- Home
- Entertainment
- 3000 కోట్ల ఆస్తి, 50 ఏళ్ల వయస్సులో టాలీవుడ్ లోకి పవర్ ఫుల్ రీ ఎంట్రీ, స్టార్ వారసుడు ఎవరో తెలుసా?
3000 కోట్ల ఆస్తి, 50 ఏళ్ల వయస్సులో టాలీవుడ్ లోకి పవర్ ఫుల్ రీ ఎంట్రీ, స్టార్ వారసుడు ఎవరో తెలుసా?
3000 కోట్లకు పైగా ఆస్తి ఉన్న స్టార్ హీరో.. కెరీర్ అంతా రిస్క్ లు చేస్తూ వచ్చిన స్టార్ వారసుడు, 50 ఏళ్ల వయసులో.. టాలీవుడ్ లోకి పవర్ ఫుల్ రీ ఎంట్రీ ఇచ్చిన నటుడు ఎవరో తెలుసా?

స్టార్ వారసుడు
భాష ఏదైనా.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వారుసుల హవా ఎక్కువే. కాని టాలెంట్ ఉండి కష్టపడ్డవారే స్టార్స్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. బాలవుడ్ , టాలీవుడ్, కోలీవుడ్.. ఏ ఇండస్ట్రీలో చూసకున్నా.. స్టార్ హీరోలుగా వారసులే ఎక్కువగా ఉన్నారు. అయితే వారిలో ఏదో ఒక ప్రత్యేకత, కష్టపడే గుణం ఉంది కాబట్టే ఆడియన్స్ వారిని ఆదరిస్తున్నారు. అంతే కాదు వారసులుగా వచ్చి, టాలెంట్ లేక వెనకబడ్డవారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇక ఈ క్రమంలో ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసత్వంగా వచ్చి.. స్టార్ హీరోగా ఎదిగి. వేల కోట్లు సంపాదించిన ఓ హీరో.. తాజాగా టాలీవుడ్ కు స్పెషల్ అవ్వబోతున్నాడు. 50 ఏళ్ల వయస్సులో కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్న స్టార్ నటుడు ఎవరు?
KNOW
3000 వేల కోట్లకు అధిపతి
ఆ హీరోన మరెవరో కాదు బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్. దాదాపు 3000 వేల కోట్లకు అధిపతి అయినా.. చాలా సింపుల్ గా కనిపించే ఈ హీరో, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ హ్యాండ్సమ్ స్టార్ గా పేరు సంపాదించాడు. హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ బాలీవుడ్‌లో దర్శకుడు, నిర్మాత ,నటుడు. తండ్రి సహకారంతో సినిమాల్లోకి ఈజీగా ఎంట్రీ ఇచ్చిన హృతిక్ రోషన్.. డాన్స్, ఫిజిక్, యాక్టింగ్, స్టంట్స్ లాంటి టాలెంట్స్ తో బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు.
50 ఏళ్ల వయస్సులో సిక్స్ ప్యాక్
ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో కూడా యంగ్ స్టార్ లా కండలు తిరిగిన దేహంతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాడు హృతిక్. డాన్స్ మూమెంట్స్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు. తాజాగా వార్ 2 సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు హృతిక్. ఈసినిమాతో టాలీవుడ్ లో కూడా స్పెషల్ అయ్యాడు. ఎందుకంటే ఈసినిమాలో హృతిక్ తో పాటు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పవర్ ఫుల్ పాత్రలో కనిపించాడు. టాలీవుడ్ తో హృతిక్ ఇంత డైరెక్ట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైమ్.
హృతిక్ డాన్స్ కు జూనియర్ ఎన్టీఆర్ అభిమాని
డాన్స్ అంటే హృతిక్ రోషన్ కు ప్రాణం. ఫిట్ నెస్ అతని జీవితంలో భాగం అయ్యింది. అనారోగ్యంతో ఇబ్బంది పడ్డ హృతిక్ కు డాన్స్ చేస్తే ప్రమాదం అని డాక్టార్లు చెప్పారు. అయినా కూడా ప్రాక్టీస్ మానకుండా.. ఆ అనారోగ్యాన్ని కూడా అధిగమించాడు స్టార్ హీరో. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు స్టార్ హీరో. బాలీవుడ్ లోనే కాదు దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో హృతిక్ రోషన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హృతిక్ రోషన్ డాన్స్ కు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెద్ద అభిమాని. ఈ విషయాన్ని వార్ 2 ఈవెంట్ లో ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించారు.
వ్యాపారంలో రాణిస్తోన్న హృతిక్ రోషన్
ఇక సినిమాతో పాటు వ్యాపారంలో కూడా సత్తా చాటాడు స్టార్ హీరో దేశంలోని ఇతర సినిమా స్టార్ వారసుల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నాడు. సినిమాకు 100 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హృతిక్ రోషన్ పలు వ్యాపారాల ద్వార కోట్లు గడిస్తున్నట్టు తెలుస్తోంది. హృతిక్ రోషన్ హెచ్‌ఆర్‌ఎక్స్ అనే స్పోర్ట్స్‌వేర్ కంపెనీని నడుపుతున్నాడు.7300 కోట్ల విలువైన ఆ సంస్థ ద్వారా హృతిక్ రోషన్ కోట్లాది ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.