Keerthy Suresh Marriage: హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి ఎప్పుడంటే? ఇదిగో క్లారిటీ!
కీర్తి సురేష్ పెళ్లి ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. ఈ స్టార్ లేడీ తన వివాహం మీద స్వయంగా స్పందించారు. నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.

Keerthy Suresh
కీర్తి సురేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ నమోదు చేసింది. తెలుగులో ఆమె హీరోయిన్ గా నటించిన సర్కారు వారి పాట, దసరా చిత్రాలు విజయాలు సాధించాయి. ఈ చిత్రాల్లో కీర్తి రెండు విభిన్నమైన పాత్రలు చేసింది. సర్కారు వారి పాటలో అల్ట్రా మోడ్రన్ కన్నింగ్ లేడీ రోల్ చేసిన కీర్తి దసరా చిత్రంలో ఇన్నోసెంట్ విలేజ్ గర్ల్ రోల్ చేశారు. ఆ మధ్య వరుస పరాజయాలతో ఇబ్బందిపడ్డ కీర్తి హిట్ ట్రాక్ ఎక్కింది.
కాగా కీర్తి వయసు 30 ఏళ్ళు దాటింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమలో అడుగుపెట్టిన కీర్తి రెండు దశాబ్దాల ప్రస్థానం పూర్తి చేసుకుంది. పెళ్లీడు రావడంతో పుకార్లు జోరందుకున్నాయి. తరచుగా కీర్తి సురేష్ ఎఫైర్స్ పై వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ తన క్లాస్ మేట్ ని వివాహం చేసుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రిసార్ట్స్ ఓనర్ అయిన అతనితో కీర్తి సురేష్ రేలషన్లో ఉన్నారని, పెద్దలు వీరికి పెళ్ళికి అంగీకారం తెలిపారంటూ కథనాలు వెలువడ్డాయి.
Keerthy Suresh
ఈ పుకార్లను కీర్తి పేరెంట్స్ ఖండించారు. కీర్తి కోరుకున్నప్పుడు పెళ్లి చేస్తామని చెప్పారు. ఎన్ని పుకార్లు వచ్చినా కీర్తి మాత్రం స్పందించలేదు. తాజాగా ఆమె రియాక్ట్ అయ్యారు. ఒక క్లారిటీ ఇచ్చారు. ఇంస్టాగ్రామ్ ఛాట్ లో పాల్గొన్న కీర్తి సురేష్ ని ఓ అభిమాని పెళ్లి ఎప్పుడని అడిగారు. ఆ ప్రశ్నకు కమెడియన్ వడివేలు కూడిన ఓ ఫన్నీ జిఫ్ ని షేర్ చేశారు.
అది చూసిన ఫ్యాన్స్... ఆమెకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చేశారు. ప్రస్తుతం కీర్తి కెరీర్ పీక్స్ లో ఉంది. ముఖ్యంగా తెలుగు, తమిళ చిత్రాల్లో విరివిగా నటిస్తున్నారు. తెలుగులో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ లో కీలక రోల్ చేస్తున్నారు. చిరంజీవి చెల్లెలుగా ఆమె కనిపించనున్నారు. ఈ మూవీలో తమన్నా హీరోయిన్.
అలాగే నాలుగు తమిళ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. కాగా కీర్తి సురేష్ తల్లి మేనక సీనియర్ హీరోయిన్. ఆమె నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. మహానటి మూవీ కీర్తికి బ్రేక్ ఇచ్చింది. సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రంతో కీర్తి నేషనల్ అవార్డు గెలుచుకుంది.