Keerthi Suresh: చైల్ట్ ఆర్టిస్ట్ నుంచి మహానటి గా.. కీర్తి సురేష్ కెరీర్ కు 10 ఏళ్ళు..
కీర్తి సురేష్.. చూస్తు చూస్తుండగానే 10 ఏళ్ల కెరీర్ ను కంప్లీట్ చేసుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి.. హీరోయిన్ గా స్టార్ డమ్ ను చూసింది.
keerthy suresh
వారసత్వంతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ సొంత ఇమేజ్ ను సాధించింది మలయాళ భామ కీర్తి సురేష్. హీరోయిన్ కీర్తి సురేష్ కు ఫస్ట్ మూవీ గీతాంజలి. అంతకుముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన బ్యూటీ.. 2013 నవంబర్ లో హీరోయిన్ గా అవతారం ఎత్తింది.
అయతే అటు మాలయాలతో పాటు.. ఇటు తెలుగులో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో కీర్తి సురేష్ గీతాంజలి తో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే.. తెలుగులో మాత్రం ఆమె నేను శైలజ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చి.. అందరిని ఆకట్టుకుంది బ్యూటీ. ముఖ్యంగా తెలుగు యూత్ ను తన నటనతో కట్టిపడేసింది.
Keerthy Suresh
అప్పటి నుంచి వరుసఅవకాశాలు సాధిస్తూ వస్తోన్న కీర్తి సురేష్ కు.. మహానటి సినిమా తిరుగులేని ఇమేజ్ ను అందించింది. కీర్తి సురేష్ ను తెలుగు ప్రేక్షకులు మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది మహానటి. కీర్తి సురేష్ కెరీర్ లో ది బెస్ట్ మూవీ అంటే అది మహానటి అని కచ్చితంగా చెబుతారు. సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ చేసిన అభినయం ప్రేక్షక హృదయాలను టచ్ చేసింది.
Keerthy Suresh
మహానటి సినిమాతో కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకుంది. మహానటి తరువాత తన కెరీర్ పరుగులు పెడుతుంది అనకుంటే.. ఆతరువాత ఆమె సినిమాలన్నీ ప్లాప్ అవ్వడం మొదలయ్యింది. వరుసగా నిమాలు చేసినా అవన్ని కూడా ఫ్లాప్ అయ్యాయి. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, స్వామి స్క్వేర్, పందెం కోడి 2 ఇలా సినిమాలన్నీ కూడా ఆమెను నిరాశపరిచాయి.
ఇక అప్పటి వరకూ పద్దతిగా కనిపిస్తూ.. స్కిన్ షోకు.. పొట్టి బట్టలకు దూరంగా ఉంటూ వచ్చిన కీర్తి సురేష్.. సక్సెస్ కోసం కమర్షియల్ ఫార్ములాను వంటబట్టించుకుంది. సోషల్ మీడియాలో హాట్ షోలతో మొదలు పెట్టి.. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు పక్కన నటించి మెప్పించింది. అప్పటి నుంచి కాస్త కమర్షియల్ సినిమాలు చేస్తూ వస్తోంది.
ప్రస్తుతం బ్యాలెన్డ్ గా వెళ్తుంది కీర్తి కెరీర్.. తాజాగా దసరా సినిమాతో హిట్ అందుకున్న మలయాళ బ్యూటీ.. అటు బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్ ను అందుకున్నట్టు తెలుస్తోంది. ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రోల్స్ చేయడానికి కూడా ఆమె వెనకాడటం లేదు. రజినీకాంత్ సినిమాలో అలనే నటించిది కీర్తి.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో భోళాశంకర్ సినిమాలో కనిపించి మురిపించింది బ్యూటీ.
Keerthy Suresh
10 ఏళ్లు హీరోయిన్ గా కెరీర్ ను కంప్లీట్ చేసుకున్న కీర్తి.. ముందు ముందు కూడా కెరీర్ లో మంచి అవకాశాలు అందుకోవడానికి రెడీ గా ఉంది. అంతే కాదు..హీరోయిన్ గా అవకాశాలు రాకపోయినా.. విమెన్ సెంట్రిక్ మూవీస్ తో ఆడియన్స్ ను అలరించే సత్తా ఆమెకు ఉంది. అటు బాలీవుడ్ ను మెప్పిస్తే.. నార్త్ లో కూడా ఆమె హవా కోనసాగే అవకాశం ఉంది.