- Home
- Entertainment
- Shriya Saran: కూతురు రాధతో శ్రియ శరన్ ఫోటో షూట్... లిటిల్ ప్రిన్సెస్ అంటూ మురిసిపోతున్న ఫ్యాన్స్!
Shriya Saran: కూతురు రాధతో శ్రియ శరన్ ఫోటో షూట్... లిటిల్ ప్రిన్సెస్ అంటూ మురిసిపోతున్న ఫ్యాన్స్!
శ్రియ శరన్ తన కూతురు రాధ శరన్ కొషీవ్ తో మెస్మరైజింగ్ ఫోటో షూట్ చేశారు. తన గారాల పట్టితో స్టార్ లేడీ చేసిన ఈ ప్రొఫెషనల్ ఫోటో షూట్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. శ్రియ శరన్ డాటర్ క్యూట్ నెస్ కి అభిమానులు పడిపోయారు. ఆమె లిటిల్ ప్రిన్సెస్ వలె ఉందని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Shriya Saran
శ్రియ 2018లో రష్యాకు చెందిన ఆండ్రీ కొషీప్ ని వివాహం చేసుకున్నారు. ఆమెకు గర్భం దాల్చి, పాపకు జన్మనిచ్చిన విషయం అసలు ఎవరికీ తెలియదు. సడన్ గా తనకు కూతురు ఉన్నట్లు చెప్పి బాంబు పేల్చింది. శ్రియ అసలు గర్భవతి ఎప్పుడయ్యారని ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు.
Shriya Saran
2021 జనవరి 10న శ్రియకు అమ్మాయి పుట్టింది. ఈ విషయాన్ని ఆమె 10 నెలల తర్వాత 2021 అక్టోబర్ లో తెలియజేశారు. లాక్ డౌన్ సమయంలో శ్రియ గర్భం దాల్చారు. 2020లో ఏడాది పాటు పూర్తిగా లాక్ డౌన్ నడిచింది. షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. ప్రొఫెషన్ కి కూడా బ్రేక్ వచ్చిన నేపథ్యంలో శ్రియ తన ప్రెగ్నెన్సీ రివీల్ చేయలేదు. రహస్యంగా బిడ్డను కన్నారు.
Shriya Saran
పెళ్లైన శ్రియ గర్భవతి అయిన విషయం దాచి పెట్టాల్సిన అవసరం ఏమిటని ఫ్యాన్స్ మదనపడ్డారు. ఇటీవల శ్రియ ఆ సంగతి బయటపెట్టారు. గర్భం దాల్చడం వలన శరీరంలో అనేక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా బరువు పెరిగి లావు కావచ్చు. షేప్ అవుట్ కావడం సామాన్యులకు చిన్న మేటర్. కానీ సెలబ్రిటీల విషయంలో దాన్ని భిన్నంగా చూస్తారు. తల్లయ్యాక నేను లావైతే బాడీ షేమింగ్ కి గురి కావచ్చు. అవన్నీ మానసికంగా ఒత్తిడికి గురి చేస్తాయి.
Shriya Saran
బాడీ షేమింగ్, సోషల్ మీడియా ట్రోలింగ్ కి భయపడి నేను ప్రెగ్నెన్సీ విషయం బయటకు చెప్పలేదు. నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి అనుకున్నాను.. అంటూ శ్రియ వివరణ ఇచ్చారు. శ్రియ లేటెస్ట్ మూవీ దృశ్యం 2(హిందీ) సక్సెస్ మీట్లో ఈ విషయాలు వెల్లడించారు.
Shriya Saran
శ్రియ శరన్ నటించిన లేటెస్ట్ మూవీ కబ్జా. ఉపేంద్ర హీరోగా నటించారు. ఈ మూవీ మార్చి 17న విడుదల కానుంది. విడుదలైన కబ్జా ట్రైలర్ ఆకట్టుకుంది. స్టార్ హీరోయిన్ గా శ్రియ సౌత్ ఇండియాను ఏలారు. రెండు తరాల సూపర్ స్టార్స్ తో నటించిన ఘనత శ్రియ సొంతం. ప్రస్తుతం తెలుగులో శ్రియ అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు.అయితే ఆమెకు బాలీవుడ్ లో వయసుకు తగ్గ పాత్రలు రావడం విశేషం. సీనియర్ స్టార్స్ పక్కన ఆమెకు ఆఫర్స్ దక్కుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీలో శ్రియా నటుడు అజయ్ దేవ్ గణ్ భార్యగా తళుక్కున మెరిశారు.
Shriya Saran
కెరీర్ లో అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ నమోదు చేశారు. గొప్ప డాన్సర్ అయిన శ్రియ అప్పట్లో అబ్బాయిల కలల రాణిగా వెలిగిపోయారు. ఇటీవల శ్రియ ప్రధాన పాత్రలో గమనం టైటిల్ తో మూవీ విడుదలైంది.గమనం చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం విశేషం. నటన పరంగా కూడా అద్భుతం చేయగల శ్రియ మరికొంత కాలం నటించాలని, అలరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Shriya Saran
శ్రియ శరన్ తన కూతురు రాధ శరన్ కొషీవ్ తో మెస్మరైజింగ్ ఫోటో షూట్ చేశారు. తన గారాల పట్టితో స్టార్ లేడీ చేసిన ఈ ప్రొఫెషనల్ ఫోటో షూట్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. శ్రియ శరన్ డాటర్ క్యూట్ నెస్ కి అభిమానులు పడిపోయారు. ఆమె లిటిల్ ప్రిన్సెస్ వలె ఉందని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.