MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sai Pallavi: ఏకంగా యాభై కోట్లు కోల్పోయిన సాయి పల్లవి... అది ఓ స్టార్ హీరోయిన్ లైఫ్ టైం సంపాదన!

Sai Pallavi: ఏకంగా యాభై కోట్లు కోల్పోయిన సాయి పల్లవి... అది ఓ స్టార్ హీరోయిన్ లైఫ్ టైం సంపాదన!

హీరోయిన్ సాయి పల్లవి నిర్ణయాల కారణంగా కోట్ల రూపాయలు నష్టపోయారని ఓ అంచనా. డబ్బుల కోసం తాను నమ్మిన సిద్ధాంతాన్ని వదలననే సాయి పల్లవి ఓ హీరోయిన్ జీవిత కాలపు సంపాదన కోల్పోయిందట.

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 05 2022, 01:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Sai Pallavi

Sai Pallavi

హీరోయిన్స్ నందు సాయి పల్లవి(Sai Pallavi) వేరయా... ఆమె ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు. నిజంగా సాయి పల్లవి ఈ రోజుల్లో పుట్టాల్సిన అమ్మాయి. ఆమె ఆలోచనలు, పద్ధతులు, ఆచరణలు ఎప్పుడో సావిత్రి కాలాన్ని తలపిస్తాయి. హీరోయిన్ గా పరిశ్రమలో ఉండాలంటే తమ ఇష్టాలు, సిద్ధాంతాలు వదిలేయాలని, గుడ్డిగా దర్శకులు చెప్పినట్లు నడుచుకోవాలనే రూల్ ఆమె బ్రేక్ చేశారు. 
 

28


సాయి పల్లవి రెమ్యునరేషన్ కాదు పాత్ర ముఖ్యం అంటారు. కోట్లు కుమ్మరించినా నచ్చని పాత్ర చేయరు. ఓవర్ గ్లామరస్ పాత్రలు, స్కిన్ షోకి వ్యతిరేకం. అలాగే కథలో తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే చేయరు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా చేయనని ధైర్యంగా చెప్పిన ఘనత సాయి పల్లవి సొంతం. 

 

38

సాయి పల్లవి నటించిన ప్రతి చిత్రంలో ఆమె పాత్ర చాలా యూనిక్ గా ఉంటుంది. హీరోతో పోటీ పడేలా, కొన్ని చిత్రాల్లో డామినేట్ చేసేలా ఆమె రోల్ ఉంటుంది. డిమాండ్ ఉంది కదా అని కోట్లు డిమాండ్ చేయరు. సినిమా బడ్జెట్ ఆధారంగా నిర్మాతలకు భారం కాకుండా తన రెమ్యూనరేషన్ ఉంటుంది. సినిమా కారణంగా నిర్మాత నష్టపోయాడని తెలిస్తే డబ్బులు తిరిగిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయట. 

48


ఇక సాయి పల్లవి దగ్గరున్న మరో గొప్ప లక్షణం వ్యాపార ప్రకటనలకు దూరం. తాను నమ్మని విషయాన్ని ప్రచారం చేయనంటారు సాయి పల్లవి. ఈ కారణంగా ఆమెకు వచ్చిన అనేక ఎండార్స్మెంట్ వదులుకున్నారు. సదరు వ్యాపార సంస్థలు కోట్లు ఇస్తానన్న సాయి పల్లవి నిర్మొహమాటంగా నో చెప్పేశారు. 
 

58

ఎట్టి పరిస్థితుల్లోనూ తన సిద్ధాంతాలను బ్రేక్ చేయని సాయి పల్లవి ఏకంగా రూ. 50 కోట్లు నష్టపోయారట. సాయి పల్లవి వదులుకున్న వెబ్ సిరీస్లు, సినిమాలు, ఎండార్మెంట్స్ తాలూకు రెమ్యూనరేషన్ ఏకంగా యాభై కోట్ల వరకు ఉంటుందట. యాభై కోట్లు అంటే ఓ స్టార్ హీరోయిన్ జీవిత కాలపు సంపాదన. అంత మొత్తాన్ని కూడా సాయి పల్లవి తృణప్రాయంగా వదిలేసింది.

68

ఇటీవల సాయి పల్లవికి ఆఫర్స్ తగ్గాయి. 2021లో శ్యామ్ సింగరాయ్ విడుదల కాగా... ఇటీవల గార్గి టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేశారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క చిత్రం కూడా లేదు. చర్చల దశలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. చూస్తుంటే సాయి పల్లవి కెరీర్ కొంచెం నెమ్మదించినట్లు అనిపిస్తుంది. 

78


దీంతో ఆమెకు కొందరు సలహాలు ఇస్తున్నారట. సిద్ధాంతాలు, పద్ధతులు మడిగట్టుకు కూర్చుంటే కుదరదు... గ్లామర్ రోల్స్ కి సై అని చెప్పు కెరీర్ ఊపందుకుంటుంది అని చెబుతున్నారట. అవసరమైతే సినిమాలు వదిలేస్తా... అంతే కానీ అలాంటి పాత్రలు చేయనని సాయి పల్లవి కుండబద్దలు కొట్టారట. సినిమా అవకాశాలు రాకున్నా నేను డాక్టర్ వృత్తిలో కొనసాగగలనని విశ్వాసంగా చెబుతున్నారట. 

88


మరోవైపు ఆమె ఫ్యాన్స్ విరివిగా చిత్రాలు చేయాలని కోరుకుంటున్నారు. సాయి పల్లవి నటన, డాన్స్ కి తెలుగు, తమిళ భాషల్లో భారీగా అభిమానులున్నారు. పబ్లిక్ వేడుకల్లో సాయి పల్లవిని చూస్తే కుర్రాళ్లు నినాదాలతో హోరెత్తిస్తారు. ఆమెకు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సాయి పల్లవి

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun Favorite Movie: అల్లు అర్జున్‌కి ఇష్టమైన చిరంజీవి మూవీ ఏంటో తెలుసా? రౌడీ అల్లుడు కాదు.. ప్రతిసారి కొత్త ఫీలింగ్‌
Recommended image2
AI Photos: 80ల నాటి హీరోయిన్లు ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే మతిపోతుంది
Recommended image3
Expensive Indian Films: వారణాసి, రామాయణ మాత్రమే కాదు.. అత్యంత ఖరీదైన 5 సినిమాలు ఇవే, 17 ధురంధర్ 2లతో సమానం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved