- Home
- Entertainment
- పాల రోజా దుస్తుల్లో మృణాల్ ఠాకూర్ పరువాల జాతర... సాంప్రదాయ కట్టులో కూడా ఎంత కవ్విస్తుందో!
పాల రోజా దుస్తుల్లో మృణాల్ ఠాకూర్ పరువాల జాతర... సాంప్రదాయ కట్టులో కూడా ఎంత కవ్విస్తుందో!
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్. సీతారామం బ్యూటీ సోషల్ మీడియా వేదిక అందాల విందు చేసింది. వరుస ఫోటో షూట్స్ తో అభిమానులను అలరిస్తుంది.

Mrunal thakur
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. సాంప్రదాయ కట్టులో కూడా అమ్మడు అందాలు కవ్విస్తున్నాయి. నవ్వుతో మాయ చేస్తూ మరింత డ్యామేజ్ చేస్తుంది. కుర్రాళ్లు కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు.
Mrunal thakur
మహారాష్ట్రకు చెందిన మృణాల్ ఠాకూర్ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించారు. బుల్లితెర ద్వారా వచ్చిన ఫేమ్ తో హీరోయిన్ అయ్యారు.మరాఠీ చిత్రం విట్టి దండు తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. మృణాల్ కి హిందీ మూవీ లవ్ సోనియా బ్రేక్ ఇచ్చింది. వరుసగా సూపర్ 30, బాట్లా హౌస్ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు.
Mrunal thakur
రొమాంటిక్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ సీతారామం మూవీలో సీతగా మృణాల్ తెలుగు ఆడియన్స్ మనసులు దోచేశారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం భారీ విజయం సాధించింది. పెద్దగా అంచనాలు లేని ఈ మూవీ వసూళ్ల వర్షం కురిపించింది. హిందీలో కూడా మెరుగైన వసూళ్లు రాబట్టింది.
Mrunal thakur
సీతారామం సక్సెస్ నేపథ్యంలో మృణాల్ కి తెలుగులో ఆఫర్స్ వస్తున్నాయి. దసరా మూవీతో బ్లాక్ బాస్టర్ కొట్టిన నానికి జంటగా ఒక చిత్రం చేస్తుంది. ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే విజయ్ దేవరకొండకు జంటగా ఒక చిత్రం చేస్తుంది. పూజా హెగ్డే, రష్మిక మందాన, సమంత నెమ్మదించిన నేపథ్యంలో మృణాల్ కి కలిసొచ్చే అవకాశం కలదు.
Mrunal thakur
కాగా మృణాల్ కామెంట్స్ కొంచెం బోల్డ్ గా ఉంటాయి. అసలు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పిన మృణాల్... ఒంటరిగా బ్రతకడమే ఉత్తమం అంటుంది. అలాగే పిల్లలు కావాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనే నియమం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Mrunal thakur
కాగా వెండితెర ఆఫర్స్ కోసం ప్రయత్నం చేస్తున్న రోజుల్లో అవమానాలు ఎదురయ్యాయని మృణాల్ గతంలో చెప్పారు. మట్టి కుండ మాదిరి నల్లగా ఉన్నావు అనేవారట. మట్కా(కుండ) అని నిక్ నేక్ కూడా పెట్టారని మృణాల్ చెప్పారు. సీరియల్ నటి అనగానే తక్కువ భావనతో చూసేవారు. కొన్ని భారీ ప్రాజెక్ట్స్ నుండి తప్పించారంటూ ఆమె వెల్లడించారు. లవ్ సోనియా మూవీతో మృణాల్ కి బ్రేక్ వచ్చింది. సూపర్ 30, బాట్లా హౌస్ చిత్రాలతో నిలదొక్కుకుంది.