మొదటి కిస్ ఆయనకు ఇచ్చేస్తా... లిప్ లాక్ సన్నివేశాలపై శ్రీలీల క్రేజీ కామెంట్
యంగ్ బ్యూటీ శ్రీలీల లిప్ లాక్ సన్నివేశాల మీద హాట్ కామెంట్స్ చేసింది. లిప్ లాక్ సన్నివేశాలు చేయాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారని అడగ్గా... మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చింది.
టాలీవుడ్ సెన్సేషన్ గా అవతరించింది శ్రీలీల. గ్లామరస్ హీరోయిన్ గా ఎదుగుతున్న అమ్మడు అనూహ్యంగా భగవంత్ కేసరి చిత్రంలో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ చేసింది. భగవంత్ కేసరి చిత్రంలో బాలకృష్ణకు కూతురు కాని కూతురు రోల్ చేసింది. ఆమె పెర్ఫార్మన్స్ కి మార్క్స్ పడ్డాయి. భగవంత్ కేసరి దసరా విన్నర్ గా నిలిచింది. భగవంత్ కేసరి చిత్ర ప్రమోషన్స్ లో అమ్మడు విరివిగా పాల్గొంటుంది.
ఈ సందర్భంగా ఆమెకు ఓ క్రేజీ ప్రశ్న ఎదురైంది. లిప్ లాక్ సీన్ చేయాల్సి వస్తే ఎవరితో చేశావని అడగ్గా ఆమె తెలివైన సమాధానం చెప్పింది. కాసేపు ఆలోచించిన శ్రీలీల నేను ఏ హీరోతో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించను. అలా చేయాల్సి వస్తే నా మొదటి లిప్ కిస్ నా భర్తకే అని చెప్పింది. శ్రీలీల ఆన్సర్ కి అడిగినవారు కూడా ఖంగుతిన్నారు. ఈ మధ్య టాలీవుడ్ లో కూడా లిప్ లాక్ సన్నివేశాలు కామన్ అయ్యాయి.
కాగా శ్రీలీల ఖాతాలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మహేష్ కి జంటగా గుంటూరు కారం చేస్తుంది. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అలాగే పవన్ కళ్యాణ్ కి జంటగా ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తుంది. ఈ చిత్రానికి హరీష్ శంకర్ డైరెక్టర్. ఇది తేరీ రీమేక్. అలాగే విజయ్ దేవరకొండకు జంటగా ఓ చిత్రం, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ చిత్రాల్లో శ్రీలీల నటిస్తుంది.
నందమూరి ఫ్యామిలీతో శ్రీలీల సన్నిహితంగా ఉంటుంది. నందమూరి కోడలు కానుంది. మోక్షజ్ఞ భార్య అయ్యే ఛాన్స్ ఉందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ శ్రీలీలను సొంతింటి పిల్ల కంటే ఎక్కువగా అభిమానం చూపిస్తున్నాడు...
కన్నడ అమ్మాయి అయిన శ్రీలీల అమెరికాలో పుట్టింది. తల్లి భర్తతో విడిపోవడంతో బెంగుళూరు వచ్చేశారు. శ్రీలీల తల్లి ప్రముఖ డాక్టర్. శ్రీలీల చిన్నప్పటి నుండి డాన్స్ నేర్చుకుంది. ఎంబిబిఎస్ చదువుతూనే శ్రీలీల సినిమాల్లో రాణిస్తుంది.