స్టార్ హీరోలు అవన్నీ చూసే ఆఫర్ ఇస్తున్నారు... ఐశ్వర్య రాజేష్ సంచలన కామెంట్స్
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ స్టార్ హీరోలను ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. స్టార్స్ నాకు ఆఫర్స్ ఇవ్వకపోవడానికి కారణాలు ఇవే అంటూ ఓపెన్ అయ్యారు.

కోలీవుడ్ లో సక్సెస్ అయిన తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్. మంచి నటిగా పేరున్న ఐశ్వర్య రాజేష్ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. అయితే స్టార్ హీరోల పక్కన ఛాన్సులు రాకపోవడంపై ఆమె అక్కసు వెళ్ళగక్కారు. తాజా ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ... కాక ముట్టై తర్వాత నాకు ఎవరూ ఆఫర్స్ ఇవ్వలేదు. ఎందుకని నేను షాక్ అయ్యాను. నా కెరీర్లో ధనుష్, దుల్కర్ సల్మాన్, విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్ తప్ప మిగతా హీరోలు అవకాశాలు ఇవ్వలేదు. స్టార్ హీరోలు ఒక హీరోయిన్ ని తీసుకునే క్రమంలో అనేక లెక్కలు వేస్తారు.
హీరోయిన్ మార్కెట్, ఓటీటీ, డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. మనం కోరుకున్న స్థాయికి ఎదగాలంటే దేనికైనా సిద్ధంగా ఉండాలి. అందుకే నేను లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నాను. ఇప్పటి వరకు 15కి పైగా చేశాను. అయినా స్టార్స్ నాకు ఆఫర్స్ ఇవ్వడం లేదు. అందుకు కారణం కూడా నాకు తెలియదు. అయినా నేనేమీ బాధపడటం లేదు. నా సినిమాకు నేనే హీరో. నాకంటూ అభిమానులు ఉన్నారు, అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఐశ్యర్య రాజేష్ మాటలు చర్చకు దారి తీశాయి.
కాగా ఐశ్వర్య సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చింది. అయితే ఆమె జీవితంలో అనేక విషాదాలు ఉన్నాయి. పలు సందర్భాల్లో ఐశ్వర్య తనకు ఎదురైన ఇబ్బందులు గుర్తు చేసుకున్నారు. ఆమె తండ్రి రాజేష్ 80లలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. హీరో, సెకండ్ హీరో, విలన్ రోల్స్ చేశారు.
Aishwarya Rajesh
అలాగే లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి స్వయానా మేనత్త. దీంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఐశ్వర్య కెరీర్ మొదలైంది. అయితే 8 ఏళ్ల ప్రాయంలోనే ఐశ్వర్య తండ్రి రాజేష్ మరణించారు. తండ్రి మరణంతో కుటుంబం కృంగిపోయింది. పెద్దయ్యాక అండగా ఉంటారనుకున్న అన్నయ్యలు రోడ్డు ప్రమాదంలో మరణించారు.
కుటుంబంలో వరుస మరణాలు ఉక్కిరిబిరికి చేశాయని ఐశ్వర్య రాజేష్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. పరిశ్రమకు వచ్చాక, రాకముందు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆమె చెప్పారు. స్టార్ హీరోయిన్ కాకపోయినా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశతో ఇండస్ట్రీకి వచ్చినట్లు ఐశ్వర్య తెలియజేశారు.
Aishwarya Rajesh
ఐశ్వర్య కోలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేశారు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేశారు . కాక ముట్టై, కణ లాంటి చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఐశ్వర్య ఫస్ట్ మూవీ రాంబంటు. హీరోయిన్ అయ్యాక కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులో అడుగుపెట్టారు.వరల్డ్ ఫేమస్ లవర్ లో హీరోయిన్ గా చేశారు.