బలవంతం చేయడంతో ఇష్టం లేకపోయినా చేశాను... ఆ మూవీ విషయంలో బాధపడుతున్న నాగార్జున హీరోయిన్ టబు!
బలవంతం చేయడంతో ఇష్టం లేకపోయినా ఓ మూవీ చేశాను అంటుంది హీరోయిన్ టబు. ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ చేసినందుకు బాధపడుతుందట. టబు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ టబు మూడు దశాబ్దాలుగా పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతుంది. 1991లో విడుదలైన కూలీ నెంబర్ వన్ లీడ్ హీరోయిన్ గా ఆమెకు మొదటి చిత్రం దర్శకుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన కూలీ నెంబర్ వన్ సూపర్ హిట్. టబుకు ఫస్ట్ మూవీతోనే తెలుగులో గుర్తింపు వచ్చింది.
కూలీ నెంబర్ వన్ హిట్ అయినప్పటికీ టబుకి దాదాపు నాలుగేళ్లు గ్యాప్ వచ్చింది. అనంతరం హిందీలో ఆఫర్స్ వచ్చాయి. వరుసగా బాలీవుడ్ చిత్రాలు చేస్తున్న టబు, నాగార్జున ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేసిన సిసింద్రీ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. నాగార్జునకు జంటగా నటించిన నిన్నే పెళ్లాడతా... సూపర్ హిట్ కొట్టింది. తెలుగులో హిట్స్ పడినప్పటికీ టబు బాలీవుడ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది
ప్రస్తుతం ఆమె వయసుకు తగ్గ పాత్రలు చేస్తుంది. నెగిటివ్ షేడ్ రోల్స్ కూడా చేయడం విశేషం. అంధాదున్ చిత్రంలో టబు పూర్తి స్థాయి నెగిటివ్ రోల్ చేసి ఆశ్చర్యపరిచింది. గతంలో టబు ఆ స్థాయి విలనిజం పండించిన చిత్రం లేదు. అంధాదున్ లో టబు రోల్ కొంచెం బోల్డ్ గా కూడా ఉంటుంది. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో టబు పాత్రకు మంచి పేరొచ్చింది.
టబు లేటెస్ట్ మూవీ ఔరోన్ మే కహన్ దమ్ థా. అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించారు. టబు, సాయి మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటించారు. ఔరోన్ మే కహన్ దమ్ థా ఆగస్టు 2న విడుదల కానుంది. యూనిట్ సభ్యులు చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో టబు కీలక కామెంట్స్ చేశారు.
టబు మాట్లాడుతూ... షబానా ఆజ్మీ మా బంధువు కావడంతో నేను ఆమె ఇంటికి వెళ్ళాను. అక్కడ ఉన్న డైరెక్టర్ శేఖర్ కపూర్ నన్ను చూశారు. దుష్మణి చిత్రంలో నటిస్తావా అని అడిగాడు. అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను. నాకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉండటంతో చేయను అన్నాను. పదే పదే అడగడటంతో 10వ తరగతి పరీక్షలు రాసి... దుష్మణి చిత్రానికి సైన్ చేశాను.
ఆ మూవీ మధ్యలో ఆగిపోయింది. కొంత కాలం తర్వాత శేఖర్ కపూర్ మళ్ళీ నన్ను కలిశారు. ప్రేమ్ మూవీలో నటించమని అడిగారు. నేను పై చదువులకు విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నాను. మూవీ చేయను అన్నారు. మరలా ఆయన నన్ను బలవంతం పెట్టారు. నేను ప్రేమ్ సినిమాకు సైన్ చేశాక ఆ ప్రాజెక్ట్ నుండి శేఖర్ తప్పుకున్నారు. వేరే దర్శకుడు 5 ఏళ్ల పాటు ఆ సినిమా తీశారు. ప్రేమ్ సినిమా చేసినందుకు ఇప్పటికీ నేను బాధపడతాను... అని అన్నారు.