MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • ఆ హీరోతో లయ పెళ్లి ఆల్మోస్ట్ ఫిక్స్, అతడికి ఆ పిచ్చి, అనూహ్యంగా బ్రేకప్... హోమ్లీ హీరోయిన్ లవ్ స్టోరీ తెలుసా!

ఆ హీరోతో లయ పెళ్లి ఆల్మోస్ట్ ఫిక్స్, అతడికి ఆ పిచ్చి, అనూహ్యంగా బ్రేకప్... హోమ్లీ హీరోయిన్ లవ్ స్టోరీ తెలుసా!

తెలుగు అమ్మాయి లయ హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది. స్టార్ హీరోల సరసన కూడా జతకట్టింది. కాగా తనతో  నటించిన ఓ హీరో తో ఆమె ప్రేమలో పడ్డారు. ఆల్మోస్ట్ పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఆ హీరోకి ఉన్న ఓ పిచ్చి బ్రేకప్ కి కారణం అయ్యిందట. హోమ్లీ హీరోయిన్ లవ్ స్టోరీ ఏమిటో చూద్దాం..   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jun 19 2024, 07:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Heroine Laya

Heroine Laya

విజయవాడలో పుట్టిన లయ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ చిత్రం చేసింది. స్వయంవరం మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంతో వేణు తొట్టెంపూడి కూడా హీరోగా పరిచయం అయ్యాడు. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సూపర్ హిట్. దాంతో లయకు ఆఫర్స్ వెలువెత్తాయి. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Heroine Laya

Heroine Laya

టాలీవుడ్ లో సక్సెస్ అయిన తెలుగు అమ్మాయిలో లయ ఒకరని చెప్పొచ్చు. మనోహరం, ప్రేమించు, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ, నువ్వు లేక నేను లేను వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. విజయేంద్ర వర్మ చిత్రంలో బాలయ్య వంటి స్టార్ పక్కన ఆమె జతకట్టారు. 

36
Heroine Laya

Heroine Laya

లయ ఎక్కువగా టైర్ టు హీరోల చిత్రాల్లో నటించారు. కాగా లయ కెరీర్లో ప్రేమించు చాలా ప్రత్యేకం. ఈ మూవీలో ఆమె అంధురాలు పాత్ర చేసింది. సీనియర్ నటి లక్ష్మీ తో పోటీపడి మరి నటించింది లయ. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ప్రేమించు సూపర్ హిట్. ఈ చిత్రంలో సాయి కిరణ్ హీరోగా నటించారు.

46
Heroine Laya

Heroine Laya

సాయి కిరణ్-లయ ప్రేమలో ఉన్నారని అప్పట్లో పుకార్లు వినిపించాయి. ప్రేమించు మూవీ సమయంలోనే ఈ కథనాలు వెలువడగా... ఎవరు స్పందించలేదు. అయితే లయను సాయి కిరణ్ వివాహం చేసుకోవాల్సింది అట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించాడు. ఆ పెళ్లి ఎందుకు ఆగిపోయిందో కూడా చెప్పాడు.

56
Heroine Laya

Heroine Laya

ప్రేమించు మూవీలో లయతో నా కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ప్రేక్షకులు ఆ చిత్రాన్ని బాగా ఆదరించారు. మా జంట చూడముచ్చటగా ఉండేది. దాంతో కుటుంబ సభ్యులు మాకు పెళ్లి చేయాలి అనుకున్నారు. అంతా ఓకే అనుకున్నాక... మా ఇద్దరి జాతకాలు కలవలేదు. నాకు జాతకాల పిచ్చి ఉంది. కుటుంబ సభ్యులు కూడా గట్టిగా విశ్వసిస్తారు. ఈ కారణంగా లయతో నా వివాహం క్యాన్సిల్ అయ్యింది...అని సాయి కిరణ్ చెప్పుకొచ్చాడు. 
 

66
Heroine Laya

Heroine Laya

సాయి కిరణ్ హీరో, సపోర్టింగ్ రోల్స్ చేశాడు. పాతిక పైగా చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం సీరియల్ నటుడిగా కొనసాగుతున్నాడు. 2006లో లయ యూఎస్ లో సెటిల్ అయిన డాక్టర్ గణేష్ గోర్తి ని వివాహం చేసుకుంది. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి సంతానం. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన లయ.. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న తమ్ముడు చిత్రంలో కీలక రోల్ చేస్తుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved