MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • వామ్మో హీరోయిన్‌ రాశీ చాలా స్పీడ్‌.. అసిస్టెంట్‌కి లవ్‌ ప్రపోజ్‌.. కోటీశ్వరులను కాదని సంచలన నిర్ణయం..

వామ్మో హీరోయిన్‌ రాశీ చాలా స్పీడ్‌.. అసిస్టెంట్‌కి లవ్‌ ప్రపోజ్‌.. కోటీశ్వరులను కాదని సంచలన నిర్ణయం..

ఒకప్పటి హీరోయిన్‌ రాశీ.. ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది. సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నా ఆమె తన లవ్‌ స్టోరీని బయటపెట్టింది. ఇది చాలా క్రేజీగా ఉండటం విశేషం.  

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Jul 07 2024, 07:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

రాశీ.. దాదాపు పదేళ్ల పాటు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమని షేక్‌ చేసిన హీరోయిన్‌. తెలుగు అమ్మాయి అయిన రాశీ బాలనటిగా కెరీర్‌ని ప్రారంభించింది. తమిళ చిత్రాల ద్వారా హీరోయిన్‌గా మారింది. అక్కడ స్టార్ గా ఎదిగి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. `పెళ్లి పందిరి` సినిమాతో నటిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆమె పవన్‌ కళ్యాణ్‌ `గోకుళంలో సీత` చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఇందులో పవన్‌ ప్రియురాలిగా, శ్రీహరి భార్యగా నటించి మెప్పించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఆ తర్వాత `శుభాకాంక్షలు`, పండగ`, `మనసిచ్చి చూడు`, `డాడీ డాడీ`, `స్వప్నలోకం`, `హరిశ్చంద్ర`, `శీను`, `కృష్ణబాబు`, `ప్రేయసి రావే`, `ఏకే 47`, `పోస్ట్ మ్యాన్‌`, `ఒకే మాట`, `మూడు ముక్కలాట`, `అమ్మో ఒకటో తారీఖు`, `దేవుళ్లు`, `మా ఆవిడ మీ ద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది`, `దీవించండి`, `చెప్పాలని ఉంది`, `సందడే సందడి`, `నిజం`, `శ్రీరామచంద్రులు` వంటి చిత్రాలతో మెరిసింది. స్టార్ హీరోయిన్‌గా రాణించింది. 

39

ముఖ్యంగా `శుభాకాంక్షలు`, `ప్రేయసి రావే`, `మూడుముక్కలాట`, `దేవుళ్లు` వంటి చిత్రాలు రాశీని తిరుగులేని హీరోయిన్‌ని చేశాయి. కెరీర్‌కి పెద్ద బ్రేక్‌ ఇచ్చాయి. అంతేకాదు `నిజం` సినిమాలో ఆమె నెగటివ్‌ రోల్స్ కూడా చేసింది. అలాగే ఐటెమ్ సాంగ్స్ కూడా చేసింది రాశీ. అయితే చాలా వరకు శ్రీకాంత్‌, జగతిబాబు వంటి హీరోలతోనే చేసింది రాశీ. బాలయ్యతో `కృష్ణబాబు` సినిమాలో మెరిసింది. పదేళ్లు ఊపేసిన ఆమె సడెన్‌గా సినిమాలు తగ్గించింది. పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. 

49

రాశీ.. శ్రీముని(ఎస్‌ఎస్‌ నివాస్‌)ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. శ్రీముని దర్శకుడు. రాశీని పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన అసిస్టెంట్‌ డైరెక్టర్‌. 2005లో వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రాశీ సినిమాలకు దూరంగా ఉంది. పూర్తిగా ఫ్యామిలీకే పరిమితమయ్యింది. అయితే శ్రీముని ని పెళ్లిచేసుకోవడం, వీరిద్దరి మధ్య లవ్‌ స్టోరీని ఇటీవల బయటపెట్టింది రాశీ. చాలా విచిత్రంగా తామిద్దరం కలిసినట్టు తెలిసింది. 
 

59

ఆ టైమ్‌లో రాశీ స్టార్‌ హీరోయిన్ గా రాణిస్తుంది. తెలుగు, తమిళంలో బిజీగా ఉంది. రాశీ నటించిన కొన్ని సినిమాలకు శ్రీముని అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఓ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు చిత్రీకరణ పూర్తయ్యే సమయంలో సెట్‌లో ఎవరినైనా ఒకరిని ఆటపట్టించే అలవాటు ఉందట రాశీకి. దీంతో ఆ సమయంలో అసిస్టెంట్‌ నివాస్‌ని ఆటపట్టించిందట. నివాస్‌ గురించి ఓ స్పెషల్‌ విషయాన్ని చెప్పానని చెప్పు అంటూ మరో అసిస్టెంట్ ద్వారా చెప్పిందట రాశీ. 
 

69

దీంతో శ్రీముని కన్‌ఫ్యూజన్‌లో పడ్డాడట. రెండు రోజులపాటు ఆయన రాశీ వెంటపడ్డాడట. అయినా చెప్పాలేదు. తర్వాత చెబుతానని చెప్పి ఫోన్‌ నెంబర్‌ తీసుకుందట. ఆ తర్వాత ఫోన్‌ చేసి సరదాగా అన్నానని, ఏం లేదని అసలు విషయం చెప్పిందట. దీంతో శ్రీముని ఊపిరి పీల్చుకున్నాడు. కానీ ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. 
 

79

ఆ సమయంలో రాశీకి సినిమాలు తగ్గుతున్నాయట. దీంతో మ్యారేజ్‌ చేసుకుని సెటిల్‌ కావాలనుకుందట.పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలోనే తండ్రి చనిపోయాడు. దీంతో ఫ్యామిలీలో పెద్ద విషాదం. రాశీ ఒంటరిగా ఫీలయ్యింది. శ్రీముని తనకు మోరల్‌ సపోర్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ పెళ్లి సంబంధాల చర్చ వచ్చినప్పుడు పలు కోటీశ్వరులు, వ్యాపారవేత్తలు మ్యారేజ్‌ చేసుకునేందుకు ముందుకు వచ్చారట. కానీ ఎందుకు వాళ్లని చేసుకోవడం రాశీకి నచ్చలేదు. 
 

89

ఈ క్రమంలో సడెన్‌గా నివాస్‌కి షాకిచ్చింది. ఓ రోజు మనం పెళ్లి చేసుకుందామని ఆయనతో చెప్పిందట. రెండు రోజులు టైమ్‌ తీసుకుని శ్రీముని సైతం ఓకే చెప్పాడు. అలా అనుకోకుండా ఈ ఇద్దరి మ్యారేజ్‌ జరిగింది. ఆ తర్వాత ఆయన కూడా దర్శకుడిగా మారాడు. దాదాపు 20ఏళ్లుగా ఈ ఇద్దరు ఎంతో ప్రేమగా, అన్యోన్యంగా ఉన్నారు. తాము ఎంత బాగా ఉన్నామని చెప్పడానికి, తమ ప్రేమకి నిదర్శనమే ఈ ఇరవై ఏళ్ల కాపురం అని చెప్పింది రాశీ.  ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపింది రాశీ. 

99

2013 తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన రాశీ.. కీలక పాత్రల్లో మెరుస్తూ కనిపించింది. తల్లి పాత్ర, అత్త పాత్రలు చేస్తుంది. కళ్యాణ వైభోగమే, ఆకతాయి, లంక సినిమాలు చేసింది. ఇప్పుడు సినిమాలు మానేసి సీరియల్స్ తో బిజీగా ఉంది.  బలమైన క్యారెక్టర్స్ వస్తే సినిమాలు చేసేందుకు రెడీగా ఉంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahendragiri Varahi Movie Review: మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ.. సుమంత్‌కి ఈ సారైనా హిట్‌ పడిందా?
Recommended image2
Mohan Babu: నన్ను అంత మాట అంటావా... సీనియర్ నటుడిని అవమానించిన మోహన్ బాబు, ట్విస్ట్ ఏంటంటే?
Recommended image3
Chiranjeevi Movies: చిరంజీవి సినిమాల లైనప్ ఇదే..అందరూ సూపర్ హిట్ దర్శకులే, క్యూలో నలుగురు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved