మతిపోగొడుతున్న స్నేహ లేటెస్ట్ లుక్.. భర్త కౌగిలిలో, ఆమె వయసు ఇలా తగ్గిపొతోందేంటి
హోమ్లీ క్వీన్ గా స్నేహ టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. స్నేహ తెలుగులో ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించింది. తొలి వలపు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది.

హోమ్లీ క్వీన్ గా స్నేహ టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. స్నేహ తెలుగులో ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించింది. తొలి వలపు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది.
వెంకీ, ప్రియమైన నీకు, శ్రీరామదాసు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో స్నేహ తనదైన ముద్ర వేసింది. హోమ్లీ అప్పియరెన్స్ తో తెలుగు ప్రేక్షుకులందరికి చేరువైంది.
ప్రముఖ తమిళనటుడు ప్రసన్నని స్నేహ 2012లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా స్నేహ సినిమాల్లో నటిస్తోంది. కాకపోతే ఆమెకు హీరోయిన్ గా ఆఫర్స్ రావడం లేదు.
స్నేహ, ప్రసన్న దంపతులు అన్యోన్యంగా జీవిస్తున్నారు. స్నేహ తెలుగులో చివరగా వినయ విధేయ రామ చిత్రంలో మెరిసిన సంగతి తెలిసిందే.
సౌందర్య తర్వాత తెలుగులో అంతటి హోమ్లీ క్రేజ్ తెచ్చుకున్న స్నేహ మాత్రమే. తన కెరీర్ లో స్నేహ ఎప్పుడూ హద్దులు దాటేలా గ్లామర్ షో చేయలేదు.
సోషల్ మీడియాలో స్నేహ యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబ విషయాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తన భర్తతో ఉన్న బ్యూటిఫుల్ పిక్స్ ని స్నేహ షేర్ చేసింది.
నేడు ఆమె భర్త ప్రసన్న పుట్టినరోజు. ఈ సందర్భంగా స్నేహ తన భర్తకు బర్త్ డే విషెష్ చెబుతూ అతడి కౌగిలిలో ఒదిగిపోయి ఉన్న ఫొటోస్ షేర్ చేసింది.
ఈ సందర్భంగా స్నేహ స్టన్నింగ్ లుక్ తో అందరిని ఆశ్చర్యపరుస్తోంది. బ్లాక్ డాట్స్ ఉండే వైట్ డ్రెస్ లో అందాల క్వీన్ లా వెలిగిపోతోంది. ఆమె వయసు అమాంతం తగ్గిపోయిందా అన్నట్లుగా స్నేహ ఫోటోస్ ఉన్నాయి.