గేమ్ ఛేంజర్ :ప్రభుదేవా జీరో-ఫీ డాన్స్ & AI మ్యూజిక్
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ లో AI సంగీతం మరియు ప్రభుదేవా ఉచిత నృత్య దర్శకత్వం వంటి ఆసక్తికర విషయాలు. జనవరి 10న విడుదల, బుకింగ్స్ ప్రారంభం.
Game Changer, Prabhudeva, jaragandi, ramcharan
రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు ఉన్నాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జరగండి(Jaragandi)పాట వైరల్ అయ్యింది. అయితే ఈ పాట రెడీ చేయటానికి ఏఐ సాయిం తీసుకున్నానని ఇప్పటికే తమన్ చెప్పి ఆశ్చర్యపరిచారు. అలాగే ఈ పాట కొరియోగ్రఫీ గురించి ఊహించని విషయాలు బయిటకు వచ్చాయి.
pawan kalyan, #Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
మెగా అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు గేమ్ ఛేంజర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్ దాదాపు ఐదేళ్ల తర్వాత సోలో హీరోగా ఈ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. బోయపాటి తో చేసిన వినయ విధేయ రామ సినిమా తర్వాత చరణ్ నుంచి సోలో హీరోగా సినిమా రావడం ఇదే కావడం విశేషం. దాంతో సోలో హీరోగా చరణ్ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది.
కనుక మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్న నేపథ్యంలో దేవర ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్‌ను గేమ్ ఛేంజర్ బ్రేక్ చేస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక పాటల విషయానికి వస్తే జరగండి పాట జనాల్లోకి బాగా వెళ్లింది. ఈ పాట గురించి తమన్ మాట్లాడారు.
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
తమన్ మాట్లాడుతూ... గేమ్ ఛేంజర్ సినిమాలోకి జరగండి, జరగండి(Jaragandi) పాటను ఏఐ(AI)తో కంప్లీట్ చేశాం. మొదట ఈ పాటను దలేర్ మెహందీ(Daler Mehendi)తో మొదట పాడించాం. కానీ అయనతో పాడించినప్పుడు గట్టిగా పాడలేకపోయారు. బాద్‌షా సినిమాలోని ‘బంతి పూల జానకీ’ పాడింది ఆయనే.. అయితే అంతా ఎనర్జీ ఇప్పుడు ఆయన దగ్గర లేదు. దీంతో నాకు తెలిసిన ఒక సింగర్‌తో ఈ పాట పాడించి.. అది ఏఐలో వేసి దలేర్ మెహందీ పాడినట్లు క్రియేట్ చేశాం. కానీ అసలు పాడింది సింగర్ హన్‌మాన్ అంటూ చెప్పుకోచ్చాడు.
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
అలాగే జరగండి, జరగండి పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రభుదేవా రెమ్యునరేషన్ విషయం గురించి శంకర్ రీసెంట్ ఈవెంట్ లో రివీల్ చేసారు. ప్రభుదేవా ఈ పాటకు రూపాయి కూడా తీసుకోలేదని అన్నారు. తనకు క్రెడిట్ ఇస్తే చాలు అని అన్నారని చెప్పుకొచ్చారు. ఇందుకు కారణం దిల్ రాజు, రామ్ చరణ్ అంటే ప్రభుదేవా కు ఉన్న ప్రేమ, గౌరవం అని చెప్పుకొచ్చారు.
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
గేమ్ ఛేంజర్ బుక్కింగ్స్ విషయానికి వస్తే...
జనవరి 10న విడుదల కాబోతున్నగేమ్ ఛేంజర్ సినిమాకు యూఎస్‌లో చాలా రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాగా, ఏపీలో ఇటీవలే బుకింగ్ ప్రారంభం అయ్యింది. కానీ నైజాం ఏరియాలో ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ మొదలు కాలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు వస్తాయని నమ్మకంగా ఉన్నారు.
దిల్ రాజు మరోసారి సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు. నేడు(జనవరి 8) టికెట్ల రేట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతో వెంటనే అడ్వాన్స్ బుకింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.