MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • తిరుగులేని సంపద, స్టార్డం రాబట్టిన సౌందర్య తీరని కోరిక ఏమిటో తెలుసా?

తిరుగులేని సంపద, స్టార్డం రాబట్టిన సౌందర్య తీరని కోరిక ఏమిటో తెలుసా?

అసలు సౌందర్య హీరోయిన్ కావాలని అనుకోలేదట. ఒకరి బలవంతం మీద పరిశ్రమకు వచ్చారట. ఆమె కోరుకున్న జీవితం ఏమిటో నటి ఆమని బయటపెట్టింది. అది తీరకుండానే కన్నుమూసిందని కీలక వ్యాఖ్యలు చేసింది. 

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 20 2024, 07:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కన్నడ అమ్మాయి సౌందర్యను టాలీవుడ్ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. చాలా మంది సౌందర్య తెలుగమ్మాయే అనుకునేవారు. 1992లో సౌందర్య కెరీర్ కన్నడ పరిశ్రమలో మొదలైంది. ఆమె స్టార్ గా ఎదిగింది మాత్రం టాలీవుడ్. 1993లో విడుదలైన మనవరాలి పెళ్లి ఆమె ఫస్ట్ తెలుగు మూవీ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఎస్వీ కృష్ణారెడ్డి సౌందర్యకు బ్రేక్ ఇచ్చాడు. ఆయన తెరకెక్కించిన రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు చిత్రాల్లో సౌందర్య హీరోయిన్ గా నటించింది. అవి రెండు సూపర్ హిట్ అయ్యాయి. నెంబర్ వన్, హలో బ్రదర్, మేడమ్ చిత్రాలతో సౌందర్య స్టార్డమ్ తెచ్చుకుంది. అక్కడ నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. 

 

36

ఒక దశాబ్దం పాటు సౌందర్య సిల్వర్ స్క్రీన్ పై ఒక వెలుగు వెలిగింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి టాప్ హీరోల సరసన నటించింది. అనూహ్యంగా 2004లో కన్నుమూశారు. బీజేపీ పార్టీలో చేరిన సౌందర్య తన సోదరుడితో పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగుళూరు నుండి కరీంనగర్ వెళుతూ విమాన ప్రమాదంలో మరణించింది. 

46

అభినవ సావిత్రిగా పేరు తెచ్చుకున్న సౌందర్య మరణం ఆమె అభిమానులను శోకసంద్రంలో ముంచింది. వందకు పైగా చిత్రాల్లో నటించిన సౌందర్యకు అసలు నటి కావడం ఇష్టం లేదట. ఈ విషయాన్ని ఆమె క్లోజ్ ఫ్రెండ్ నటి ఆమని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 

56

ఆమనికి సౌందర్య చాలా క్లోజ్. ఇద్దరూ కన్నడ వాళ్ళు కావడంతో బాగా కలిసిపోయేవారట. ప్రతి విషయం ఆమనితో సౌందర్య షేర్ చేసుకుందట. ఈ క్రమంలో సౌందర్య గురించి చాలా విషయాలు ఆమనికి తెలుసు. అసలు హీరోయిన్ కావడం సౌందర్యకు ఇష్టం లేదు. వాళ్ళ నాన్న బలవంతం మీద పరిశ్రమకు వచ్చిందని ఆమని అన్నారు. తండ్రి మరణించాక అన్నయ్యను అదే స్థాయిలో ఆమె గౌరవించారని అని ఆమని వెల్లడించారు. 

 

66

తండ్రి ఒత్తిడితో సినిమాల్లోకి వచ్చాక..  తర్వాత ఇంట్రెస్ట్ కలిగి చేసింది. కానీ ఆమెకు సాధారణ జీవితం ఇష్టం. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, గృహిణిగా ఉండాలని కోరుకునేది. నటిగా ఎంతో కీర్తి గడించిన సౌందర్య ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయిందని ఆమని ఆవేదన చెందారు. 2003 ఏప్రిల్ నెలలో జి రఘు అనే వ్యక్తిని సౌందర్య వివాహం చేసుకుంది. పెళ్ళైన ఏడాది లోపే మరణించింది. ఆమె కోరుకున్న జీవితం అనుభవించక ముందే ఆమె కన్నుమూశారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved