MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మొదలైన శర్వానంద్ పెళ్లి వేడుకలు... హల్దీ ఫంక్షన్ లో కొత్త జంట అల్లరి!

మొదలైన శర్వానంద్ పెళ్లి వేడుకలు... హల్దీ ఫంక్షన్ లో కొత్త జంట అల్లరి!

హీరో శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. రాజస్థాన్ లోని లీలా ప్యాలస్ వేదికైంది. నేడు హల్దీ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jun 02 2023, 07:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sharwanad marriage

Sharwanad marriage

హీరో శర్వానంద్ ఓ ఇంటివాడు అవుతున్నాడు.  జూన్ 2,3 తేదీల్లో శర్వానంద్ వివాహం ఘనంగా జరగనుంది. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అయిన రక్షిత రెడ్డిని శర్వానంద్ పెళ్ళి చేసుకుంటున్నారు. రక్షిత ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, దివంగత టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి మనవరాలు కూడాను. రక్షిత ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటూ ఉద్యోగం చేస్తోందని సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Sharwanad marriage

Sharwanad marriage

జనవరిలో నిశ్చితార్థం జరగ్గా శర్వానంద్-రక్షిత రెడ్డి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. ఇందుకు రాజస్థాన్ లోని లీలా ప్యాలస్ ఎంచుకున్నారు. అక్కడ రెండు రోజులు శర్వానంద్-రక్షిత రెడ్డిల వివాహం జరగనుంది. మెహందీ, సంగీత్, హల్దీ ఫంక్షన్స్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. నేడు హల్దీ వేడుక నిర్వహించారు. కొత్త జంట హల్దీ ఫంక్షన్ లో ఆడిపాడారు. బంధు మిత్రుల నడుమ శర్వానంద్ వివాహ వేడుకలను ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. శర్వానంద్-రక్షిత రెడ్డిల హల్దీ ఫంక్షన్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

35
Sharwanad marriage

Sharwanad marriage

అయితే శర్వానంద్ పెళ్లి బడ్జెట్ ఇదే అంటూ ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఓ వాదన మేరకు లీలా ప్యాలస్ లో వివాహం అంటే రోజుకు రూ. 4 కోట్లు అవుతాయట. ఆ విధంగా రెండు రోజులు అక్కడ వివాహ వేడుక జరగనుంది. ఇక పెళ్లి బట్టలు, నగలు, విందులు, వినోదాలు, మిగతా ఏర్పాట్లకు మరికొంత ఖర్చు కానుంది.

45

జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే వేడుకను శర్వానంద్ ఘనంగా చేసుకుంటున్నారని సమాచారం. ఇక శర్వానంద్ వివాహానికి టాలీవుడ్ నుండి ఎవరెవరికి ఆహ్వానం ఉంది. ఎవరెవరు వస్తారు? అనేది చూడాలి. మెగాస్టార్ ఫ్యామిలీకి శర్వానంద్ అత్యంత సన్నిహితుడు. చిరంజీవి, రామ్ చరణ్ కచ్చితంగా హాజరయ్యే సూచనలు కలవు.

55

ఇక శర్వానంద్ కెరీర్ పరిశీలిస్తే... ఆయన మొదట్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు. గమ్యం, ప్రస్థానం చిత్రాలు గుర్తింపు తెచ్చాయి. రన్ రాజా రన్, శతమానం భవతి, మహానుభావుడు వంటి కమర్షియల్ హిట్స్ తో టైర్ టూ హీరోల జాబితాలో చోటు సంపాదించారు. ఈ మధ్య ఆయన సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నారు.
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: కేరళలో అల్లు అర్జున్ మూవీ ప్రభంజనం.. 20 ఏళ్ల పాత సినిమాకు థియేటర్లలో జాతర
Recommended image2
Chiranjeevi: ఆమెని టెర్రస్ మీదికి తీసుకెళ్లిన చిరు, దెబ్బకు మైండ్ బ్లాక్.. మణిరత్నం మూవీలో మెగాస్టార్ క్రేజ్
Recommended image3
Bigg Boss Telugu 10: కామన్‌ మ్యాన్‌కి నాగార్జున బంపర్‌ ఆఫర్‌.. బిగ్‌ బాస్‌ టైటిల్‌ గెలిచే ఛాన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved