- Home
- Entertainment
- Bindu Madhavi Lovie Story: డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన బిందు మాధవి.. ఎలా బయట పడిందంటే..?
Bindu Madhavi Lovie Story: డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన బిందు మాధవి.. ఎలా బయట పడిందంటే..?
ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాల్లో లవ్ స్టోరీస్ తో పాటు.. సినిమా వెలుపల లవ్ స్టోరీస్ కూడా చాలా ఉంటాయి. కాని అందులో అన్ని ప్రేమలు పెళ్లి వరకూ రావు. కొన్ని వచ్చినా... పెళ్ళి తరువాత పెటాలకులు అయినవి కూడా ఉన్నాయి. ఇక రీసెంట్ గా హీరోయిన్ బిందు మాధవి తన లవ్ జర్నీ గురించి పంచుకున్నారు.

ఆవకాయ బిర్యానీ, బంపర్ ఆఫర్, రామరామ కృష్ణకృష్ణ, మనమంత లాంటి సినిమాలలో నటించి మెప్పించిన తెలుగు హీరోయిన్ బిందు మాధవి. అవ్వడానికి ఆమె తెలుగు హీరోయిన్ అయినా.. చేసింది మాత్రం ఎక్కువగా తమిళ సినిమాలే.
తెలుగులో కూడా కొన్ని సినిమాలతో మాత్రమే మెప్పించింది బిందు మాధవి. అయితే ఇక్కడ కొన్ని సినమాల తర్వాత మంచి ఆఫర్లు లేకపోవడంతో చెన్నైకి చెక్కేసింది బ్యూటీ. తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తోంది.
తమిళంలో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది బిందు మాధవి. అయితే అక్కడ కూడా ఆఫర్లు తగ్గడంతో తమిళంలో బిగ్ బాస్ షోలో పార్టిస్పేట్ చేసింది బ్యూటీ. ఇక ఇప్పుడు తాజాగా తెలుగు ఓటీటీ స్పెషల్ బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో కూడా జాయిన్ అయ్యింది.
ఈసందర్భంగా తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గురించి వివరించింది బిందు మాధవి. తన ప్రేమ, ఎలా బ్రేకప్ అయ్యింది. ఎవరితో ప్రేమలో పడింది. కథ మొత్తం విప్పి చెప్పింది బిందు. తన జీవితంలో జరిగిన అతి పెద్ద విషాదాన్ని వివరించింది.
తమ వ్యక్తిగత వివరాలను హౌస్ మేట్స్ తో పంచుకోవాలంటూ బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడంతో ఆమె తన జీవితంలో జరిగిన ప్రేమ వ్యవహారం గురంచి వివరంగా చెప్పుకొచ్చింది. కాలేజీ రోజుల్లో ఓ అబ్బాయిని ప్రేమించానని, కానీ, ఆ తర్వాత విడిపోయామని తెలిపింది. ‘‘కెరీర్ కోసమే మేం దూరమయ్యామంది.
పై చదువుల కోసం అతడు అమెరికా వెళ్లిపోయాడని. తాను మాత్రం సినిమాల మీద ఇష్టంతో ఇక్కడే ఉండిపోవలసి వచ్చిందంటోంది. ఇక ఇప్పుడు అతడికి పెళ్లి కూడా అయిపోయిందని. కాని ఎంత బ్రేకప్ అయినా సరే అతడితో ప్రేమ ఎప్పటికీ తకుకు స్పెషలే అంటుంది బిందుమాధవి.
బ్రేకప్ టైమ్ లో తాను డీప్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయానన్నది బిందు. సరిగ్గా అదే టైమ్ లో తాను తమిళ బిగ్ బాస్ లో కంటెస్ట్ చేశానని, ఆ తర్వాత కొన్ని రోజులకే డిప్రెషన్ నుంచి బయటపడ్డట్టు వెల్లడించింది.
ప్రస్తుతం తెలుగులో కూడా మంచి అవకాశాలకోసం ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పిన బిందు మాధవి. బిగ్ బాస్ తెలుగు నుంచి వచ్చిన అవకాశాలతో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకే ఉపయోగించుకోబోతున్నట్టు తెలిపింది.