Sanjana Galrani: ట్రోలర్స్ నోరు మూయించిన సంజనా గల్రాని.. ప్రెంగ్నెంట్ అని ప్రకటన
కన్నడ బ్యూటీ సంజనా గల్రాని(Sanjana Galrani) ప్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లిని కాబోతున్నట్టు ప్రకటించింది. తన విడాకులపై వస్తున్న వార్తకుల చెక్ పెట్టింది సంజనా గల్రాని.

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన హీరోయిన్ సంజనా గల్రాని(Sanjana Galrani) . వివాదాలు చుట్టు తిరిగే ఈ స్టార్.. రీసెంట్ గా ట్రగ్స్ కేసులో నానా అవస్తలు పడి..అరెస్ట్ అయ్యి బెయిల్ పై తిరిగి వచ్చింది. వచ్చి రావడంతోనే తన చిరకాల మిత్రుడు డాక్టర్ పాషాను పెళ్ళి చేసుకుంది సంజన. రీసెంట్ గా కూడా కొన్నివివాదాలు ఆమెను ఇబ్బంది పెట్టాయి.
ఇక సోషల్ మిడియాలో సంజనను తిట్టిపోయని వారు లేరు. చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ఆమె డివోర్స్ తీసుకుంటున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంలో కూడా ఆమె ఘాటుగానే స్పందించింది. తాము బాగానే ఉన్నామని.. అన్యోన్యంగా ఉన్నామని..తనపై పిచ్చి పిచ్చి వార్తలు ప్రచారం చెయ్యొద్దు అంటూ ట్రోలర్స్ పై మండిపడింది బ్యూటీ.
ఇక ఇప్పుడు మరో షాకింగ్ అనౌన్స్ మెంట్ చేసింద సంజన(Sanjana Galrani). మాతృత్వం అనేది ఓ మధుర అనుభవం తాను ప్రస్తతం ప్రెగ్నెంట్ అని.. ఆ అనుభూతిని ఇప్పుడు తాను పొందుతున్నట్టు చెప్పింది సంజన. తాను 5 నెలల గర్భంతో ఉన్నానని ప్రకటించింది. ఈ ప్రకటన ద్వారా భర్తతో విడిపోవడం లేదని గట్టిగా చెప్పే ప్రయత్నం చేసింద సంజన. అంతే కాదు అందరి ప్రెగ్నెంట్ అంటే రెస్ట్ తీసుకోవడానికి చూస్తారు. కాని తాను అలా కాదని అంటోంది.
చాలా మంది మహిళలు ఆదర్శంగా ఉంటారు.డెలివరీకి రెండు వారాల మందు వరకూ పనిచేసేవారు చాలా మంది ఉన్నారు. తానుకూడా అలానే అంటోంది సంజన(Sanjana Galrani). రెస్ట్ తీసుకోవాలి అని అనుకోవడం లేదట. సాధ్యమైనంత వరకూ పనిచేసుకుంటానంటోంది. వివాదాల నడుమ సీక్రెట్ గా పెళ్ళి చేసుకుంది సంజన. కన్నడ నాట సెన్సేషనల్ స్టార్ అయ్యింది.
కన్నడతో పాటు తెలుగు సినిమాల్లో కూడా చేసింది సంజన(Sanjana Galrani). ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు సినిమాతో టాలీవుడ్ లో ఆమె అందరికి గుర్తుండిపోయింది. ఈసినిమా తరువాత పెద్దగా చెప్పుకోదగ్గ ఆఫర్లు ఏమీ రాలేదు సంజనకు.డ్రగ్స్ కేసులో ఇరుక్కుని ఇబ్బందులు పడ్డ సంజన..మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకవెవ్వరూ సినిమాకు వెళ్తూ.. బెంగళూరులో మాస్క్ పెట్టుకోకుండా ట్రోల్స్ కు గురైయింది. అంతకు ముందు క్యాబ్ డ్రైవర్ తనను ఇబ్బంది పెట్టాడంటూ.. కేసు పెట్టి తానే చిక్కుల్లో పడింది సంజన.