MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ ను బురిడీ కొట్టించిన భానుమతి, ఆమె తెలివితేటలకు షాక్ అయిన పెద్దాయన, ఏం చేసిందంటే...?

ఎన్టీఆర్ ను బురిడీ కొట్టించిన భానుమతి, ఆమె తెలివితేటలకు షాక్ అయిన పెద్దాయన, ఏం చేసిందంటే...?

టాలీవుడ్ ను ఏలిని హీరోలలో ఎన్టీఆర్.. హీరోయిన్లలో భానుమతి పేరు లేకుండా తెలుగు సీనీపరిశ్రమ పుస్తకం ఉండదు. అటువంటిది ఓ  సంద్భంలో ఎన్టీఆర్ కే షాక్ ఇచ్చి.. బురుడీకొట్టించిందట భానుమతి. ఇంతకీ ఆ కాలంలో జరిగిన కథ ఏంటంటే..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 08 2024, 08:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నందమూరి తారక రామారావు.. తెలుగు సినిమాకు కీర్తి కిరీటం. టాలీవుడ్ కు ఆరాధ్య దైవం. కోట్లాది ప్రజల గుండెళ్లో  దేవుడిగా కొలవబడుతున్న మానుష్య రూపం.  సినిమాల ద్వారా మాత్రమే కాదు.. రాజకీయాల ద్వారా కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన మహానుభావుడు ఎన్టీఆర్. 

Also Read: నిర్మాతకు Jr NTR వార్నింగ్,

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక ఆయన సినిమా జీవితంలో ఎన్నో మలుపులు.. మరెన్నో ట్విస్ట్ లు.. సినిమాల్లో ఆయన చేసిన ప్రయోగాలు ఇంత వరకూ ఎవరూ చేయలేదనే చెప్పాలి. అంతే కాదు ఆ కాలంలోనే గ్రాఫిక్స్ లేకుండా ఎన్నో అద్భుతాలను ఎన్టీఆర్ చూపించారు.

దాన వీర శూరకర్ణ, యాయాబజార్ లాంటి సినిమాల్లో కొన్ని సీన్లు ఎలా తెరకెక్కించారు అనేది ఇప్పటికీ రహస్యమే. అలా ఇండస్ట్రీలో కాని.. రాజకీయాల్లో కాని తనదైన ముద్ర వేశారు ఎన్టీఆర్. ఇక పెద్దాయనతో ఎంతో మంది హీరోయిన్లు నటించారు. చాలామంది తారలకు ఆయన లైఫ్ ఇచ్చారు.

ఇక ఆయనకు సరిసమానమంగా స్టార్ డమ్ ను చూసిన హీరోయిన్లలో భానుమతి ఒకరు. ఆవిడి హీరోలను మించిన లైఫ్ ను చూశారు. వారికి సమానంగా రెమ్యూనరేషన్ తీసేకున్నారు. ఏవిషయంలోను తగ్గేవారు కాదు భానుమతి.

Also Read: నటన నేర్పిన గురువుకు ప్రభాస్ ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్

36

 తన టాలెంట్ తో.. నటనతో అందరిని అలా సెట్ చేసేవారు. ఆమెతో మాట్లాడాలంటేనే పెద్ద హీరోలు కూడా భయపడేవారు. ఎన్టీఆర్ లాంటివారు మాత్రమే కాస్త భానుమతితో చనువుగా ఉండేవారు. ఇక ఇతర హీరోయిన్లు అయితే భానుమతి అంటే దగ్గరకు వెళ్ళడానికి కూడా సంకోచిచేవారట.

దర్జాగా.. ధీమాగా ఉండే భానుమతి..ఓ సందర్భంలో ఎన్టీఆర్ ను బురుడీ కొట్టించిందట. ఆయన వేసిన ప్లాన్ ను ఆయనకే తిప్పికొట్టి.. షాక్ ఇచ్చిందట. ఇంతకీ విషయం ఏంటంటే..

ఎన్టీఆర్  ఒక టైమ్ లో తాతమ్మ కల సినిమాను తెరకెక్కించారు. ఈసినిమాతోనే బాలయ్య బాబు  తెరంగేట్రం చేశారు. అయితే ఈసినిమాలో  హీరోయిన గా భానుమతిని మాట్లాడమని ఎన్టీఆర్.. నరసరాజును పంపించారట. 

Also Read: మరోసారి ప్లైట్ ఎక్కి చెక్కేసిన మహేష్ బాబు..

46

అయితే అప్పుడు ఆమె రెమ్యూనరేషన్ గురించి అడిగితే.. ఎన్టీఆర్ ఎంత తీసుకుంటున్నాడో అంతకు 5000 తగ్గించి ఇవ్వమని అన్నారట భానుమతి. అయితే అప్పటికి ఎన్టీఆర్ 4 నుంచి 5 లక్షల వరకూ తీసుకుంటున్నారు సినిమాకు.

దాంతో ఎన్టీఆర్ నేను 2 లక్షలు మాత్రమే తీసుకుంటున్నాను అని చెప్పమన్నారట.  నరసరాజు గారు వెళ్ళి.. ఎన్టీఆర్ 2లక్షలే తీసుకుంటున్నారు అని చెప్పి.. అంతకు 500 వేలు తగ్గించి ఇవ్వబోయారట.

దాంతో భానుమతి. వద్దండి.. ఈసినిమాన నేను చేస్తాను.. ఇదిగో 5000 ఈ డబ్బు ఎన్టీఆర్ గారికి ఇవ్వండి.. నెక్ట్స్ నేను అమ్మాయి పెళ్ళి సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ ను చేయమనండి అన్నారట. 

Also Read: బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

56

దాంతో నరసరాజుగారు షాక్ అయ్యి తలపట్టుకుని కూర్చున్నారట. ఇక అన్న మాట ప్రకారం  ఎన్టీఆర్ తప్పక ఆ రెండు లక్షలు  తీసుకుని ఆసినిమా చేయాల్సి వచ్చిందట. భానుమతితో మళ్ళీ గొడవ పెట్టుకుంటే.. ఎందుకు వచ్చి చిరాకు అనుకున్నారో ఏంటో..

తాతమ్మ కల సినిమాలో భానుమతి నటించగా..ఆతరువాత అమ్మాయి పెళ్ళి సినిమాలో పెద్ద ఎన్టీఆర్ అనుకున్నట్టే నటించారట. 

ఇలా ఇండస్ట్రీలో అంత పెద్ద స్థాయిలో ఉన్న ఎన్టీఆర్ ను ఊరికినే బురడీ కొట్టించి.. సగం రెమ్యునరేషన్ కు  సినిమా చేసేలా చేసింది భానుమతి. ఆమెతెలివితేటలకు ఎన్టీఆర్ కూడా శభాష్ అన్నారట.  

66

భానుమతి.. .తెలుగు సినిమాకు గర్వకారణమైన నటి. దర్శకురాలు, గాయని, నిర్మాత, స్టూడియో ఓనర్, మంచి డాన్సర్.. ఆకరికి కెమెరా వర్క్ లో కూడా ఆమెకు పట్టుంది. ఇలా సినిమాకు సబంధిచిన ప్రతీ పనిలో అవగాహన ఉన్న గొప్ప నటి భానుమతి. ఆమె నటన, ఆహార్యం... ఎంత అద్భుతంగా ఉంటుందో.. ఆమె మనసు అంత చల్లగా ఉంటుంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image2
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image3
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved