MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Heroines Villain: అందంగా ఉందని ప్రేమిస్తే, హీరోలకే చుక్కలు చూపించిన హీరోయిన్లు ఎవరో తెలుసా?

Heroines Villain: అందంగా ఉందని ప్రేమిస్తే, హీరోలకే చుక్కలు చూపించిన హీరోయిన్లు ఎవరో తెలుసా?

Heroines villain: హీరోయిన్లు అంటే అందంతో ఆకట్టుకోవడమే కాదు, హీరోతో డ్యూయెట్లు పాడుకోవడమే కాదు, అంతకు మించి చూపిస్తున్నారు. చివరి వరకు ఇన్నోసెంట్‌గా కనిపిస్తూ చివర్లో పెద్ద షాకిస్తున్నారు. హీరోలకు చుక్కలు చూపిస్తున్నారు. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Oct 05 2025, 08:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విలనిజం చూపిస్తున్న హీరోయిన్లు
Image Credit : Asianet News

విలనిజం చూపిస్తున్న హీరోయిన్లు

సినిమాలో చాలా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు హీరోలంటే పాజిటివ్‌గా ఉండే పాత్రలు, మంచి చేసే పాత్రలుగా ఉండేవి. విలన్లు అంటే చెడు తలపెట్టేవారు. కానీ ఇప్పుడు హీరోలే విలన్లుగా చేస్తున్నారు. నెగిటివ్‌ రోల్స్ తోనూ హీరోయిజం పలికిస్తున్నారు. `పుష్ప`, `కేజీఎఫ్‌`లోని హీరో పాత్రలు ఆ కోవకు చెందినవే. అంతేకాదు హీరోయిన్‌ పాత్రల్లోనూ ఆ మార్పులు కనిపిస్తున్నాయి. హీరోయిన్లు సినిమా మొత్తం గ్లామరస్‌గా కనిపిస్తూ, హీరోతో డ్యూయెట్లు పాడుతూ కనిపిస్తున్నారు. కానీ అనూహ్యంగా క్లైమాక్స్ లో విలనిజం చూపిస్తూ షాకిస్తున్నారు. ట్విస్ట్ లతో దుమ్మురేపుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
`ఆర్‌ఎక్స్ 100`లో మైండ్‌ బ్లాక్‌ చేసిన పాయల్‌ రాజ్‌పుత్‌
Image Credit : instagram / Payal Rajput

`ఆర్‌ఎక్స్ 100`లో మైండ్‌ బ్లాక్‌ చేసిన పాయల్‌ రాజ్‌పుత్‌

`ఆర్‌ఎక్స్ 100` నుంచి ఇదే కొనసాగుతుంది. ఇలాంటి ట్రెండ్‌కి ఈ మూవీ ఆజ్యం పోసిందని చెప్పొచ్చు. అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించారు. కన్నడ నటుడు రాంకీ, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషించారు. రా లవ్‌ స్టోరీగా, యాక్షన్‌ కథాంశంతో రూపొందిన ఈ మూవీ 2018లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. కేవలం రెండు కోట్లతో రూపొంది ఏకంగా రూ.25కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ సక్సెస్‌ని ఎవరూ ఊహించలేదు. అందరికీ ఒక షాకిచ్చింది. ఇంకా చెప్పాలంటే ఇందులోని హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పూత్‌ రోలే అందరిని ఆశ్చర్యపరిచింది. చివరి వరకు హీరోయిన్‌గా పాజిటివ్‌గా కనిపిస్తూ చివర్లో నెగటివ్‌గా మారుతుంది. ఆ ట్విస్ట్ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. దీంతో వరుసగా పలు సినిమాలు ఈ కాన్సెప్ట్ తోనే వచ్చాయి. కానీ `ఆర్‌ఎక్స్ 100`ని కొట్టలేకపోయాయి.

36
`కాంతార 2`లో క్లైమాక్స్ లో ఝలక్‌ ఇచ్చిన రుక్మిణి వసంత్‌
Image Credit : youtube/sreyas media

`కాంతార 2`లో క్లైమాక్స్ లో ఝలక్‌ ఇచ్చిన రుక్మిణి వసంత్‌

కానీ ఆ తర్వాత కొంత గ్యాప్‌తో ఇప్పుడు అలాంటి సినిమాల జోరు నడుస్తుంది. మొన్న విడుదలైన `కాంతార 2`, అంతకు ముందు వచ్చిన `కింగ్డమ్‌`, `హరి హర వీరమల్లు`, అలాగే `విరూపాక్ష` చిత్రాలు కూడా అదే కోవలో వచ్చాయి. మొన్న విడుదలైన `కాంతారః చాప్టర్‌ 1`లో రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటించింది. రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించారు. దసరా కానుకగా విడుదలైన ఈ మూవీ హిట్‌ టాక్‌ని తెచ్చుకుంది. కాకపోతే ఇది మొదటి భాగం `కాంతార` రేంజ్‌లో లేదనే ప్రచారం జరుగుతుంది. కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయి. ఇందులో హీరోయిన్‌ రుక్మిణి వసంత్‌.. యువరాణి పాత్రలో నటించింది. చివరి వరకు హీరోతో డ్యూయెట్‌ పాడుతుంది. లవ్‌లో ఉంటుంది. కానీ క్లైమాక్స్ లో తన నిజ స్వరూపం చూపిస్తుంది. విలన్‌గా మారి హీరో అంతానికి ప్రయత్నిస్తుంది. క్లైమాక్స్ మూవీకి హైలైట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. ఆమె పాత్రలోని ట్విస్ట్ అదిరిపోయింది.

46
`కింగ్డమ్‌`లో భాగ్యశ్రీ బోర్సే షాక్‌
Image Credit : Youtube/ Sithara Entertainments

`కింగ్డమ్‌`లో భాగ్యశ్రీ బోర్సే షాక్‌

అంతకు ముందు విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన `కింగ్డమ్‌` మూవీ డీసెంట్‌గా ఆడింది. కమర్షియల్‌గా సత్తా చాటలేదనే కామెంట్‌ వినిపించింది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో విజయ్‌కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. కోస్టల్‌ ప్రాంతం నుంచి ఓ తెగ అప్పటి బ్రిటీష్‌ వారి దాడులకు తట్టుకోలేక శ్రీలంకకి పారిపోతారు. అక్కడ స్మగ్లర్ల కింద పనిచేస్తారు. అందులోని నాయకుడిని, స్మగ్లర్లని పట్టుకునేందుకు పోలీస్‌ అయిన విజయ్‌ మారు వేషంలో వెళ్తాడు. అక్కడ ఆసుపత్రిలో హీరోయిన్‌ పరిచయం అవుతుంది. ఇద్దరు క్లోజ్‌ అవుతారు. ప్రేమలో పడతారు. తన అన్నని విలన్లు చంపే సమయంలో హీరోని మాయ చేస్తుంది హీరోయిన్‌. అక్కడ తన విలనిజం చూపించి షాకిస్తుంది. ఆమె ఇచ్చిన ట్విస్టే సినిమా కథని మార్చేస్తుంది. అయితే ఇందులో ఆమె సీన్లని బలంగా చూపించలేదు. రెండో పార్ట్ లో అది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపిస్తూనే విలన్‌గా మారడం విశేషం.

56
`హరి హర వీరమల్లు`లో  నిధి ట్విస్ట్ కి పవన్‌కి మతిపోయింది
Image Credit : instagram/nidhhi agerwal

`హరి హర వీరమల్లు`లో నిధి ట్విస్ట్ కి పవన్‌కి మతిపోయింది

అంతకు ముందు పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వచ్చిన `హరి హర వీరమల్లు`లో కూడా హీరోయిన్‌ నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో నటించింది. ఇందులో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ జులైలో విడుదలైంది. ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ మొదట వీరమల్లుతో లవ్‌ ట్రాక్‌ నడిపిస్తుంది. పెద్ద డ్రామా ఆడుతుంది. చివరికి వజ్రాలు తీసుకుని పారిపోతుంది. ఏకంగా హీరోనే కొట్టి పారిపోవడం విశేషం. ఫస్టాఫ్‌లోనే వచ్చే ఈ ట్విస్ట్ అదిరిపోయింది. ఆమె వల్లనే హీరో నిజాం నవాబ్‌ కి దొరకడం, ఆయన కొహినూర్‌ వజ్రాన్ని తీసుకురావాలని చెప్పడం, దానికోసం ఢిల్లీకి వీరమల్లు వెళ్లాల్సి వస్తుంది. అలా నిధి అగర్వాల్‌ కూడా తన మార్క్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. కానీ ఈ చిత్రం హిట్‌ కాకపోవడంతో ఆమె పాత్ర పెద్దగా హైలైట్‌ కాలేదు.

66
`విరూపాక్ష`లో సంయుక్తంగా దెబ్బకి మొత్తం రివర్స్
Image Credit : our own

`విరూపాక్ష`లో సంయుక్తంగా దెబ్బకి మొత్తం రివర్స్

దీనికంటే ముందే `విరూపాక్ష`లోనూ ఇదే జరిగింది. ఇందులో సాయితేజ్‌ హీరో. సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా చేసింది. ఆమె ప్రారంభం నుంచి హీరోతో ప్రేమలో ఉంటుంది. వీరిద్దరు డ్యూయెట్లు పాడుకుంటారు. చివరికి పెద్ద షాకిస్తుంది. సినిమాలో అసలు విలన్‌ ఆమెనే అని క్లైమాక్స్ లో తెలుస్తుంది. అది హీరోకి, ఊరికి పెద్ద షాకిస్తుంది. ఈ ట్విస్టే సినిమా సక్సెస్‌ కి కారణమని చెప్పొచ్చు. దీంతో సంయుక్త పాత్ర కూడా బాగా హైలైట్‌ అయ్యింది. ఇలా హీరోయిన్లు అప్పటి వరకు హీరోయిన్‌గా ఉండి, చివర్లో తమ విలనిజం చూపించి ఆకట్టుకుంటున్నారు. సినిమా సక్సెస్‌లో భాగమవుతున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Actress Roja: రోజా నిద్రపోతుంటే రజనీకాంత్ చేసిన అల్లరి పనికి అంతా షాక్‌.. సెట్‌లో సూపర్‌స్టార్‌ ఎలా ఉంటారంటే?
Recommended image2
Varanasi Update: మహేష్‌ `వారణాసి` నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌.. అప్పట్నుంచే అసలైన పండగ షురూ
Recommended image3
Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కృష్ణుడు.. మరో రచ్చ
Related Stories
Recommended image1
80s Stars Reunion: 80 రీయూనియన్‌ ఎలా ప్రారంభమైందో తెలుసా? మైఖేల్‌ జాక్సన్‌ మరణంతో సంబంధం.. ఆ ఇద్దరే అసలు కారణం
Recommended image2
Raghavendra Rao: పండు ల్యాండ్‌ అయ్యే కరెక్ట్ ప్లేస్‌ అదే.. హీరోయిన్లపై పండ్ల రహస్యం బయటపెట్టిన రాఘవేంద్రరావు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved