తుంటరిపనులు చేస్తోన్న విజ్జి పాప, కన్నుగీటుతూ.. కవ్విస్తోన్న అల్లరి పిల్ల శ్రీలీల, వైరల్ పిక్స్
అల్లరి పిల్ల శ్రీలీల.. సోషల్ మీడియాలో తెగ అల్లరి చేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమె హవా నడుస్తోంది. వరుస సినిమాలతో దూసుకుపోతోంది బ్యూటీ.
ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న ఏకైక పేరు శ్రీలీల. ఆల్మోస్ట్ శ్రీలీల లేకుండా సినిమాలు ఉండటంలేదు. స్టార్ హీరోలు సైతం శ్రీలీల డేట్స్ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దాదాపు 10 సినిమాల వరకూ ఆమె ఖాతాల ఉన్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు సాధిస్తోంది శ్రీలీల. హీరోయిగా మాత్రమే చేయాలని కట్టుబాటు పెట్టుకోకుండా.. మంచి పాత్రల కోసం చూస్తోంది. తాజాగా భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య బాబు కూతురుగా నటించి మెప్పించింది బ్యూటీ.
ఈమూవీ సూపర్ హిట్ అవ్వడంతో శ్రీలీల డిమాండ్ ఇంకా పెరిగిందిపోయింది. విజ్జీ పాపగా .. భగవంత్ కేసరిలో ఆమె పెర్ఫామెన్స్ కు మంచి స్పందన వచ్చింది. అంతే కాదు.. భగవంత్ కేసరిలో హీరోయిన్ గా నటించిన కాజల్ కంటే కూడా శ్రీలీలకే సినిమాలో ఇంపార్టెన్స్ ఇవ్వడంతో పాటు..రెమ్యూనరేషన్ కూడా భారీగా ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇటు సినిమాలతో పాటు.. అటు సోషల్ మీడియాలో కూడా రెచ్చిపోతోంది బ్యూటీ. గతంలో సినిమాలు తక్కువగా ఉన్న టైమ్ లో కూడా పెద్దగా యాక్టీవ్ గా లేదు శ్రీలీల.. కాని,, హీరోయిన్ గా బిజీ అయిన తరువాత... ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ అయ్యింది.
రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలకు మంచిరెస్పాన్స్ వస్తోంది. కన్నుగీటుతూ.. తుంటరి పనులతో.. అల్లరి చేస్తోంది బ్యూటీ. ఈమధ్య కాస్త హాట్ డోస్ పెంచుతున్న శ్రీలీలా.. అప్పుడప్పుడు హాట్ గా.. అప్పుడప్పుడు పద్దతిగా కనిపిస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా శ్రీలీల నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బన్నీతో త్రివిక్రమ్ చేయాల్సిన సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా అడిగినట్టు తెలిసింది. ఆమె డేట్స్ అజెస్ట్ అవ్వవని చెప్పడంతో.. శ్రీలీలకు అల్లు అర్జున్ ఓ చిన్న క్లాస్ తీసుకున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.