డీసీపీతో వివాదం... డింపుల్ హయాతీ సహజీవనం మేటర్ లీక్, ఎవరీ విక్టర్ డేవిడ్?
డింపుల్ హయాతీ- డీసీపీ రాహుల్ హెగ్డే వివాదం హాట్ టాపిక్ గా ఉంది. డింపుల్ న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ వివాదం డింపుల్ సహజీవనం మేటర్ లీక్ చేసింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Dimple Hayathi
హీరోయిన్ డింపుల్ హయాతీ లీగల్ సమస్యల్లో చిక్కుకున్నారు. ఆమెపై కేసు నమోదైంది. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారును ఆమె కాలితో తన్నారని, డ్రైవర్ ని దుర్భాషలాడారనేది ప్రధాన అభియోగం. దీనికి సంబంధించి ఓ సీసీ టీవీ వీడియో ఫుటేజ్ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో డింపుల్ కోపంగా ఏవో వస్తువులను తంతున్నట్లుగా ఉంది.
Dimple Hayathi
డీసీపీ రాహుల్ హెగ్డే-డింపుల్ హయాతీ ఒకే అపార్టుమెంట్లో ఉంటున్నారు. వీరి మధ్య పార్కింగ్ వివాదం ఎప్పటి నుండో ఉంది. అది తీవ్ర రూపం దాల్చడంతో కేసుల వరకు వెళ్ళింది. డింపుల్ హయాతీ దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నారు. అధికార దుర్వినియోగం చేసి నన్ను ఇరికించారని ఆమె వాపోతున్నారు. నిజాలు ఎప్పటికైనా తెలుస్తాయని అంటున్నారు.
ఈ వివాదం డింపుల్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయం బయటపడేందుకు కారణమైంది. ఆమె విక్టర్ డేవిడ్ అనే వ్యక్తితో చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. డింపుల్ రిలేషన్ గురించి ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఆమె ఎఫైర్ పెట్టుకున్నట్లు ఎలాంటి సమాచారం లేదు. గతంలో పుకార్లు వినిపించిన దాఖలాలు లేవు.
Dimple Hayathi
పార్కింగ్ వివాదంలో డింపుల్ తో పాటు విక్టర్ డేవిడ్ పేరు కూడా చేర్చారు. ఈ క్రమంలో మేటర్ లీకైంది. డింపుల్ హయాతీ వివాహం చేసుకోకుండా విక్టర్ డేవిడ్ తో కలిసి జీవిస్తున్నారని తెలుస్తుంది. మొన్నటి వరకు రహస్యంగా ఉన్న ఈ భాగోతం బయటపడింది.
డింపుల్ ప్రియుడు విక్టర్ డేవిడ్ వివరాలు పరిశీలిస్తే అతని స్వస్థలం విజయవాడ. వృత్తిరీత్యా గ్రాఫిక్ డిజైనర్. ప్రొఫెషనల్ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ కలిసి జీవించాలని డిసైడ్ అయ్యారు. ఈ మధ్య ఇండియాలో ఈ కల్చర్ ఎక్కువైపోయింది. ఇలియానా పెళ్లి కాకుండా తల్లి అయ్యారు. శృతి హాసన్ చాలా కాలంగా శాంతను హజారికతో సహజీవనం చేస్తున్నారు.
ఇక పరిశ్రమకు వచ్చి ఐదేళ్లు అవుతున్నా డింపుల్ హయాతీకి బ్రేక్ రాలేదు. ఆమె లేటెస్ట్ మూవీ రామబాణం సైతం డిజాస్టర్ అయ్యింది. రవితేజకు జంటగా నటించిన ఖిలాడి నిరాశపరిచింది. 2017లో విడుదలైన గల్ఫ్ మూవీతో డింపుల్ హీరోయిన్ అయ్యారు. అనంతరం అభినేత్రి 2 చేశారు. గద్దలకొండ గణేష్ మూవీలో డింపుల్ స్పెషల్ సాంగ్ చేశారు.