Sreeleela: మీరు ఎవరికి కమిట్మెంట్ ఇచ్చారు... నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన శ్రీలీలా
నెటిజన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది హీరోయిన్ శ్రీలీలా.. తనపై వల్గర్ కామెంట్ చేసిన వ్యక్తికి మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం ఇచ్చింది బ్యూటీ.. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే..?
ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతోంది హీరోయిన్ శ్రీలీల. దాదాపు డజను ప్రాజెక్ట్ లు ఖాతాలో వేసుకుని తిరుగుతోంది. స్టార్లు.. సూపర్ స్టార్ల పక్కన నటించే అవకాశం కొట్టేస్తుంది బ్యూటీ. టాలీవుడ్ లో నెక్ట్స్ స్టార్ హీరోయిన్ అంటే శ్రీలీల పేరే వినిపించేలా ఉంది. స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదరు చూస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న శ్రీ లీల.. వరుసగా తన సినిమాలు రిలీజ్ అవుతుంటే.. కొత్త సినిమాల షూటింగ్ బిజీలో ఆమె తీరిక లేకుండా ఉంది. ఊపిరి మెసలకుండా షిప్ట్ ల వైజ్ గా పని చేసుకుంటూ వెళ్తోంది శ్రీలీల. రీసెంట్ గా శ్రీలీల భగవంత్ కేసరి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఓ మెట్టు ఎక్కింద బ్యూటీ.
ఇక తాజాగా ఆమె త్వరలోనే ఆదికేశవ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా నవంబర్ 24వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ జోడీగా నటింస్తోంది కన్డ భామ. ఈసినిమా ప్రమోషన్లను జోరుగా సాగిస్తున్నారు టీమ్. ఈక్రమంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు టీమ్. అంతే కాదు శ్రీలల ఈమధ్య సోల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటోంది. అందులో తన హాట్ హాట్ అందాల ఫోటోలు తో పాటు.. సినిమా అప్ డేట్స్ కూడా పంచుకుంటోంది.
ఆదికేశవ్ సినిమా రిలీజ్ లో భాగంగా.. శ్రీలీల పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఒకవైపు ఇంటర్వ్యూలకు హాజరవుతూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా అభిమానులతో ముచ్చటిస్తూ సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఈమె అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
ఈ సందర్భంగా ఒక నెటిజన్ మీరు బిగ్ బాస్ కార్యక్రమానికి వస్తున్నారా అని ప్రశ్నించగా అవును ఆదికేశవ సినిమా ప్రమోషన్లలో భాగంగా బిగ్ బాస్ కార్యక్రమానికి వస్తున్నానని తెలియజేశారు. అదే విధంగా మరొక నెటిజన్ మీరు ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చారా అంటూ ఈమెను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శ్రీలీల సమాధానం చెబుతూ..
అవును తాను కమిట్మెంట్ ఇచ్చానని, తాను తన పనులకు కమిట్మెంట్ ఇచ్చాను అంటూ ఈ సందర్భంగా నేటిజన్ అడిగిన ప్రశ్నకు శ్రీ లీల కూడా తన స్టైల్ లోనే సమాధానం చెప్పారు. ఈమె కెరియర్ విషయానికి వస్తే త్వరలోనే ఆదికేశవ సినిమా విడుదల కానుంది. అలాగే నితిన్, విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి హీరోల సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.