తేజా అని ఆఫీస్ కి వెళితే, ఆయన చేసిన మోసం తరువాత అర్థమైంది...రాశి సంచలన వ్యాఖ్యలు
First Published Dec 1, 2020, 5:45 PM IST
90లలో హీరోయిన్ గా టాలీవుడ్ ని ఒక ఊపుఊపింది హీరోయిన్ రాశి. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ మరియు హిందీలో కూడా ఆమె హీరోయిన్ గా నటించడం విశేషం. ఐతే దర్శకుడు తేజ తనను మోసం చేసిన విషయాన్ని తాజాగా బయటపెట్టారు రాశి.

చిత్రం, నువ్వు నేను, జయం వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తో స్టార్ హీరో హోదా అందుకున్న దర్శకుడు తేజాకు మహేష్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో నిజం మూవీ మహేష్ చేయడం జరిగింది. మహేష్ ఇమేజ్ కి ఆ స్టోరీ సెట్ కాకపోవడం వలన, అనుకున్నంత విజయం సాధించలేదు.

నిజం మూవీలోఅప్పటి దాకా హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ కలిగిన రాశి, విలన్ కీప్ గా బోల్డ్ రోల్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ పాత్ర రాశి చేయడం అప్పుడు నిజంగా సంచలనమే. కాకపోతే అప్పటికే ఫేడ్ అవుటైన రాశి, ఇష్టపడే ఆ పాత్ర చేసి ఉండవచ్చని అందరూ భావించారు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?