- Home
- Entertainment
- పాల రోజా ఫ్రాక్ లో కైపెక్కిస్తున్న జయం సదా... నాలుగు పదుల వయసులో కూడా తరగని గ్లామర్!
పాల రోజా ఫ్రాక్ లో కైపెక్కిస్తున్న జయం సదా... నాలుగు పదుల వయసులో కూడా తరగని గ్లామర్!
హీరోయిన్ సదా సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. ఆమె నటిగా, బుల్లితెర జడ్జిగా సత్తా చాటుతున్నారు .

Sadaa
స్టార్ మాలో నీతోనే డాన్స్ పేరుతో డాన్స్ రియాలిటీ షో ప్రారంభమైంది. ఈ షోకి జడ్జిగా సదా వ్యవహరిస్తోంది. లేటెస్ట్ ఎపిసోడ్ కోసం పాల రోజా కలర్ లాంగ్ ఫ్రాంక్ ధరించింది. ఫ్రాక్ సదా గ్లామర్ రెట్టింపు చేసింది. నాలుగు పదుల వయసులో కూడా ఆమె గ్లామర్ ఇంచు కూడా తగ్గలేదని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.
Sadaa
అనూహ్యంగా బుల్లితెర మీద సదా బిజీ అవుతుంది. ఇటీవల జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చింది. ఎక్స్ట్రా జబర్దస్త్ లో కృష్ణభగవాన్ తో పాటు జడ్జిగా ఆమె ఒక ఎపిసోడ్ లో కనిపించింది. సదా రాకతో ఎక్స్ట్రా జబర్దస్త్ కలర్ ఫుల్ గా మారింది.
Sadaa
సదా అహింస మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా రిటైర్ సదాకు కీలకమైన క్యారెక్టర్ రోల్స్ దక్కవచ్చు. అహింస చిత్రానికి తేజా దర్శకుడు. దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమయ్యాడు. అయితే అహింస డిజాస్టర్ అయ్యింది. అహింస మూవీ గురించి మాట్లాడుకున్న నాథుడే లేడు.
Sadaa
ఇక సదాను వెండితెరకు పరిచయం చేసింది తేజానే కావడం విశేషం. తేజా కెరీర్లో అతి పెద్ద హిట్ గా ఉన్న జయం చిత్రంలో సదా హీరోయిన్ గా చేశారు. నితిన్ సైతం ఇదే మూవీతో హీరో అయ్యాడు. జయం మూవీ సదాను ఓవర్ నైట్ స్టార్ చేసింది. ఆమెకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
Sadaa
అనంతరం ఎన్టీఆర్ కి జంటగా నాగ చిత్రం చేసింది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన నాగ ఆశించిన స్థాయిలో ఆడలేదు. సదా జతకట్టిన మరో పెద్ద హీరో బాలకృష్ణ. వీరి కాంబోలో తెరకెక్కిన వీరభద్ర డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
Sadaa
మంచి ఆరంభం లభించిన సదా కెరీర్ నిర్మించుకోలేకపోయింది. స్టార్ లేడీగా ఇండస్ట్రీని ఊపేస్తోంది అనుకుంటే టైరు టూ హీరోలకు పడిపోయారు. తెలుగులో పెద్ద హీరోలు ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు.
Sadaa
అనూహ్యంగా శంకర్ డైరెక్షన్ లో అపరిచితుడు చేసే అవకాశం దక్కింది. అగ్రహారం బ్రాహ్మణ అమ్మాయి పాత్రకు సదాను ఎంపిక చేశారు. శంకర్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆ పాత్రకు సదా వంద శాతం న్యాయం చేసింది. అపరిచితుడు భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సదాకు అపరిచితుడు వంటి విజయం మరలా దక్కలేదు.