- Home
- Entertainment
- అల్లు అర్జున్ కు లిప్ లాక్ ఇస్తానంటున్న హీరోయిన్, రోమాన్స్ కు కూడా రెడీ అంటోన్న బ్యూటీ..?
అల్లు అర్జున్ కు లిప్ లాక్ ఇస్తానంటున్న హీరోయిన్, రోమాన్స్ కు కూడా రెడీ అంటోన్న బ్యూటీ..?
అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్.. స్టైలీష్ ఐకాన్. హ్యాండ్సమ్ స్టార్. బన్నీ అంటే ఇష్టపడని వారుఉంటారా. ఆయనపై మనసు పారేసుకోని అమ్మాయిలు ఉండరేమో.. అంతలా రొమాంటిక్ ఇమేజ్ ను సాధించిన అల్లు అర్జున్ పై..తాజాగా మరో హీరోయిన్ చేసిన రొమాంటిక్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్టైల్ అనే పదానికి నిర్వచనంగా మారాడు అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ గా అదరగొడుతున్నాడు. ఆయనంటే ఇష్టపడని వారు ఉండరు. అమ్మాయిల్లో బన్నీ ఫాలోయింగ్ మామూలుగా లేదు. మొన్నటి వరకూ తెలుగు రాష్ట్రాలకే పరిమితం అయిన బన్నీ ఇమేజ్.. ఇప్పుడు పాన్ ఇండియాను కూడా దడదడలాడిస్తోంది.
రాష్ట్రాలు దాటి అల్లు అర్జున్ ఇమేజ్ పెరిగిపోతోంది. అంతే కాదు సామాన్యుల నుంచి సెలబ్రిటీ లేడీస్ వరకూ అల్లు అర్జన్ పై మనసుపారేసుకున్నవారు చాలామంది ఉన్నారు. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ తారలు బన్నీతో రొమాన్స్ చేయాలని ఉంది అంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు. రీసెంట్ గా కన్నడ సూపర్ స్టార్ సుదీప్ కూతురు కూడా బన్నీపై తన ఇష్టాన్ని వెల్లడించింది ఒక్క సారి.. బన్నీతో ఫోటో దిగితే చాలు అదృష్టం అంది. ఇక తాజాగా మరో హీరోయిన్ ఐకాన్ స్టార్ పై బోల్డ్ కామెంట్స్ చేసింది.
కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార ప్రియా భవాని శంకర్. తొలి చిత్రంతోనే తన అందంతో కుర్రకారును మెస్మరైజ్ చేసిందీ కన్నడ బ్యూటీ. తర్వాత దూత వెబ్ సిరీస్‌లో ఆకట్టుకుంది. ఇక తాజాగా భీమా మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఆ సినిమాలో గోపీచంద్ జోడీగా అందరిన్నీ ఆకట్టుకుంది.
ఇక ఈ మూవీ ప్రమోషన్ సందర్భంగా ప్రియా చేప్పిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం కారణంగా కూడా ఈమె నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రీసెంట్ గా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రియా.. ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఏ నటుడితో సినిమాల్లో లిప్‌లాక్ చేయాలనుకుంటున్నారన్న ప్రశ్నకు సూటిగా సమాధానం ఇచ్చింది.
ఆ ప్రశ్నకు తాను అల్లు అర్జున్ అభిమానినని తెలిపిన ప్రియా.. సినిమాలో రొమాన్స్ సీన్ ఉంటే అల్లు అర్జున్‌తో లిప్ లాక్ చేయడానికి తాను సిద్ధమంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.