- Home
- Entertainment
- శ్రీదేవి మరణం వెనుక ఉన్న పెద్ద మిస్టరీ ఇదే... ఒకసారి జస్ట్ మిస్, రెండోసారి దొరికిపోయింది!
శ్రీదేవి మరణం వెనుక ఉన్న పెద్ద మిస్టరీ ఇదే... ఒకసారి జస్ట్ మిస్, రెండోసారి దొరికిపోయింది!
శ్రీదేవి హఠాన్మరణం ఆమె అభిమానులను శోకసంద్రంలో ముంచి వేసింది. ఆమె ఎలా మరణించారు అనేది ఇప్పటికీ మిస్టరీనే. అయితే ఆమెను ఓ అదృశ్య శక్తి వెంటాడినట్లు ఆమె గతం పరిశీలిస్తే తెలుస్తుంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో శ్రీదేవి ఒక సంచలనం. సౌత్ లో ఎదిగి తర్వాత నార్త్ ని దున్నేసింది. కోట్ల మంది అభిమానం సొంతం చేసుకుంది. ఎప్పటికీ గుర్తుండి పోయే పాత్రలు చేసింది. శ్రీదేవి కన్నుమూసే వరకు సినిమానే ప్రపంచంగా బ్రతికింది. వయసుకు తగ్గ పాత్రల్లో అలరిస్తూ వచ్చింది.
2018 ఫిబ్రవరి 24న విషాదం చోటు చేసుకుంది. శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించారు. ఓ వేడుకలో పాల్గొనేందుకు ఫ్యామిలీతో పాటు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి హోటల్ గదిలో విగతజీవిగా కనిపించింది. ఆమె బాత్ టబ్ లో పడి ఊపిరి ఆడక మరణించారు అనేది అధికారుల సమాచారం.
శ్రీదేవి భర్త బోనీ కపూర్ కూడా ఇదే చెప్పారు. శ్రీదేవి అతి కఠినమైన ఆహార నియమాలు పాటించేది. ఈ క్రమంలో ఆమె అప్పుడప్పుడు సృహ కోల్పోయేది. బాత్ టబ్ లో పడిపోయిన శ్రీదేవి ఊపిరి ఆడక చనిపోయిందని ఆయన వివరణ ఇచ్చారు.
అయితే శ్రీదేవికి జలగండం ఉందని. అదే ఆమె ఊపిరి తీసిందనే వాదన తెరపైకి వచ్చింది. ఇందుకు గతంలో జరిగిన ఓ సంఘటనను ఉదహరిస్తున్నారు. 1972లో విడుదలైన బాల భారతం చిత్రంలో శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఈ మూవీలో కౌరవులు, పాండవులు పాత్రలను చైల్డ్ ఆర్టిస్ట్స్ చేశారు.
బాల భారతం షూటింగ్ తమిళనాడు రాష్ట్రంలో గల హొగెనక్కల్ వాటర్స్ ఫాల్స్ వద్ద జరుగుతుందట. షాట్ గ్యాప్ లో ఈ చైల్డ్ ఆర్టిస్ట్స్ ఆ వాటర్ ఫాల్స్ లో మునిగేవారట. శ్రీదేవి ఒక రాడ్డును పట్టుకుని వాటర్ ఫాల్స్ లో స్నానం చేస్తుందట. ఆ పక్కనే ధర్మరాజు, అర్జునుడు పాత్రలు చేస్తున్న ఇద్దరు కుర్రాళ్ళు కూడా స్నానం చేస్తున్నారట.
శ్రీదేవి చేయి జారీ నీళ్లలో కొట్టుకుపోయేదట. పక్కనే ఉన్న ఇద్దరు పిల్లలు వెంటనే స్పందించి ఆమెను పెట్టుకున్నారట. లేదంటే శ్రీదేవి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి లోయలో పడిపోయేదట. తృటిలో ఆమె నీటి ప్రమాదం నుండి తప్పుకుందట. ఈ విషయాన్ని ఆ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన కమెడియన్ విశ్వేశ్వరరావు చెప్పారు.
sridevi and boney kapoor
కాబట్టి శ్రీదేవిని జలగండం వెంటాడింది. బాల్యంలో ఆమె ఒకసారి దాని నుండి తప్పించుకుంది. కానీ దుబాయ్ హోటల్ లో మాత్రం ఆమె తప్పించుకోలేకపోయిందని కొందరి వాదన. అయితే ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టి పారేసేవారు లేకపోలేదు...