MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షూటింగ్ అయిపోగానే ఐసు గడ్డల తొట్టెలో కూర్చున్న సమంత... వాళ్ళు అంత టార్చర్ పెడుతున్నారా!

షూటింగ్ అయిపోగానే ఐసు గడ్డల తొట్టెలో కూర్చున్న సమంత... వాళ్ళు అంత టార్చర్ పెడుతున్నారా!

సమంత షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతుంది. ఐస్ బాత్ చేస్తున్న సమంత టార్చర్ టైం అని క్యాప్షన్ పెట్టారు. సిటాడెల్ షూటింగ్ కోసం సమంత ఎంత కష్టపడుతున్నారో చెప్పేందుకు ఇది నిదర్శనం. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : May 02 2023, 10:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Samantha

Samantha

హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాల షూటింగ్ లో పాల్గొంటున్న సమంత అలసిపోతున్నారట. రికవరీ కావడానికి ఐస్ బాత్ చేస్తుందట. అయితే ఈ ట్రీట్మెంట్ టార్చర్ లా ఉందట. ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం పొందాలంటే తప్పదని సమంత చెప్పకనే చెప్పారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సిటాడెల్ యాక్షన్ సిరీస్. సమంత కఠినతరమైన స్టంట్స్ చేస్తున్నారు. ఆ మధ్య రెండు చేతులకు గాయాలైన ఫోటోలు సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరి ఇంత కష్టపడుతున్న సమంతకు సిటాడెల్ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. 
 

36

సిటాడెల్ ఇంటర్నేషనల్ సిరీస్. ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా చేశారు. దాని ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. బోల్డ్ సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని సమాచారం. శృంగార సన్నివేశాల్లో నటించేందుకు చాలా ఇబ్బందిపడ్డానని ప్రియాంక చోప్రా నేరుగా చెప్పారు. ఏప్రిల్ 28 నుండి సిటాడెల్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. 
 

46
Samantha Ruth Prabhu web

Samantha Ruth Prabhu web

ఈ క్రమంలో వరుణ్ ధావన్-సమంత మధ్య ఆ తరహా సన్నివేశాలు ఉండనున్నాయి. అయితే ఇండియన్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని డోసు కొంచెం తగ్గించి ఉండవచ్చు. సిటాడెల్ సిరీస్ కి ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.  
 

56

ప్రస్తుతం సమంత సిటాడెల్ తో పాటు విజయ్ దేవరకొండ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ ఖుషి టైటిల్ తో ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నారు. ఖుషి చిత్రీకరణ చివరి దశకు చేరింది. సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా కాలం తర్వాత సమంత లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. గతంలో శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత మజిలీ చిత్రం చేశారు. అది సూపర్ హిట్ కొట్టింది.

66


 ఇక శాకుంతలం మూవీతో సమంతకు భారీ షాక్ తగిలింది. సమంత కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ గా శాకుంతలం నిలిచింది. దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. శాకుంతలం మూవీతో దిల్ రాజు పెద్ద మొత్తంలో నష్టపోయినట్లు వార్తలు వస్తున్నాయి. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karisma Kapoor Home: కరిష్మా కపూర్ లగ్జరీ ఇల్లు చూశారా? చెక్కతో చేసిన ఇంద్రభవనంలా ఉంది!
Recommended image2
Nagadurga: అమ్మో సినిమాల్లోకి రాగానే ఇన్ని షరతులా?
Recommended image3
July Telugu Movies: నాగబంధం నుంచి రావు బహదూర్ వరకు, జూలై లో క్రేజీ సినిమాల సందడి.. అఖిల్ కి గట్టి పోటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved