MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ హీరోతో సమంత ఆఫ్ స్క్రీన్ రొమాన్స్, సెన్సేషనల్ ఫోటో వైరల్!

ఆ హీరోతో సమంత ఆఫ్ స్క్రీన్ రొమాన్స్, సెన్సేషనల్ ఫోటో వైరల్!

సమంత ఓ హీరోతో ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటో నేపథ్యం ఏమిటో చూద్దాం..  

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 31 2024, 11:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Samantha

Samantha

సమంత బాలీవుడ్ హీరోతో ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ చేస్తుంది. ఆయన ఒడిలో సేద తీరింది. ఈ పిక్ ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ పిక్ లో సమంతతో ఉన్న హీరో వరుణ్ ధావన్. హనీ బన్నీ ప్రమోషన్స్ లో భాగంగా సమంత ఈ ఫోటో షేర్ చేసింది. సదరు ఫోటోకి వరుణ్ ధావన్ 'అర్రె అర్రె అర్రె' అని కామెంట్ పెట్టాడు. రిప్లైగా సమంత 'లేదు నువ్వు చెయ్యలేదు' అని కామెంట్ చేసింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అమెరికన్ సిరీస్ సిటాడెల్ కి ఇండియన్ వెర్షన్ అయిన హనీ బన్నీ సిరీస్లో సమంత-వరుణ్ ధావన్ జంటగా నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ నవంబర్ 7నుండి స్ట్రీమ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు మరింత పెంచారు. ఇక వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా కెరీర్లో సమంత దూసుకుపోతుంది. గత మూడేళ్ళలో సమంత అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. 

హీరో నాగ చైతన్యతో సమంత విడాకులు తీసుకుంది. 2021 అక్టోబర్ లో పరస్పర అవగాహనతో విడాకులు తీసుకుంటున్నట్లు సమంత-నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అప్పటి నుండి సమంత సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తుంది. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొన్న నాగ చైతన్య ఇటీవల ఆమెతో నిశ్చితార్థం జరుపుకున్నాడు. 
 

35

శోభిత ధూళిపాళ్ల-నాగ చైతన్య పెళ్లి వేడుకలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. వైజాగ్ వేదికగా పెళ్లి జరగనుంది. శోభిత ఇంట్లో పెళ్లి సాంప్రదాయాలు మొదలయ్యాయి. పసుపు వేడుక ఫోటోలు శోభిత తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. నాగ చైతన్య-శోభిత ఏడడుగుల బంధంతో ఒక్కటి కానున్నారు. 

మరోవైపు సమంత పై ఎఫైర్ రూమర్స్ రావడం విశేషం. దర్శకుడు రాజ్ నిడిమోరు-సమంత డేటింగ్ చేస్తున్నారు అనేది వాదన ఇటీవల తెరపైకి వచ్చింది. బాలీవుడ్ మీడియాలో ఈ మేరకు కథనాలు వెలువడ్డాయి. ది ఫ్యామిలీ మ్యాన్, ది ఫ్యామిలీ మ్యాన్ 2, ఫర్జీ వంటి సక్సెస్ఫుల్ సిరీస్లు తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్నారు. 

45

రాజ్ అండ్ డీకే తెలుగువారే కాగా వీరిలో ఒకరితో సమంత రిలేషన్ పెట్టుకున్నారట. ది ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత నటించింది. ఆమె శ్రీలంకకు చెందిన తమిళ్ రెబల్ రోల్ చేసింది. ఇక హనీ బన్నీ సిరీస్ కి సైతం రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. 

ప్రాజెక్ట్స్ లో భాగంగా రాజ్-సమంత కొన్నాళ్లుగా కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఈ పరిచయం ప్రేమకు దారి తీసింది అనేది బాలీవుడ్ టాక్. ఆ మధ్య సమంత ముంబైలో ప్రత్యక్షమైంది. సమంతను చుట్టుముట్టిన మీడియా కెమెరాల్లో బంధించింది. సమంత ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక రాజ్ నిడిమోరుతో వస్తున్న ఎఫైర్ రూమర్స్ పై సమంత స్పందించలేదు. దీనిపై స్పష్టత రావాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.  
 

55


సమంత ఇటీవల నిర్మాతగా మారింది. ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసింది. ఈ సంస్థలో మొదటి ప్రాజెక్ట్ గా మా ఇంటి బంగారం ప్రకటించింది. సమంత ప్రధాన పాత్ర చేస్తున్న మా ఇంటి బంగారం చిత్రంలో ఆమె లుక్ ఆకట్టుకుంది. అలాగే సమంతకు కొన్ని బిజినెస్ లు ఉన్నాయి. ఆమెకు సాకీ పేరుతో ఆన్లైన్ గార్మెంట్ బ్రాండ్ ఉంది. ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి సామాజిక సేవ చేస్తుంది. సమంత స్ట్రాంగ్ ఉమెన్ అనడంలో సందేహం లేదు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
CM Vijay Movies: విజయ్ దళపతి కెరీర్‌లో ఈ 7 సినిమాలు చాలా స్పెషల్, జననాయగన్ కంటే ముందు చూడాల్సిన మూవీస్ ఇవే..
Recommended image2
Mannat: 18 కోట్లకు కొన్న బంగ్లా విలువ ఇప్పుడు 300 కోట్లు.. దేశంలోనే ఖరీదైన బంగ్లా..
Recommended image3
Ramayana Release: రామాయణం రిలీజ్ డేట్ లీక్? ఆ పెద్ద సినిమాతో రణ్‌బీర్ మూవీ క్లాష్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved