పూర్ణ బేబీ బంప్ ఏమైంది... లేటెస్ట్ లుక్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్!
హీరోయిన్ పూర్ణ లేటెస్ట్ ఫోటో షూట్ కొత్త చర్చకు దారితీసింది. సదరు ఫొటోల్లో ఆమెకు బేబీ బంప్ కనిపించలేదు.

Purnaa
హీరోయిన్ పూర్ణ గర్భం దాల్చిన విషయం తెలిసిందే. ఈ గుడ్ న్యూస్ ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. పూర్ణ తలయ్యారన్న వార్త తెలిసిన ఫ్యాన్స్ బెస్ట్ విషెస్ తెలియజేశారు.
Purnaa
ఇక బేబీ బంప్ తో పూర్ణ ఫోటో షూట్ కూడా చేశారు. లైట్ పింక్ గౌను ధరించి పూర్ణ నిండు గర్భంతో మనసులు దోచేశారు. తల్లిగా మీ లుక్ అద్భుతం అంటూ అభిమానులు ప్రశంసలు కురిపించారు. అయితే లేటెస్ట్ ఫోటో షూట్లో పూర్ణ బేబీ బంప్ కనిపించలేదు.
Purnaa
బ్లాక్ అవుట్ ఫిట్ ధరించిన పూర్ణ సూపర్ స్టైలిష్ గా దర్శనమిచ్చారు. అందం సంగతి ఓకే మీ గర్భం ఏమైందని అభిమానులు అడుగుతున్నారు. ఈ క్రమంలో పలు అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఆమెకు డెలివరీ అయ్యిందా? లేక ఇవి గర్భం రాకముందు ఫోటోలా? అన్న సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.
Purnaa
కాగా గత ఏడాది పూర్ణ గోప్యంగా దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో పూర్ణకు వివాహం జరిగింది. అయితే ఆమెది రహస్య వివాహం. పూర్ణ తన పెళ్లిపై మాట్లాడుతూ... 2022 మే 31న షానిద్ తో నాకు నిశ్చితార్థం జరిగింది. ఇక జూన్ 12న దుబాయ్ లో పెళ్లి జరిగింది. కొన్ని కారణాల వలన అత్యంత సన్నిహితులు మాత్రమే మా వివాహానికి హాజరయ్యారని పూర్ణ వెల్లడించారు.
Purnaa
భర్త అనుమతితో వివాహం అనంతరం కూడా పూర్ణ కెరీర్ కొనసాగిస్తున్నారు. బుల్లితెరపై, సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేస్తున్నారు.. గత ఏడాది పూర్ణ నటించిన తీస్ మార్ ఖాన్ విడుదలైంది. 2022లో తెలుగు తమిళ భాషల్లో కలిపి అరడజను చిత్రాలు చేతిలో ఉన్నాయి.
Purnaa
ఇక పూర్ణ కెరీర్ పరిశీలిస్తే ఆమెకు మంచి ఆరంభం లభించింది. పూర్ణ హీరోయిన్ గా నటించిన సీమటపాకాయ్, అవును లాంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. కొన్ని కారణాల వలన సినిమాలు వాడుకున్నాను, అది నా కెరీర్ కి మైనస్ అయ్యిందని పూర్ణ గతంలో వెల్లడించారు.
Purnaa
ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. హీరోయిన్ గా దాదాపు ఫేడ్ అవుటైన పూర్ణ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అఖండ, దృశ్యం 2 చిత్రాల్లో పూర్ణ ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కించుకున్నారు. అలాగే టెలివిజన్ షోస్ లో తన మార్కు ఎంటర్టైన్మెంట్ తో అలరిస్తున్నారు.