- Home
- Entertainment
- యంగ్ హీరో త్రిగున్ గ్రాండ్ వెడ్డింగ్.. సైలెంట్‌గా ఓ ఇంటివాడైన `కొండా` హీరో.. photos
యంగ్ హీరో త్రిగున్ గ్రాండ్ వెడ్డింగ్.. సైలెంట్‌గా ఓ ఇంటివాడైన `కొండా` హీరో.. photos
టాలీవుడ్ యంగ్ హీరో త్రిగున్ ఓ ఇంటివాడయ్యాడు. ఆయన వివాహం చేసుకున్నారు. నివేదిత అనే అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నారు. తమిళనాడులోని తిరుపూర్‌లో గల శ్రీ సెంటర్ మహల్ అవినాశిలో ఆదివారం ఆయన వివాహం జరిగింది.

టాలీవుడ్ యంగ్ హీరో త్రిగున్ ఓ ఇంటివాడయ్యాడు. ఆయన వివాహం చేసుకున్నారు. నివేదిత అనే అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నారు. తమిళనాడులోని తిరుపూర్‌లో గల శ్రీ సెంటర్ మహల్ అవినాశిలో ఆదివారం ఆయన వివాహం జరిగింది.
తాజాగా ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. లవ్ ఫరెవర్ అంటూ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం త్రిగున్, నివేదిత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలోవైరల్ అవుతున్నాయి. ఇందులో ఈ ఇద్దరు ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. పర్‌ఫెక్ట్ జోడీగా ఉన్నారు.
ఈ సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు ఆయనకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక తమిళనాడులో జరిగిన వీరి పెళ్లికి రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు పాల్గొన్నారు. అయితే వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లిగా తెలుస్తుంది.
`కథ` అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు త్రిగున్.. చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ `గరుడవేగ` మంచి పేరుతెచ్చింది. దీంతోపాటు ఇటీవల `డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ`, `డియర్ మేఘ` లాంటిచిత్రాలతో మెప్పించారు. చివరగా ఆయన కొండ సురేఖ, మురళీ జీవిత కథతో రూపొందిన `కొండా` చిత్రంలో హీరోగా నటించారు. ఆర్జీవీ దీనికి దర్శకత్వం వహించారు.
త్రిగున్ అసలు పేరు అరుణ్ ఆదిత్.. ఆయన హీరోగా తెలుగు, తమిళంలో సినిమాలు చేశారు. కానీ పెద్దగా గుర్తింపురాలేదు. దీంతో `త్రిగున్`గా పేరు మార్చుకున్నారు. పేరు మార్చుకోవడం వల్ల అయినా తనకు లక్ కలిసొస్తుందేమో అని భావించారు.
ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో `కిరాయి` అనే మూవీ ఒకటి. దీంతోపాటు మరో రెండు సినిమాలు చేస్తున్నారు. ఇంతలోనే సడెన్‌గా మ్యారేజ్ చేసుకోవడం ఆశ్చర్యపరుస్తుంది.