- Home
- Entertainment
- మెసేజ్‌కి రిప్లై ఇవ్వనందుకు హీరోయిన్‌కి స్టార్ హీరో షాక్.. దెబ్బకి సినిమా నుంచి ఔట్.. నటి ఆవేదన..
మెసేజ్‌కి రిప్లై ఇవ్వనందుకు హీరోయిన్‌కి స్టార్ హీరో షాక్.. దెబ్బకి సినిమా నుంచి ఔట్.. నటి ఆవేదన..
వేద అర్చనగా గుర్తింపు తెచ్చుకున్న అర్చన.. తాజాా క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయ్యింది. ఓ హీరోపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.

తెలుగు అమ్మాయి వేద అర్చన హీరోయిన్‌గా పలు విమర్శకుల ప్రశంసలందుకునే సినిమాలు చేసింది. కమర్షియల్ విజయాలు అందుకుంది. అవార్డులు సొంతం చేసుకుంది. `తపన` చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె `నేను` సినిమాతో మెప్పించింది. `కొంచెం టచ్‌లో వుంటే చెబుతాను` చిత్రంతో కమర్షియల్‌గా విజయాన్ని సాధించింది. `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`లో త్రిషకి ఫ్రెండ్ గా మెరిసి ఫిల్మ్ ఫేర్ అవార్డుని సొంతం చేసుకుంది.
హీరోయిన్‌గానే కాకుండా సెకండ్ లీడ్‌గా, కీలక పాత్రల్లోనూ నటించి మెప్పించింది అర్చన. `శ్రీరామదాసు`, `పౌర్ణమి`, `సామాన్యుడు`, `యమదొంగ`, `పాండురంగడు`, `ఖలేజా`, `పరమవీర చక్ర`, `బలుపు`, `కమలతో నా ప్రయాణం`, `పంచమి`, `లయన్` వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇటీవల `కృష్ణమ్మ` సినిమాలోనూ చిన్న పాత్రలో మెరిసింది.
పెళ్లి చేసుకున్నాక సినిమాలు తగ్గించింది అర్చన. ఒకటి అర సినిమాల్లోనే కనిపిస్తుంది. ఆమె జగదీష్ భక్తవత్సలంని 2019లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చింది అర్చన. ట్రీ మీడియాతో ఆమె ముచ్చటించింది. ఈ సందర్భంగా తాను ఫేస్ చేసిన బ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ గురించి, క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది.
ఓ హీరో తన మెసేజ్‌కి రిప్లై ఇవ్వనందుకు సినిమా నుంచి తీసేశారని తెలిపింది. మలయాళంలోనూ ఓ సినిమా విషయంలో ఇలానే జరిగిందని, తెలుగులోనూ అలాంటి అనుభవాలున్నట్టు తెలిపింది. వాళ్ల పేరు చెప్పడానికి నిరాకరించిన అర్చన.. ఓ అవార్డు ఈవెంట్‌లో ఓ హీరో తనకు అవార్డు ఇచ్చేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదని, ఆమెకి అవార్డుని తాను ఇవ్వను అని స్టేజ్ నుంచే దిగిపోయినట్టు తెలిపింది వేద అర్చన. ఈ ఘటనలు చాలా బాధ పెడతాయని, కానీ ఈ రంగంలో ఇలాంటివి కామనే అని చెప్పింది.
తనకు నటనపై ఆసక్తి ఉందని, బాగా నటిస్తానని కొంత మంది అనుకుంటారు. అలాంటి మంచి పాత్రలు, మంచి సినిమాలు ఇస్తారు. కానీ కొందరు ఈ అమ్మాయికి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉంది కదా, ఒకసారి టచ్ చేసి చూద్దాం, మెసేజ్ పెట్టి చూద్దాం, కుదిరితే ఆఫర్ ఇద్దాం అని ఆలోచిస్తుంటారు. ఇలాంటి వాళ్లు కూడా ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా అసహ్యంగా ఉంటుందని, బాధగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది అర్చన.
ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ కామన్ అని, అయితే ప్రారంభంలో ఇలాంటి అనుభవాలను ఫేస్ చేసినట్టు తెలిపింది. ఈ క్రమంలో తాను కొన్ని ఆఫర్లు మిస్ చేసుకున్నట్టు చెప్పింది. ఈ విషయాలను తన మదర్‌కి కూడా తెలుసు అని, ఇలాంటి మెసేజ్‌లు వచ్చినప్పుడు ఆమెతోనూ చర్చించేదాన్ని అని, దీంతో ఇక ఇది కూడా పోయినట్టేనా అనేదని చెప్పింది. ఓ ఐదారేళ్ల తర్వాత ఓ అవగాహన, మెచ్చూరిటీ వచ్చింది. ఆ తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలని అనేది ఓ క్లారిటీ వచ్చిందని చెప్పింది. ఆ తర్వాత పలు మంచి ప్రాజెక్ట్ లు చేశానని, కొన్ని కళాఖండాలు కూడా చేసినట్టు తెలిపింది అర్చన. ఏదైనా అంతా ఒక అనుభవం అని, అన్ని విషయాలను తాను ఓపెన్‌గా చెప్పలేనని, తనకంటూ ఓ ఇమేజ్ ఉందని, దాన్ని డిస్టర్బ్ చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పింది వేద అర్చన. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.