- Home
- Entertainment
- Karthika Deepam: చెఫ్ అవుతానంటున్న ప్రేమ్.. దూకుడుగా మారిన హిమ.. సత్య, స్వప్నలను కలిపినా శౌర్య!
Karthika Deepam: చెఫ్ అవుతానంటున్న ప్రేమ్.. దూకుడుగా మారిన హిమ.. సత్య, స్వప్నలను కలిపినా శౌర్య!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సీరియల్ ఎంతో కాలం నుంచి కొనసాగుతూ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

జ్వాల (Jwala) స్కూటీ నడుపుతూ ఉండగా ఆ బైక్ పై హిమ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో సౌందర్య (Soundarya) కారు ఎదురు పడటం తో అది చూసిన హిమ తన నాన్నమ్మ ఎదురుపడితే సౌర్య చూస్తుందన్న భయంతో బైకు ని స్పీడ్ గా తోలమని అంటుంది.
సౌర్య మాత్రం తింగరి లో మార్పు బాగా వచ్చిందని.. ఇటువంటి మార్పునే కావాలి అనుకున్నాను అని అంటుంది. ఇక సౌందర్య కారు ట్రబుల్ ఇవ్వటంతో అక్కడి నుంచి ఏదో ఒక విషయం చెప్పి జ్వాలను పంపిస్తుంది హిమ. ఇక సౌందర్య హిమ (Hima) దగ్గరికి వచ్చి ఎందుకు నన్ను చూసి అలా పట్టించుకోకుండా వెళ్లి పోతున్నావు అని అనడంతో హిమ ఏదో ఒకటి చెబుతూ ఇంటికెళ్లాక మాట్లాడదాము అని అంటుంది.
మరోవైపు సత్యంకు (Satyam) ఆకలి వేయటంతో జ్వాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అదే సమయంలో జ్వాల (Jwala) రావటంతో నిండు నూరేళ్లు అని అంటాడు. ఆ మాటతో జ్వాల తన తల్లిదండ్రులను గుర్తుచేసుకొని బాధపడుతుంది. ఇక మాటల మధ్యలో తనకు ఒక అసిస్టెంటు దొరికాడు అని అంటుంది.
అదే సమయంలో అక్కడికి ప్రేమ్ (Prem) ఆటో నడుపుకుంటూ ఇంటికి వస్తాడు. ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత కాసేపు మాటల యుద్ధం జరుగుతోంది. అంతేకాకుండా జ్వాలను (Jwala) తీసేయమని.. కావాలంటే నేను చెఫ్ మారుతాను అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఫోటో ఎగ్జిబిషన్ కు తన తండ్రిని రమ్మంటాడు ప్రేమ్.
కాని సత్యం ఆసక్తి చూపించకపోవడంతో.. జ్వాలా ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయించుకుంటుంది. మరోవైపు సౌందర్య.. హిమ (Hima) లో మార్పును చూసి ఆశ్చర్యపోతుంది. నిన్ను ఇలా మార్చిన జ్వాలాను పరిచయం చేయమని అంటుంది. అంతేకాకుండా హిమను (Hima) బాగా దూకుడుగా మారావని అనడంతో హిమ సంతోషపడుతుంది.
మరోవైపు స్వప్నతో నిరూపమ్ ఫోటో ఎగ్జిబిషన్ గురించి, బంధాల గురించి మాట్లాడటం తో స్వప్న బాగా ఫైర్ అవుతుంది. ఇక జ్వాల ఆటో గిరాకి తో మోనిత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది. మోనిత (Monitha) వాళ్ళ ఇంట్లోకి వెళ్లి చూసేసరికి అక్కడ కార్తీక్ ఫోటోకు ఉన్న దండను, దీపంను చూసి ఆశ్చర్యపోతుంది. ఇక్కడ ఎవరు ఉంటున్నారు అని ఆలోచనలో పడుతుంది.
ఇక అక్కడి నుంచి తిరిగి తన ఆటో దగ్గరికి వెళుతుంది. అక్కడికి చేరుకోగానే జ్వాల (Jwala) కు ఆనంద ఎదురు పడతాడు. ఇక జ్వాల ఆ ఇంట్లో ఫోన్ మర్చిపోయాను అనడంతో ఆ ఇంట్లోకి వెళ్లిన ఆనంద్ (Anand) కార్తీక్ ఫోటో చూసి షాక్ అవుతాడు. తరువాయి భాగంలో ఫోటో ఎగ్జిబిషన్ లో సత్యం, స్వప్న, ప్రేమ్, నిరూపమ్, హిమ లను కలుపుతూ తాను కూడా వారితో ఫ్యామిలీ ఫోటో దిగుతుంది సౌర్య.