MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హైదరాబాద్ లో జాన్వీ కపూర్... ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉంది అంటూ తెలుగులో సందేశం!

హైదరాబాద్ లో జాన్వీ కపూర్... ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉంది అంటూ తెలుగులో సందేశం!

అతిలోక సుందరి వారసురాలు జాన్వీ కపూర్ హైదరాబాద్ విచ్చేశారు. ఆమె లేటెస్ట్ మూవీ మిల్లీ ప్రమోషన్స్ కోసం భాగ్యనగరానికి వచ్చారు. ఈ విషయాన్ని జాన్వీ ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 03 2022, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Janhvi Kapoor

Janhvi Kapoor

 జాన్వీ లేటెస్ట్ మూవీ మిల్లీ. ఈ చిత్రం మూవీ నవంబర్ 4న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఇది సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం జాన్వీ హైదరాబాద్ వచ్చారు. ఈ విషయాన్ని జాన్వీ స్వయంగా వెల్లడించారు. 
 

27
Janhvi Kapoor

Janhvi Kapoor

హైదరాబాద్ రావడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది, మీ ప్రేమకు ధన్యవాదాలు.. అంటూ తెలుగులో జాన్వీ కపూర్ సందేశం పోస్ట్ చేయడం విశేషంగా మారింది. ఇక మిల్లీ మూవీ విడుదల ప్రోమోలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఓ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న జాన్వీకి మిల్లీ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

37
Janhvi Kapoor

Janhvi Kapoor


కాగా ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ హీరోయిన్ అంటూ గట్టిగా ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక సమాచారం లేదు. జాన్వీ సైతం సౌత్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. సీనియర్ ఎన్టీఆర్ తో శ్రీదేవి సిల్వర్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ జాన్వీ, ఎన్టీఆర్ కాంబో సెట్ అయితే ఆ హైప్ వేరుగా ఉంటుంది.  

47
Janhvi Kapoor

Janhvi Kapoor


మరోవైపు శ్రీదేవి అభిమానులుగా సౌత్ ఆడియన్స్ జాన్వీ తెలుగు, తమిళ భాషల్లో చిత్రాలు చేయాలని ఆశపడుతున్నారు. చాలా కాలంగా దర్శక నిర్మాతలు ఆమెను సౌత్ చిత్రాల్లో నటింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కార్యరూపం దాల్చడం లేదు. 
 

57
Janhvi Kapoor

Janhvi Kapoor


2018లో విడుదలైన ధడక్ మూవీతో జాన్వీ వెండితెరకు పరిచయమయ్యారు. శ్రీదేవి మరణించే నాటికి ధడక్ చిత్రీకరణ దశలో ఉంది. కూతురిని సిల్వర్ స్క్రీన్ పై చూడాలన్న కల నెరవేరకుండానే ఆమె ప్రమాదవశాత్తు మరణించారు.
 

67
Janhvi Kapoor

Janhvi Kapoor

జాన్వీ నటిస్తున్న  మిస్టర్ అండ్ మిసెస్ మహి, బవల్ చిత్రాలు కూడా చివరి దశకు చేరాయి. మరి ఈ చిత్రాలు జాన్వీకి ఎలాంటి ఫలితం ఇస్తాయో చూడాలి. జాన్వీకి మంచి కమర్షియల్ హిట్ పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
 

77
Janhvi Kapoor

Janhvi Kapoor


తెలుగులో విజయ్ దేవరకొండ తన ఫేవరెట్ హీరోగా జాన్వీ పలు సందర్భాల్లో చెప్పారు. ఇక జాన్వీ కపూర్ సోషల్ మీడియా పోస్ట్స్ తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. స్కిన్ షో విషయంలో హద్దులు దాటేసే జాన్వీ ఫోటో షూట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటాయి. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
1000 Crore Heroes: వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిన హీరోలు వీరే
Recommended image2
Dhurandhar 2 vs Pushpa 2: `పుష్ప 2` రికార్డులకు బీటలు.. 27 రోజులుగా బాక్సాఫీసుపై `ధురంధర్‌ 2` దండయాత్ర
Recommended image3
Janhvi Kapoor: బ్యాక్‌లెస్ డ్రెస్‌లో జాన్వీ ఆరాచకం.. చెవిపోగుల ధర తెలిస్తే ఫ్యూజులు ఔట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved