అడిగి అడగడంతోనే అభిమానికి ముద్దు ఇచ్చిన మాళవిక మోహనన్, ఇంతకీ ట్విస్ట్ ఏంటంటే..?
ఇలా అడిగాదో లేదో.. తన అభిమాని.. ఫాలోవర్ కు ముద్దు ఇచ్చేసింది హీరోయిన్ మాళవికా మోహనన్. అభిమానికి హీరోయిన్ ముద్దు ఇవ్వడం ఏంటీ.. అని షాక్ అవ్వకండి.. ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ కూడా ఉంది. ఇంతకీ విషయం ఏంటంటే

రజనీకాంత్ పేట సినిమాతో తెలుగు వారికి కూడా పరిచయం అయ్యింది హీరోయిన్ మాళవికా మోహనన్. ఆతరువాత దళపతి విజయ్ మాస్టార్ మూవీలో నటించి..మళ్ళీ డబ్బింగ్ సినిమాతోనే తెలుగు వారిని పలుకరించింది. కాని ఇప్పటి వరకూ తెలుగు సినిమా చేయలేక పోయింది బ్యూటీ.
Malavika Mohanan
అయితే ప్రస్తుతం మాళవిక ప్రభాస్ జోడీగా నటిస్తుందంట టాక్ గట్టిగా వినిపిస్తోంది. ప్రభాస్ మారుతీతో చేస్తోన్న సినిమాలో హీరోయిన్ గా మాళవికను తీసుకున్నట్టు సమాచారం. అయితే రాజా డీలక్స్ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈసినిమాలో ప్రభాస్ తో ఈబ్యూటీ రొమాన్స్ చేస్తుంద. ఈ విషయం తనకు థ్రిల్లింగ్ గా ఉన్నట్టు తాజా చిట్ చాట్ లో వెల్లడించింది బ్యూటీ.
ఇక మాళవిక సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడుతుంది. ఫుల్ యాక్టివ్‌గా ఉంటంది. అంతే కాదు తన సినిమాల కబుర్లు, తనకు సబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో షేర్ చేస్తుంటుంది.అందులో భాగంగానే... తాజాగా, ఆమె తన ట్విటర్ అకౌంట్లో .. ఆస్క్ మాళవిక కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెకు రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి.
అందులో ఓవీరాభిమాని.. మాళవిక మోహనన్ ను ఓ ముద్దు అడిగాడు. మీరు నాకో ముద్దు ఇస్తారా? అని అడిగాడు. ఇందుకు మాళవిక కూడా డిఫరెంట్ గా స్పందించింది. మరీ హట్ అవ్వకుండా.. అలా అడిగినందకు చిరాకు పడకుండా.. ఏమని సమాధానం చెప్పిందంటేూ..? నేను ముద్దు ఇస్తాను.. కాని ఇది మీ డీపీలోని.. ఎంతో అందంగా ఉన్న పిల్లి కోసం అంటూ ఓ ముద్దు సింబల్‌ను పెట్టారు.
ఇక ఈ సెషన్ లో మాళవికకకు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. తర్వాత చాలా మంది ఫ్యాన్స్ ఆమెను అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా సమాధానం ఇచ్చారు.ప్రస్తుతం మాళవిక తన ఫ్యాన్ డీపీలోని పిల్లికి ముద్దు ఇచ్చిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మాళవిక 2013లో వచ్చిన పట్టంపోలె అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2016లో నాను మత్తు వరలక్ష్మి అనే సినిమాతో కన్నడలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. మాళవిక 2020లో మసబా మసబా అనే వెబ్ సిరీస్‌లోనూ నటించారు.