MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బర్త్ డే ట్రీట్... ఆ బ్లాక్ బస్టర్ మూవీ రీరిలీజ్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బర్త్ డే ట్రీట్... ఆ బ్లాక్ బస్టర్ మూవీ రీరిలీజ్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బర్త్ డే బహుమతి సిద్ధమైంది. ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన చిత్రాన్ని రీరిలీజ్ కానుంది. అధికారికంగా ప్రకటించారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 11 2024, 05:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Pawan Kalyan

Pawan Kalyan

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ పుట్టినరోజు చాలా ప్రత్యేకం. కూటమి ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎంగా నియమింపబడ్డారు. కూటమిలో భాగంగా జనసేన పార్టీ పోటీ చేసిన 21 ఎమ్మెల్యే , 2 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది. వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. కాగా సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ 56వ ఏట అడుగుపెడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Pawan Kalyan

Pawan Kalyan

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు వేడుకలకు సిద్ధం అవుతున్నారు. ఈ మధ్య స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి పాత సినిమాలు రీరిలీజ్ చేయడం ఆనవాయితీగా మారింది. ఈ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ చిత్రాల్లో ఏది రీరిలీజ్ చేస్తారనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చే మూవీని థియేటర్స్ లోకి తెస్తున్నారు.

35
Pawan Kalyan

Pawan Kalyan


గబ్బర్ సింగ్ చిత్రాన్ని సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఓ స్పెషల్ పోస్టర్ సైతం విడుదల చేశారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. అప్పటి వరకు పరాజయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ని హిట్ ట్రాక్ ఎక్కించింది. 

45


హిందీ సూపర్ హిట్ మూవీ దబంగ్ రీమేక్ గా గబ్బర్ సింగ్ రూపొందించారు. అయితే దర్శకుడు హరీష్ శంకర్ తెలుగు నేటివిటీ, పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని దబంగ్ చిత్రానికి భారీగా మార్పులు చేశాడు. హరీష్ శంకర్ తెరకెక్కించిన సన్నివేశాలు, రాసిన వన్ లైనర్స్ అద్భుతంగా ఉంటాయి. అందుకే చాలా కాలంగా ఈ కాంబినేషన్ ని అభిమానులు కోరుకుంటున్నారు. ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు ఉన్నాయి. 

 

55

పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి బ్రేక్ పడింది. త్వరలో పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉన్న చిత్రాల షూటింగ్స్ పూర్తి చేస్తారని సమాచారం. మొదటగా ఆయన ఓజీ సెట్స్ లో జాయిన్ అవుతారట. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న హరి హర వీరమల్లు సైతం ఆయన పూర్తి చేయాల్సి ఉంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇచ్చిన రాంచరణ్, ఉపాసన.. అన్నా లెజినోవా రియాక్షన్ చూశారా, వైరల్
Recommended image2
Sreemukhi: అడుక్కున్నారు, అయినా ఆ షోని రిజెక్ట్ చేశా.. హీరోయిన్ గా కూడా ఛాన్స్ పోయింది
Recommended image3
Shilpa Shetty Assets: శిల్పాశెట్టి అసలు పేరేంటో తెలుసా? 100 కోట్ల ఇంటితో పాటు ఆమె వాడే 5 కాస్ట్లీ వస్తువులివే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved