- Home
- Entertainment
- Pranitha Subhash: బాత్ టబ్ లో బేబీ బంప్ చూపుతూ ప్రణీత... ఒంటిపై నురగలు ముఖంలో నవ్వులు..!
Pranitha Subhash: బాత్ టబ్ లో బేబీ బంప్ చూపుతూ ప్రణీత... ఒంటిపై నురగలు ముఖంలో నవ్వులు..!
బేబీ బంప్ తో ఫోటో షూట్స్ చేయడం సెలెబ్రిటీలకు సాధారణమైపోయింది. ఈ మధ్య కాలంలో తల్లులుగా మారిన అనేక మంది తారలు బేబీ బంప్ లో అందమైన ఫోటో షూట్స్ లో పాల్గొన్నారు. నటి ప్రణీత సుభాష్ సైతం ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు.

Pranitha Subhash
నిండు గర్భిణి అయిన ప్రణీత తరచుగా తన బేబీ బంప్ కనిపించేలా ఫోటోలకు పోజులిస్తున్నారు. సదరు ఫోటోలు ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. తాజాగా ప్రణీత బాత్ టబ్ లో స్నానం చేస్తున్న ఫోటోలు చేశారు. ఇక ప్రణీతను అలా చూసి క్రేజీగా ఫీల్ ఫ్యాన్స్ అవుతున్నారు. క్యూట్, బ్యూటిఫుల్ బేబీ రానుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Pranitha Subhash
గతేడాది మే30న వ్యాపార వేత్త నితిన్ ను ప్రేమించి పెండ్లి చేసుకుంది హీరోయిన్ ప్రణీత సుభాష్ (Pranitha Subash). కరోనా కారణంగా తన వివాహానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వకుండా ఈ జంట ఒక్కటైంది. ఆ తర్వాత అభిమానులకు వివరణ ఇస్తూ.. కరోనా నేపథ్యంలో డేట్ విషయంలో కన్ష్యూషన్ ఉండటంతో రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని తెలియజేశారు.
Pranitha Subhash
కాగా, నితిన్, సుభాష్ బెంగళూరులో వివాహాం చేసుకుని ఇఫ్పటికీ ఏడాది కూడా పూర్తి కాలేదు. ఈ లోపే ప్రణీత తన అభిమానులు శుభవార్త చెప్పింది. త్వరలో తను తల్లి కాబోతున్నట్టు తెలియజేసింది. ఈ మేరకు తన భర్తతో కూడిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
Pranitha Subhash
ఇక తెలుగులో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)వంటి టాప్ స్టార్స్ పక్కన ప్రణీత నటించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కిన అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీలో ప్రణీత సెకండ్ హీరోయిన్ రోల్ చేశారు.
pranitha
అలాగే ఎన్టీఆర్(NTR) కి జంటగా రామయ్యా వస్తావయ్యా చిత్రం చేశారు. అయితే ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకోలేకపోయిన ప్రణీత అడపాదడపా చిత్రాలు చేశారు.
Pranitha Subhas
Pranitha Subhతెలుగులో ప్రణీత చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ప్రస్తుతం ఆమె హిందీలో చిత్రాలు చేస్తున్నారు. ప్రణీత హీరోయిన్ గా నటించిన హంగామా 2, బుజ్ చిత్రాలు విడుదలయ్యాయి. ఆమె నటిస్తున్న కన్నడ చిత్రం రావణ అవతారం అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు.
as
Pranitha subhash
కాగా కరోనా సమయంలో ప్రణీత చేసిన సేవలు ప్రాచుర్యం పొందాయి. ఆమె అనేక మంది పేద ప్రజలకు ఆహారం అందించారు. లాక్ డౌన్ సమయంలో కార్మికులను ఆమె ఆదుకున్నారు. ప్రతిరోజు ఆమె పేదలకు అన్నం పెట్టారు.
ఇక పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కారణం చేతనే ఆమె కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయడం లేదట. ప్రస్తుతం గర్భవతి కూడా అయిన ప్రణీత వెండితెరకు పాక్షికంగానో లేక పర్మినెంట్ గానో దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.