- Home
- Entertainment
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి అస్వస్థత... ఫ్యాన్స్ ఆందోళన త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు!
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి అస్వస్థత... ఫ్యాన్స్ ఆందోళన త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు!
పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ ఆరోగ్యం బాగా లేదని తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.

Pawan kalyan
2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అడుగులు వేస్తున్నారు. ఏపీ ప్రజల విశ్వాసం పొందడం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తరచూ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారు. ఇక జనసేన పార్టీకి రూ. 5 కోట్లు విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఏపీలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నారు.
రాజకీయంగా బిజీ బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం అందుతుంది. ఆయన జ్వరంతో బాధపడుతున్నారట. పలు బహిరంగ సభలు, రోడ్ షోస్ లో పాల్గొన్న పవన్ వర్షంలో తడిసిన కారణంగా జ్వరం బారిన పడ్డారని సమాచారం. అలాగే ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్నారట.
pawan kalyan
ఓ అభిమాని ఆయన మీద పడడంతో ఆయన వెన్నునొప్పికి గురయ్యారట. డాక్టర్స్ సలహా మేరకు పవన్ కళ్యాణ్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారట. ఇక పవన్ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.
pawan kalyan
మరోవైపు పవన్ ప్రకటించిన చిత్రాలతో పాటు సెట్స్ పై ఉన్న ప్రాజెక్ట్స్ సందిగ్ధంలో పడ్డాయి. పూర్తిగా రాజకీయాలపై దృష్టిపెట్టిన పవన్ షూటింగ్స్ మొత్తం పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. ఎన్నికలకు కేవలం 20 నెలల సమయం మాత్రమే ఉండగా సంస్థాగతంగా జనసేన పార్టీని బలోపేతం చేయాలని ఆయన చూస్తున్నారు.
Hari Hara Veera Mallu
చివరకు సగం చిత్రీకరణ జరుపుకున్న హరి హర వీరమల్లు కూడా ఆగిపోయినట్లేనని వార్తలు వస్తున్నాయి. ఇక భవదీయుడు భగత్ సింగ్ సంగతి సరే సరే. ఎన్నికల లోపు పవన్ వినోదయ సిత్తం రీమేక్ పూర్తి చేసే అవకాశం కలదంటున్నారు. ఈ మూవీలో పవన్ పార్ట్ చాలా తక్కువగా కాగా 20 నుండి 30 రోజులు పవన్ కేటాయిస్తే సరిపోతుందట.
తక్కువ డేట్స్ ప్రకటించినప్పటికీ రెమ్యూనరేషన్ మాత్రం పవన్ రెగ్యులర్ చిత్రాలకు తీసుకున్నట్లే వసూలు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం పవన్ ఒక్కో చిత్రానికి రూ. 50 కోట్లు తీసుకుంటున్న నేపథ్యంలో రోజుకు ఆయన రెండు కోట్లకు పైనే ఛార్జ్ చేసినట్లు అవుతుంది.