- Home
- Entertainment
- Pragya Jaiswalప్రైవేట్ పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్... షార్ట్ మిడ్డీలో హీటెక్కించే లుక్!
Pragya Jaiswalప్రైవేట్ పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్... షార్ట్ మిడ్డీలో హీటెక్కించే లుక్!
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఓ ప్రయివేట్ పార్టీలో ఎంజాయ్ చేశారు. తన సెలెబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Pragya Jaiswal
ప్రగ్యా జైస్వాల్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి హాజరైంది. సదరు పార్టీకి షార్ట్ మిడ్డీలో సూపర్ హాట్ గా తయారైంది. ఫ్రెండ్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఈ బర్త్ డే పార్టీ ఫోటోలు ప్రగ్యా జైస్వాల్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
Pragya Jaiswal
ఈ పార్టీకి మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా హాజరైంది. రకుల్, ప్రగ్యా జైస్వాల్ ల కామన్ ఫ్రెండ్ సామ్ బర్త్ డే అని తెలుస్తుంది. ఇద్దరు హీరోయిన్స్ హాజరైన ఈ పార్టీ ప్రత్యేకత సంతరించుకుంది.
Pragya Jaiswal
36 ఏళ్ల ప్రగ్యా జైస్వాల్ షార్ట్ మిడ్డీలో సూపర్ హాట్ గా ఉంది. పార్టీలో ఆమె స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ప్రగ్యా ఫోటోలపై నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అందాలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Pragya Jaiswal
ఇక ప్రగ్యా జైస్వాల్ పరిశ్రమకు వచ్చి దశాబ్దం కావస్తుంది. 2014లో విరాట్టు అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. అనంతరం టిటో ఎంబీఏ టైటిల్ తో హిందీ చిత్రం చేసింది.
Pragya Jaiswal
మిర్చి లాంటి కుర్రోడు మూవీతో తెలుగులో అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ కి దర్శకుడు క్రిష్ కంచె రూపంలో మంచి ఆఫర్ ఇచ్చాడు. కంచె పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఆ చిత్రంలో నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకు ప్రగ్యా కొంత ఫేమ్ తెచ్చిపెట్టింది.
Pragya Jaiswal
కంచె అనంతరం గుంటూరోడు మూవీలో నటించింది . మనోజ్ హీరోగా తెరకెక్కిన గుంటూరోడు ప్లాప్ అయ్యింది. తర్వాత సాయి ధరమ్ కి జంటగా నటించిన నక్షత్రం మరో డిజాస్టర్. బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు ఆ చిత్రం కూడా ఫేమ్ తేలేకపోయింది.
Pragya Jaiswal
చాలా గ్యాప్ తర్వాత అఖండ రూపంలో ఆమెకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆమె సోలో హీరోయిన్ గా ఇంత పెద్ద విజయం నమోదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
Pragya Jaiswal
అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్ళింది. దాంతో అఖండ ఆమె దశ మార్చలేకపోయింది. ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Pragya Jaiswal
చివరిగా సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రగ్యా ప్రేక్షకులను పలకరించారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా ప్రగ్యా అక్కడ బిజీ అవుతారేమో చూడాలి.
Pragya Jaiswal
బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో ప్రగ్యా ఉనికి కోల్పోయింది. టాలీవుడ్ మేకర్స్ ఆమె పట్ల ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇతర పరిశ్రమలపై ఆమె దృష్టి సారిస్తే మంచిది. టాలెంట్, గ్లామర్ ఉన్నా ప్రగ్యాకు కాలం కలిసి రాలేదు.