MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజమౌళి ‌- రమా లవ్ స్టోరీ.. ముందు ఎవరు ప్రపోజ్ చేశారో తెలుసా..?

రాజమౌళి ‌- రమా లవ్ స్టోరీ.. ముందు ఎవరు ప్రపోజ్ చేశారో తెలుసా..?

రాజమౌళి పెళ్లి ఎలా జరిగింది..? ఎటువంటి పరిస్థితుల్లో జరిగింది..? అప్పటికే పెళ్లైన రమను జక్కన్న చేసుకోవడానికి కారణం..? ఎవరు ముందు ప్రేమించారు తెలుసా..? 
 

Mahesh Jujjuri | Published : Aug 06 2024, 06:32 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

రాజమౌళి గురించి అందరు ఒక వైపే ఆలోచిస్తారు.. ఆయన సాధించిన ఘనతలు.. చేసిన సినిమాలు.. టాలీవుడ్ కు హాలీవుడ్ స్థాయిని తీసుకు రావడం లాంటివి. తెలుగు సినిమాకు ఆస్కార్ తీసుకొచ్చాడని.. బాలీవుడ్ పొగరు దించి.. టాలీవుడ్ ను ఉన్నత శిఖరాలలో నిలబెట్టాడని అందరికి తెలిసిందే. అయితే రాజమౌళి పర్సనల్ లైఫ్ గురించి మాత్రం ఎక్కువగా ఎవరూ మాట్లాడిన సందర్భాలు లేవు.. ఉన్న అవి చాలా తక్కువనే చెప్పాలి. 

రోజాకు జబర్థస్త్ లో నో ఛాన్స్.... సంచలన నిర్ణయం తీసుకున్న మాజీ మంత్రి..? ఏం చేయబోతుంది..?

26
Asianet Image

అయితే రాజమౌళి ఫ్యామిలీ గురించి అందరికి తెలిసిందే కాని.. ఆయన పెళ్ళి ఎలాంటి పరిస్థితుల్లో అయ్యింది అనేది చాలామందికి  తెలియని విషయం. ఈ విషయం రీసెంట్ గా రిలీజ్ అయిన రాజమౌళి డాక్యుమెంటరీలో.. వెల్లడి అయ్యింది.  వీరి పెళ్లి గురించి స్యయంగా రమా రాజమౌళి వెల్లడించడం విశేషంజ

కీర్తి సురేష్ ఇంటికి పెళ్ళి ప్రపోజల్ తో వచ్చిన అభిమాని.. మహానటి ఏం చేసిందో తెలుసా..?

36
Rama Rajamouli

Rama Rajamouli

రాజమౌళి భార్య రమాకి రాజమౌళి రెండో భర్త అనే విషయం అందరికి  తెలిసిందే. రమాకి పెళ్లయి కార్తికేయ పుట్టిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఆమె విడాకులు తీసుకుంది. ఆ తర్వాత రాజమౌళి, రమా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాజాగా నెట్ ఫ్లిక్స్ రాజమౌళిపై మోడ్రన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీని తీయగా ఇందులో రమా తమ ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడింది. రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా దీని గురించి మాట్లాడాడు.

46
Asianet Image

రమా మాట్లాడుతూ.. రాజమౌళిని మొదటిసారి మా అక్క పెళ్లిలో చూసాను. నాకేం అతను స్పెషల్ గా అనిపించలేదు. అతను మా బావగారికి తమ్ముడు అవుతాడు. రాజమౌళినే నాకు మొదట ప్రపోజ్ చేసాడు. నేను నో చెప్పాను. నాకు అప్పటికే విడాకులు అయి ఒక కొడుకు ఉన్నాడు. అయినా రాజమౌళి వదలకుండా ఒక సంవత్సరం పాటు పట్టుదలగా ఉన్నాడు. దీంతో ఏడాది తర్వాత మేము ఇద్దరం కలిసి ప్రయాణించాలనుకున్నాం అని తెలిపింది.
 

56
Asianet Image

రమా రాజమౌళి తనయుడు కార్తికేయ మాట్లాడుతూ.. ఆయన నాకు తండ్రి కాకముందే ఒక అంకుల్ గా పరిచయం. చిన్నప్పుడు నన్ను, మా ఫ్యామిలీ కజిన్స్ పిల్లల్ని బయటకి తీసుకెళ్ళేవాళ్ళు అని తెలిపాడు కార్తికేయ. ఇక రాజమౌళి ప్రతీ అడుగులో రమా మార్క్ కనిపిస్తుంది. ఆయన ప్రతీ సినిమాకు రమా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తారు. 
 

66
Rajamouli

Rajamouli

జక్కన్న ప్రస్తుతం మహేష్ బాబు సినిమాకోసం రెడీ అవుతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది. ఇక షూటింగ్ కు సిద్దం అవుతున్నారు. ఈసినిమా రెండు మూడేళ్ళు పట్టే అవకాశం లేకపోలేదు. ఈసినిమా కంప్లీట్ అయ్యేవరకూ.. రాజమౌళితో పాటు.. డే అండ్ నైట్ పనిచేస్తారు రమారాజమౌళి. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories