడీ హైలైట్ గా నిలుస్తోంది.
ఢీ ప్రీమియర్ లీగ్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమో అదిరిపోయేలా ఉంది. హైపర్ ఆది లుంగీ గెటప్ లో.. దీపికా పిల్లి టైట్ ఫిట్ బ్లాక్ బాడీ కాన్ డ్రెస్ లో ఎంట్రీ ఇచ్చారు. గుడుంబా శంకర్ చిత్రంలోని కిళ్ళీ కిళ్ళీ అనే సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ వీరిద్దరూ ఎంట్రీ ఇచ్చారు. వన్స్ మనం ఫిక్సయ్యాక పిల్లి అయినా కిళ్ళీ అయినా నమిలేయడమే అంటూ హైపర్ ఆది దీపికా పిల్లిని ఉద్దేశించి కామెంట్ చేశాడు. దీనికి దీపికా పిల్లి ఛీ అంటూ రియాక్షన్ ఇచ్చింది.
దీపికా పిల్లి, హైపర్ ఆది, ప్రదీప్ తో పాటు చమ్మక్ చంద్ర కూడా కలసి నవ్వులు పూయించారు. బాబాయ్ గారు నన్ను ఆశీర్వదించండి అంటూ దీపికా పిల్లి అతడి కాళ్లపై పడింది. నేను నీకు ఈ షో వరకే బాబాయ్ ని బయట కాదు అంటూ చమ్మక్ చంద్ర దీపికా పిల్లికి దండం పెట్టడం ఫన్నీగా ఉంది.
ఇక హైపర్ ఆది దీపికా పిల్లికి అరటిపండు తొక్క గిఫ్ట్ గా ఇచ్చాడు. భూ ప్రపంచం మీద ఎవరైనా అరటిపండు తొక్క గిఫ్ట్ గా ఇస్తారా అంటూ ప్రదీప్ హైపర్ ఆదిపై సెటైర్లు వేశాడు. మా అమ్మాయికి టెంట్ వేస్తున్నావా అంతో చమ్మక్ చంద్ర అడగగా.. ఆల్రెడీ టెంట్ వేశా.. ఇక స్టంట్ వేయడమే మిగిలింది అంటూ హైపర్ ఆది.. దీపికా పిల్లిపై డబుల్ మీనింగ్ డైలాగ్ తో రెచ్చిపోయాడు. దీనితో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. దీపికా పిల్లి మాత్రం 'ఛీ ఛీ' అంటూ చిలిపిగా రియాక్ట్ అయింది.